Lord Shiva: బిల్వ పత్రం ఔషధ గుణాల నిధి.. మహాదేవునికి ఎందుకు ప్రీతిపాత్రమో తెలుసా!

బిల్వ పత్రం ఔషధ గుణాల నిధి అని నమ్ముతారు. మహా దేవుడు సముద్ర మదన సమయంలో ఉద్భవించిన  విషం తాగి.. ఆ విష ప్రభావంతో శరీరంలో భరించలేని మంటలు.. నొప్పితో బాధపడుతున్నప్పుడు.. శివయ్య బాధను తగ్గించడానికి సకల దేవతలు అనేక వస్తువులను సమర్పించారట. అయితే అలా అలాంటి వస్తువుల్లో బిల్వ పత్రం ఒకటి. శివయ్యకు బిల్వ పత్రం సమర్పించిన తర్వాత విషయాన్నీ హరించే గుణం ఉన్న బిల్వ పత్రం వలన శివయ్య శరీరంలోని విష ప్రభావం తగ్గి మంటల నుంచి ఉపశమనం లభించింది.

Lord Shiva: బిల్వ పత్రం ఔషధ గుణాల నిధి.. మహాదేవునికి ఎందుకు ప్రీతిపాత్రమో తెలుసా!
Lord Shiva Puja
Follow us
Surya Kala

|

Updated on: Dec 04, 2023 | 7:25 AM

హిందూ మతంలో సోమవారం లయకారుడైన శివయ్యకు అంకితం చేయబడింది. మహాదేవునికి ఈ రోజు  ప్రత్యేక పూజలు చేస్తారు. లింగ రూపంలో ఉన్న శివయ్యను నియమ నిష్టలతో ఆచారాలు పద్దతులతో పూజిస్తే  చాలా సంతోషిస్తాడు. భక్తుల కోరిన ప్రతి కోరికను నెరవేరుస్తాడు. మహాదేవుడిని ఆరాదించే సమయంలో బిల్వ పత్రాన్ని ఖచ్చితంగా సమర్పిస్తారు. జలం, బిల్వపత్రాలను సమర్పించడం ద్వారా మహాదేవుడు చాలా త్వరగా సంతోషిస్తాడని చెబుతారు. బిల్వ పత్రం శివయ్య పూజకు అందుబాటులో లేక పొతే.. ఒకసారి సమర్పించిన బిల్వపత్రాన్ని కడిగి మళ్ళీ సమర్పించినా సంతృప్తి చెంది సంతోషించే భోళాశంకరుడు.  అయితే త్రినేత్రుడికి పియ్రమైన బిల్వపత్రంలో అనేక ఔషధ గుణాలున్నాయి అన్న విషయం తెలుసా..!  ఈ రోజు బిల్వ పత్రం విశిష్టత గురించి తెలుసుకుందాం..

బిల్వ పత్రం ఔషధ గుణాల నిధి అని నమ్ముతారు. మహా దేవుడు సముద్ర మదన సమయంలో ఉద్భవించిన  విషం తాగి.. ఆ విష ప్రభావంతో శరీరంలో భరించలేని మంటలు.. నొప్పితో బాధపడుతున్నప్పుడు.. శివయ్య బాధను తగ్గించడానికి సకల దేవతలు అనేక వస్తువులను సమర్పించారట. అయితే అలా అలాంటి వస్తువుల్లో బిల్వ పత్రం ఒకటి. శివయ్యకు బిల్వ పత్రం సమర్పించిన తర్వాత విషయాన్నీ హరించే గుణం ఉన్న బిల్వ పత్రం వలన శివయ్య శరీరంలోని విష ప్రభావం తగ్గి మంటల నుంచి ఉపశమనం లభించింది. అప్పటి నుంచి బిల్వ పత్రం మహాదేవుడికి చాలా ప్రియమైనదిగా మారిందట. నాటి నుండి నేటి వరకు శివయ్య పూజలో బిల్వ పత్రం సమర్పిస్తారు.

ఔషధ గుణాల నిధి బిల్వ పత్రం..

  1. అల్సర్ : పొట్టలో వేడి లేదా కడుపు నొప్పి కారణంగా నోటిలో బొబ్బలు ఏర్పడతాయి. అటువంటి పరిస్థితిలో.. ఈ బిల్వ ఆకులను నమిలితే ఉపశనం కలుగుతుంది. అంతేకాదు అల్సర్ల నుండి చాలా ఉపశమనాన్ని అందిస్తుంది. కడుపులో వేడిని తగ్గిస్తుంది.
  2. కీళ్లనొప్పులు: ఎవరైనా కీళ్లనొప్పులతో బాధపడుతుంటే బిల్వ పత్రాన్ని వేడి చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో కట్టాలి. ఇది చాలా ఉపశమనాన్ని అందిస్తుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. రుతుక్రమం సక్రమంగా లేకపోయినా: స్త్రీలలో రుతుక్రమం సరిగా లేకున్నా అధిక రక్తస్రావం జరిగినా బిల్వ పత్రాన్ని, జీలకర్రను కలిపి మెత్తగా నూరి పాలలో కలిపి తాగాలి. దీని వల్ల చాలా ప్రయోజనం ఉంది. ఈ రెమెడీ ల్యుకోరియా సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
  5. శ్వాసకోశ వ్యాధి: ఇంట్లో శ్వాసకోశ రోగంతో ఇబ్బంది పడుతున్నట్లు అయితే, బిల్వ పాత్ర తీగ ఆకులతో చేసిన కషాయాన్ని ఇవ్వాలి. దీని వల్ల చాలా ప్రయోజనం ఉంది. బిల్వ పత్ర కాషాయం జ్వర తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
  6. పిల్లలలో విరేచనాలు : పిల్లలకు డయేరియా సమస్య ఉంటే..  అప్పుడు ఒక చెంచా బిల్వ పాత్ర ఆకుల రసం తీసి పిల్లలకు త్రాగడానికి ఇవ్వండి. చాలా విశ్రాంతి లభిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు