Pochamma Temple: పోచారంలో వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన పూజలు.. అమ్మవార్లకు బంగారు బోనం సమర్పించిన కవిత.. హెలీక్యాప్టర్‌తో పూల వర్షం
పోచారంలో నూతనంగా నిర్మించిన ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠాపన పూజలు వైభవంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, బోనాలతో మహిళలు శోభాయాత్రగా వెళ్లారు. వేడుకల్లో పాల్గొన్న కవిత అమ్మవార్లకు బంగారు బోనం సమర్పించారు. నూతన ఆలయంపై, ఎమ్మెల్సీపై ఆకాశం నుంచి హెలీక్యాప్టర్‌తో పూల వర్షం కురిపించారు నిర్వహకులు. వేడుకల్లో మంత్రి మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు
రంగారెడ్డి జిల్లాలో పోచారంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ, మహంకాళి, ఈదమ్మ, గడిమైసమ్మ ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠాపన పూజలు వైభవంగా నిర్వహించారు. పోచారంలో కౌన్సిలర్ బద్దం మమతా జగన్‌మోహన్‌రెడ్డి, దాతలతో కలసి దాదాపు రూ.2కోట్ల వ్యయంతో నాలుగు గ్రామ దేవతల ఆలయాలను నిర్మించారు. మూడురోజులుగా విగ్రహ ప్రతిష్ఠాపన పూజలు చేసి అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్ఠించారు. పోచారంలో వెయ్యి బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీకి ఘన స్వాగతంగా స్వాగతం పలికేరారు. పోచమ్మ, మహంకాళి ఈదమ్మ, గడిమైసమ్మ నూతన ఆలయాల్లో ప్రతిష్ఠించిన అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు ఎమ్మెల్సీ కవిత.
అమ్మవార్లకు బంగారు బోనం సమర్పించారు కవిత. పోచారంలో నూతన ఆలయాల్లో విగ్రహ ప్రతిష్ఠాపనకు ఎమ్మెల్సీ కవిత హాజరు కావడంతో నూతన ఆలయంపై, ఎమ్మెల్సీపై ఆకాశం నుంచి హెలీక్యాప్టర్‌తో పూల వర్షం కురిపించారు నిర్వహకులు. వేడుకల్లో మంత్రి మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లు, బోనాలతో వందలాదిగా గ్రామస్తులు శోభాయాత్రగా వెళ్లారు. దీంతో ఊరంతా భక్తులతో సందడి మారింది. గ్రామంలో ఆధ్మాత్మిక వాతావరణం నెలకొంది.
మహిళలు బోనం కుండలతో ఆలయాల ముందులు బారులు తీరారు. ఆలయానికి వెళ్లి వెళ్లి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. కొందరు భక్తులు భక్తిశ్రద్ధలతో నైవేద్యాన్ని ప్రత్యేక పాత్రలో వండుకుని అమ్మవారి సన్నిధికి తీసుకొచ్చారు. మొక్కుబడులు చెల్లించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామస్తులంతా కలిసి పండుగ జరుపుకున్నట్లు నిర్వహకులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..