Maasa Shivaratri: నేడు మాస శివరాత్రి, ప్రదోష వ్రతం.. సాయంత్రం శుభ సమయంలో ఇలా పూజించండి

మంగళవారం కావడంతో ఈ ప్రదోష వ్రతాన్ని భౌమ ప్రదోష వ్రతం అంటారు. భౌమ ప్రదోషం రోజున శివుడు, పార్వతితో పాటు హనుమంతుడిని పూజించే సంప్రదాయం ఉంది. త్రయోదశి తిథి జూన్ 4వ తేదీ మధ్యాహ్నం 12.18 గంటలకు ప్రారంభమై జూన్ 4వ తేదీ రాత్రి 10.01 గంటలకు ముగుస్తుంది. ఈరోజు మాస శివరాత్రి పవిత్ర దినం. ప్రదోష వ్రతంతో పాటు మాస శివరాత్రి ఉపవాసం కూడా ఆచరిస్తారు. వైశాఖ మాసం కృష్ణ పక్ష చతుర్దశి తిథి ఈరోజు రాత్రి 10.02 గంటలకు ప్రారంభమై మర్నాడు అంటే జూన్ 5వ తేదీ రాత్రి 7.54 గంటలకు ముగుస్తుంది.

Maasa Shivaratri: నేడు మాస శివరాత్రి, ప్రదోష వ్రతం.. సాయంత్రం శుభ సమయంలో ఇలా పూజించండి
Masa Shivaratri Puja
Follow us
Surya Kala

|

Updated on: Jun 04, 2024 | 7:37 AM

మాస శివరాత్రి శివునికి అంకితం చేయబడింది. శివుని ఆశీర్వాదం కోసం ప్రదోష వ్రతం కూడా పాటిస్తారు. ఈ ఏడాది జూన్ 4 చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మాస శివరాత్రి, ప్రదోష వ్రతం రెండూ ఈ రోజున జరుపుకుంటున్నారు. అటువంటి పరిస్థితిలో శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి, శివుడి అనుగ్రహం పొందడానికి ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. విశ్వాసం ప్రకారం ఈ రోజున నియ నిష్టలతో పూజించడం శివుడిని పవిత్ర సమయంలో ఉపవాసం ఉండటం ద్వారా మహాదేవుని అనుగ్రహం భక్తులపై కురుస్తుంది.

ప్రదోష వ్రతం 2024 ఈరోజు ప్రదోష వ్రతం ఆచరిస్తారు. మంగళవారం కావడంతో ఈ ప్రదోష వ్రతాన్ని భౌమ ప్రదోష వ్రతం అంటారు. భౌమ ప్రదోషం రోజున శివుడు, పార్వతితో పాటు హనుమంతుడిని పూజించే సంప్రదాయం ఉంది. త్రయోదశి తిథి జూన్ 4వ తేదీ మధ్యాహ్నం 12.18 గంటలకు ప్రారంభమై జూన్ 4వ తేదీ రాత్రి 10.01 గంటలకు ముగుస్తుంది.

మాస శివరాత్రి 2024 ఈరోజు మాస శివరాత్రి పవిత్ర దినం. ప్రదోష వ్రతంతో పాటు మాస శివరాత్రి ఉపవాసం కూడా ఆచరిస్తారు. వైశాఖ మాసం కృష్ణ పక్ష చతుర్దశి తిథి ఈరోజు రాత్రి 10.02 గంటలకు ప్రారంభమై మర్నాడు అంటే జూన్ 5వ తేదీ రాత్రి 7.54 గంటలకు ముగుస్తుంది.

ఇవి కూడా చదవండి

పూజ శుభ సమయం హిందూ క్యాలెండర్ ప్రకారం భౌమ ప్రదోష పూజకు అనుకూలమైన సమయం రాత్రి 7.16 నుండి 9.18 వరకు ఉంటుంది. మాస శివరాత్రి ఉపవాసం నిశిత కాలంలో పూజించబడుతుంది. అందుకే ఈరోజు మాస శివరాత్రి పూజ సమయం రాత్రి 11:59 నుంచి 12:40 వరకు ఉంటుంది.

శివుడిని పూజ విధానం మత విశ్వాసం ప్రకారం ఉదయం నిద్రలేచి స్నానం చేసిన తర్వాత, శుభ్రమైన బట్టలు ధరించాలి. ఆ తరువాత, గుడికి వెళ్లి లేదా ఇంట్లో శివుని ముందు నెయ్యి దీపం వెలిగించి, హృదయపూర్వకంగా పూజించండి. శివ చాలీసా పఠించిన తర్వాత, పంచామృతంతో శివుడు లేదా శివలింగానికి స్నానం చేయండి. ఆ తరువాత శుభ్రమైన నీటితో మళ్లీ స్నానం చేసి, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, బియ్యం, ఖీర్ సమర్పించి.. హారతితో పూజ ముగించి, ఇంట్లో సుఖ సంతోషాలు, శ్రేయస్సు కోసం ప్రార్థించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు