Sankranti 2022: 400 అడుగుల భోగి దండతో.. సంక్రాంతి అంటే ఊరంతా కలిసి చేసుకునే పండగ అని కొత్త అర్ధం చెప్పిన గ్రామం..
Makar Sankranti 2022- Viral Video: ఆంధ్రుల అతిపెద్ద పండగ సంక్రాంతి (pongal). మూడు రోజులపాటు సాంప్రదాయంగా జరుపుకునే ఈ పండగ కోసం ఉపాధి, ఉద్యోగం వ్యాపారం కోసం ఎక్కడెక్క్కకడ..
Makar Sankranti 2022- Viral Video: ఆంధ్రుల అతిపెద్ద పండగ సంక్రాంతి (pongal). మూడు రోజులపాటు సాంప్రదాయంగా జరుపుకునే ఈ పండగ కోసం ఉపాధి, ఉద్యోగం వ్యాపారం కోసం ఎక్కడెక్క్కకడ ఉన్నవారు కూడా సొంత ఊళ్లకు చేసుకుంటారు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల తో కలిసి సంతోషంగా సంక్రాంతి(Sankranti) వేడుకలలో పాల్గొంటారు. ఇక సంక్రాంతి అంటే తెలుగువారి అందరికీ గుర్తుకోచ్చేంది కోనసీమ (Konaseema). ధనుర్మాసం(Dhanurmasam) మొదలైందంటే చాలు ఇక్కడ ప్రతి ఇంట్లో పండగ వచ్చెసినట్లే. నెలరోజుల ముందు నుంచే ఇంటి ముందు అందమైన రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలతో మొదలవుతాయి. అంతేకాదు.. చిన్న పిల్లాలు ఉన్నవారు భోగి పండగ కోసం ఆవు పేడతో భోగిపిడకలు చేయడం మొదలు పెడతారు. . భోగి పిడకలను చేసి.. వాటిని దండగా గుచ్చి భోగి కోసం ఆత్రుతగా ఎదురుచుస్తారు.
భోగి, పెద్దల పండగ, కనుమ లతో పాటు.. నాల్గో రోజున ముక్కనుమగా కోనసీమ వాసులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి లో మొదటి రోజు భోగి పండగగా జరుకుంటారు. ఈ భోగి పండగ రోజున భోగి మంటలు వేస్తారు. ఈ భోగి మంటల్లో భోగి దండలను వేయడం కోసం పిల్లలు పెద్దలు తెల్లవారు జామునే నిద్ర లేచి.. అభ్యంగస్నానమాచరించి.. కొత్త బట్టలు కట్టుకుని ఈ భోగి దండలను తీసుకుని మంటల్లో వేసి.. వస్తారు. అయితే ఈ భోగి దండను ఒకటి కాదు రెండు కాదు 400 మీటర్ల మేరకు గుచ్చి.. ఓ గ్రామం రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
తూర్పు గోదావరి జిల్లా రాజోలులో ఏకంగా భోగి దండను 400 అడుగుల మేర గుచ్చారు. ఈ దండను రెడీ చేయడానికి ఊరంతా ఏకమైంది. పెద్దలు, పిల్లలు కలిసి నెల రోజుల నుంచి భోగి పిడకలను తయారు చేసి దానిని దండగా గుచ్చి.. నిన్న భోగి పండగ రోజున పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అనే బేధం లేకుండా ఊరంతా కలిసి సంబరంగా ఆ దండను భోగి మంట దగ్గరకు మోసుకుని వచ్చారు. ఆ దండను భోగి మంటల్లో వేసి.. ప్రజలు సుఖ శాంతులతో జీవించాలని కోరుకున్నారు. పండగ అంటేనే పది మంది కలిసి చేసుకునేది అని అర్ధం.. అయితే ఈ గ్రామం ఇంకొంచెం ముందుకు వెళ్ళి.. సంక్రాంతి అంటేనే .. ఊరంతా కలిసి చేసుకునేది అనే కొత్త నిర్వచనం ఇచ్చారు.
Also Read: నేడు పెద్దల పండగ.. ఈరోజు ఏ రాశివారు ఎలాంటి రాశి ఫలాలను పొందుతారో తెలుసుకోండి..