Horoscope Today: నేడు పెద్దల పండగ.. ఈరోజు ఏ రాశివారు ఎలాంటి రాశి ఫలాలను పొందుతారో తెలుసుకోండి..

Horoscope Today (15-01-2022): ఈరోజు తెలుగు వారికి పెద్దల పండగ. తమ పూర్వికులను స్మరిస్తూ.. తమ పనులను మొదలు పెడతారు. శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా ఏది మొదలు...

Horoscope Today: నేడు పెద్దల పండగ.. ఈరోజు ఏ రాశివారు ఎలాంటి రాశి ఫలాలను పొందుతారో తెలుసుకోండి..
Follow us
Surya Kala

|

Updated on: Jan 15, 2022 | 6:21 AM

Horoscope Today (15-01-2022): ఈరోజు తెలుగు వారికి పెద్దల పండగ. తమ పూర్వికులను స్మరిస్తూ.. తమ పనులను మొదలు పెడతారు. శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా ఏది మొదలు పెట్టాలన్నా చాలామంది మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల (Horoscope)వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జనవరి 15వ తేదీ ) శనివారం (Satur day) రోజున రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులను స్నేహితుల సహకారంతో పూర్తి చేస్తారు.  బంధు, మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు.  ప్రతిభకు  తగిన ప్రశంసలను అందుకుంటారు.

వృషభ రాశి: ఈ రాశి వారు ఈరోజు  ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కీలక పనులలో మీ సొంత నిర్ణయాలు వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి. ప్రయాణాలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.  ఆర్ధికంగా లాభపడతారు, నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. భవిష్యత్ కోసం మంచి ప్రణాళికలను రచిస్తారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు  ఆత్మీయులను కలుసుకుంటారు. చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో స్నేహంగా ఉండాలి.  వాదనలకు దూరంగా ఉండడం మంచిది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. మానసికంగా సంతోషంగా ఉంటారు. తీసుకున్న నిర్ణయాలతో సుభాఫలితలను అందుకుంటారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ప్రారంభించిన పనులను సకలంలో పూర్తి చేస్తారు. ధార్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో జగ్రత్తగాస్ ఉండాల్సి ఉంది. మీ పట్టుదల, కృషి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆరోగ్య పరంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. అధిక వ్యయం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారికి  స్థిరమైన ఆలోచనలు కలిగి ఉండేలా చూసుకోవాలి. మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలను పొందుతారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులను కలుస్తారు. ఆర్ధికంగా సుభాఫలితాలను అందుకుంటారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు వృత్తి, వ్యాపార రంగంలోని వారు లాభాలను అందుకుంటారు. అధికారుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు వృత్తి, ఉద్యోగ రంగంలోని వారు శుభవార్త వింటారు.  ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మిశ్రమ ఫలితాలను అందుకుంటారు.

మీన రాశి:  ఈరోజు ఈరాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో మంచి ప్రోత్సాహం లభిస్తుంది.  బంధు, మిత్రుల సహకారంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. అధికారులతో మంచి రిలేషన్ ఏర్పడుతుంది. విద్యార్ధులకు అనుకూలంగా ఉంది.

Note: రాశిఫలాలు అనేవి నమ్మకానికి సంబంధించినవి.. జ్యోతిష్య శాస్త్రం చెప్పినదానికి అనుగుణంగా ఇక్కడ ఈరోజు రాశిఫలాలు ఇవ్వడం జరిగింది.

Also Read:

సంక్రాంతి రోజున గుమ్మడికాయను సమర్పిస్తే.. కోరిన కోరికలు తీర్చే వీరభద్రుడు ఎక్కడో తెలుసా..

తిరుమల క్యూ లైన్ లో బారులు తీరిన భక్తులు.. ఏర్పాట్లపై అసంతృప్తి.. మహాద్వారం వద్ద ఆందోళన