AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vidura Niti: ఇటువంటి వ్యక్తులకు నాలుకే ఆయుధం.. పొరపాటున కూడా నమ్మొద్దు అంటున్న విదుర నీతి.. ఎందుకంటే

మహాభారతంలో అతి ముఖ్యమైన పాత్రలలో ఒకటి విదురుడు. యమధర్మ రాజు అంశగా దేవరన్యాయం వల్ల వ్యాసునికి అంబ దాసీకి విదుర జన్మించాడు. ధృత రాష్ట్రుడికి తమ్ముడు.. అతని కొలువులో ముఖ్యమంత్రి. విదురుడు నీతిలో అనేక నైతిక, ఉపయోగకరమైన విషయాలను చెప్పాడు. వాటిలో ఇలాంటి లక్షణాలు వ్యక్తులు నమ్మదగినవారు కాదని చెప్పాడు. దీనికి కారణం వీరి అంతర్గత స్వభావమే. విదురు చెప్పిన లక్షణం ఏమిటంటే..

Vidura Niti: ఇటువంటి వ్యక్తులకు నాలుకే ఆయుధం.. పొరపాటున కూడా నమ్మొద్దు అంటున్న విదుర నీతి.. ఎందుకంటే
Vidura Niti
Surya Kala
|

Updated on: Jul 09, 2025 | 5:10 PM

Share

మహాభారత కాలంలో విదురుడు అత్యుత్తమ మనస్తత్వవేత్త, మానవ స్వభావాన్ని బాగా తెలుసుకున్న మహనీయుడు. విదుర నీతి, చాణక్య నీతి, పంచత్ర కథలు, హితోపదేశ కథలు చదివిన వ్యక్తి.. అవతలి వ్యక్తి హావభావాలు, సంభాషణల ద్వారా తన ముందు వారు ఎలాంటి వారో సరిగ్గా అంచనా వేయగలడు. అయితే ఈ రోజు విదురుడు చెప్పిన నీతిలోని కొంతమందికి నాలుకే ప్రధాన ఆయుధం.. ముఖ్యంగా అతిశంగా మాట్లాడే వ్యక్తులు ఎప్పుడూ నమ్మదగినవారు కాదని చెప్పాడు.

నాలుక గురించి విదురుడు చెప్పిన మాటలు ప్రపంచంలోని ప్రజలందరికీ వర్తిస్తాయి. క్లిప్పర్ లాగా కదులుతున్న నాలుక అంటే ఎక్కువగా మాట్లాడటం అని అర్ధం. ఈ సలహాకు అర్ధం గురించి తెలుసుకునేందుకు లోతుగా వెళితే.. మాటల వలలో చిక్కుకోవడం అని. అంటే మహాత్మా విదూరుడు చెప్పిన ప్రకారం ఎక్కువగా మాట్లాడే వ్యక్తి ఎన్నడూ నమ్మదగినవాడు కాదు. వీరు తమ మాటలనే ఆయుధంగా మార్చి ఇతరులను ఏమారుస్తారని.. తమ మాటలవలలో ఇతరులు చిక్కుకునేలా చేసి మోసం చేస్తారు. మరొక అర్థం ఏమిటంటే ఎక్కువగా మాట్లాడటం, అవివేకమైన విషయాలు చెప్పడం ద్వారా ఇతరులను ఇబ్బందుల్లో పడేస్తారు.

తక్కువ మాట్లాడటం తెలివితేటలకు సంకేతంగా పరిగణించబడుతుంది. తక్కువ తెలివితేటలు ఉన్నవారు లేదా మూర్ఖులు ఎక్కువగా మాట్లాడతారు. అంటే పిచ్చివాడికి రాత్రి, పగలకు తేడా తెలియదు.. ఎప్పుడుబడితే అప్పుడు.. పగలు, రాత్రి పగలు అనే తేడా లేకుండా అర్ధంలేని మాటలు మాట్లాడుతూనే ఉంటాడు. అందుకనే విదురుడు మాటని అదుపులో పెట్టుకోలేని వ్యక్తితో స్నేహం కూడా ప్రమాదం అని.. నాలికను సరిగ్గా ఉపయోగించని వ్యక్తి తనని నమ్మిన వారికే హానిని కలిగిస్తాడని పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

తక్కువ మాట్లాడడం, జ్ఞానంతో నిండిన తన మాటల ద్వారా మహాత్మా విదురుడు మానవుని అంతర్గత మనస్సును అర్థం చేసుకున్నాడు. తక్కువ మాట్లాడే వ్యక్తి తన మాటలను ఆలోచనాత్మకంగా ఎంచుకుంటాడని, దాని కారణంగా అతని మాటలలో గంభీరత, సత్యం ఉంటుందని విదుర నీతిలో చెప్పబడింది. అలాంటి వ్యక్తిని తెలివైనవాడు, నమ్మదగినవాడుగా పరిగణించాలని సూచించాడు.

విదుర ప్రకారం ఎక్కువగా మాట్లాడే వ్యక్తికి గంభీరత, స్థిరత్వం లోపించవచ్చు. ఈ గుణం వీరిని నమ్మదగిన వారు కాదు అనేలా ఇతరులకు చూపిస్తుంది. ఎక్కువగా మాట్లాడే వ్యక్తులు.. ఇతరుల మనస్సులలో శత్రుత్వ భావం లేదా అసూయ భావనను సృష్టించవచ్చని.. వీరి మాటలు ఇతరులను అవమానించవచ్చని లేదా హాని కలిగించవచ్చని.. అప్పుడు సమాజంలో అశాంతికి కారణమవుతుందని విదుర నీతి పేర్కొంది. అంతేకాదు ఎక్కువగా మాట్లాడే వ్యక్తి తన మాటలతో ఇతరులతో సంబంధాలను చెడగొట్టగలడు. అంటే సాధువులు మౌనంగా ఉంటారని, జ్ఞానులు మాట్లాడతారని, మూర్ఖులు కారణం లేకుండా వాదిస్తారని చెప్పాడు విదురుడు తన నీతిలో.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.