10-10-10 Rule: స్క్రీనింగ్ సమయం ఎక్కువ అవుతుందా.. కంటి ఆరోగ్యం కోసం10-10-10 నియమాన్ని పాటించండి..
ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చిన్న, పెద్ద ఇలా అందరూ కళ్ళజోడు ధరించాల్సి వస్తుంది. వివిధ కారణాలతో కళ్ళ సమస్యని ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం మొబైల్ , ల్యాప్‌టాప్ ముందు ఎప్పుడూ కూర్చోవడం. అయితే ఎవరైనా తమ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే..10-10-10 నియమాన్ని పాటించండి. ఈ రోజు కళ్ళను ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ నియమాన్ని ఎలా పాటించాలో తెలుసుకుందాం.

10-10-10 అనేది కంటి సంరక్షణకు ఒక నియమం. ఇది కళ్ళకు చాలా ముఖ్యం. నేటి డిజిటల్ ప్రపంచంలో ప్రతి పని మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌ల ద్వారా జరపాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో ఇది కళ్ళపై చాలా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. కంటి చూపు తగ్గడం, కళ్ళ మంట, కళ్ళు పొడిబారడం వంటి సమస్యలు సర్వసాధారణ విషయంగా మారాయి. వివిధ రకాల ఉద్యోగాలను చేస్తూ.. ల్యాప్‌టాప్ పై 8 నుంచి 9 గంటలు గడుపుతున్నారు. దీంతో కళ్ళ ఆరోగ్యాన్ని ప్రభావితం అవుతుంది. అటువంటి పరిస్థితిలో కళ్ళను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.
కళ్ళు మన శరీరంలో చాలా సున్నితమైన అవయవాలు. వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. అటువంటి పరిస్థితిలో ఎక్కువ సమయం స్క్రీన్‌పై గడిపినా.. కంటి చూపు క్షీణించకూడదనుకుంటే 10-10-10 నియమాన్ని పాటించాలి. ఈ రోజు 10-10-10 నియమం ఏమిటి తెలుసుకుందాం. దీనిని ఎలా పాటించవచ్చు? ఈ నియమాలను పాటించడం వలన కళ్ళు ఎలాంటి ప్రయోజనాలను పొందుతాయో తెలుసుకుందాం.
10-10-10 నియమం ఏమిటి? ఈ నియమాన్ని ఒక ఐ స్పెషలిస్ట్ చెప్పారు. అంటే 10 నిమిషాల తర్వాత, మీరు 10 సెకన్ల పాటు 10 అడుగుల దూరం చూడాలి. అంటే ఎవరైనా ల్యాప్‌టాప్ లేదా మొబైల్ ఉపయోగిస్తుంటే.. ప్రతి 10 నిమిషాలకు విరామం తీసుకొని ఈ నియమాన్ని పాటించాలి. 10 సెకన్ల పాటు, మీరు 10 అడుగుల దూరంలో ఉన్న దేనిపైనా దృష్టి పెట్టాలి. దీనిని చూస్తూ ఉండాలి. ఈ నియమాన్ని ఎక్కడైనా పాటించవచ్చు. ఈ నియమాన్ని పాటించే ముందు కుర్చీ నుంచి లేవాల్సిన అవసరం కూడా ఉండదు.
10-10-10 నియమాన్ని పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు స్క్రీన్ ముందు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కళ్ళలో దురద, పొడిబారడం, మంట వంటి సమస్యలు కలుగుతాయి. అటువంటి పరిస్థితిలో కళ్ళకు కొన్ని నిమిషాల పాటు ఉపశమనం కలిగించడానికి ఈ నియమం రూపొందించబడింది. దీనిని పాటించడం ద్వారా కళ్ళు అనేక ప్రయోజనాలను పొందుతాయి.
కంటి అలసట తగ్గుతుంది నిరంతరం స్క్రీన్ వైపు చూడటం వల్ల కంటి కండరాలు అలసిపోతాయి. ఈ నియమం కళ్ళకు విరామం ఇస్తుంది. అలసటను తొలగిస్తుంది. అలాగే ఏకాగ్రత, ఉత్పాదకత పెరుగుతుంది. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కళ్ళ అలసట తొలగిపోతుంది. కళ్ళు విశ్రాంతి పొందినప్పుడు మనస్సు కూడా తాజాగా ఉంటుంది. పనిపై దృష్టి పెట్టడం సులభం అవుతుంది.
డ్రై ఐ సిండ్రోమ్ నుంచి ఉపశమనం స్క్రీన్‌ను ఎక్కువసేపు చూసిన తర్వాత కళ్ళు పొడిబారడం ప్రారంభిస్తాయి. 10-10-10 నియమాన్ని పాటించడం ద్వారా రెప్పవేయడం పెరుగుతుంది, ఇది తేమను నిర్వహిస్తుంది. దీనితో పాటు దృష్టి కూడా మెరుగుపడుతుంది. ఎందుకంటే సమీపంలోని వస్తువులను నిరంతరం చూడటం ద్వారా.. సుదూర దృష్టి బలహీనపడుతుంది. ఈ నియమంతో కళ్ళ దృష్టి సామర్థ్యం సమతుల్యంగా ఉంటుంది.
మైగ్రేన్, తలనొప్పి నుంచి ఉపశమనం స్క్రీన్ వల్ల కళ్ళపై ఒత్తిడి తలనొప్పికి కారణమవుతుంది. 10-10-10 నియమం కళ్ళపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది తలనొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. అలాగే ఒత్తిడి స్థాయి కూడా తగ్గుతుంది. ఎందుకంటే కళ్ళు విశ్రాంతి తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.
స్క్రీన్ సమయం ప్రభావాన్ని తగ్గిస్తుంది చిన్న చిన్న విరామాలు స్క్రీన్ హానికరమైన కిరణాల నుంచి కంటి చూపుని రక్షిస్తాయి. కళ్ళను సురక్షితంగా ఉంచుతాయి. ఈ అలవాటు కళ్ళను సకాలంలో రక్షిస్తుంది. వయస్సుతో పాటు వచ్చే కంటి వ్యాధులను నివారిస్తుంది. దృష్టి లోపం పెరగకుండా కూడా నిరోధించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








