AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Shani: శనీశ్వరుడు అంటే భయమేల.. కర్మ ప్రదాత నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే..

సూర్యుడు, ఛాయాదేవిల తనయుడు శనీశ్వరుడు. నవ గ్రహాల్లో ఒకడు. అంతేకాదు హిందువులు న్యాయ దేవుడు, కర్మ ప్రదాత అని నమ్ముతారు. శనీశ్వరుడు మనిషి కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తాడు. అంటే మనిషి చేసిన మంచి, చెడు కర్మలను అనుసరించి ఫలితాలను ఇస్తాడు. అయితే శనీశ్వరుడు అంటే అందరూ భయపడతారు. కానీ ఈ కర్మ ప్రదాత నుంచి ప్రతి మనిషి నేర్చుకోవలసిన జీవిత పాఠాలు కూడా చాలా ఉన్నాయి. ఈ రోజు శనీశ్వరుడు నుంచి నేర్చుకోవలసిన జీవిత పాఠాలు ఏమిటో చూద్దాం.

Lord Shani:  శనీశ్వరుడు అంటే భయమేల.. కర్మ ప్రదాత నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే..
Lord Shani
Surya Kala
|

Updated on: Jul 09, 2025 | 3:47 PM

Share

శనీశ్వరుడు న్యాయానికి దేవుడు. శనీశ్వరుడు ఎల్లప్పుడూ కర్మ ఆధారంగా తగిన ఫలితాలను ఇస్తాడు. అందుకనే ఇతడిని కర్మ ప్రధాత అని అంటారు. శనీశ్వరుడి ఆగ్రహానికి గురైతే జీవితంలో కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ఆయన అనుగ్రహం ఎవరిపైన అయినా ఉంటే, విజయం నెమ్మదిగా సొంతం అవుతుంది. అయితే శనీశ్వరుడు ఆగ్రహం ఎన్ని కష్టాలు తెస్తుందో.. ఆయన అనుగ్రహం కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఇక శనీశ్వరుడిలోని కొన్ని విషయాలను నేర్చుకోవడం.. వాటిని జీవితానికి అన్వయించుకోవడం వలన మంచి జీవితం లభిస్తుంది.

శనీశ్వరుడు నుంచి నేర్చుకోవలసిన జీవిత పాఠాలు:

కష్టాలను ఎదుర్కోవడం: కొన్నిసార్లు శనీశ్వరుడు వలన ఇబ్బందులు తలెత్తవచ్చు. ఆ కష్టాలు గత కర్మల వల్ల కలుగుతాయి. ఆ కష్టాలను ఎలా ఎదుర్కోవాలో శనీశ్వరుడు మనకు నేర్పుతాడు. అందువలన కష్టాలను ఎదుర్కోనే కళ మనకు తెలిస్తే.. మనం బలంగా మారవచ్చు.

ఇవి కూడా చదవండి

క్రమశిక్షణ: శనీశ్వరుడు క్రమశిక్షణను కూడా బోధిస్తాడు. ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి? సమయానికి అనుగుణంగా ఏ పనులు చేయాలో శనీశ్వరుడు క్రమశిక్షణ ద్వారా జీవిత పాఠాన్ని నేర్చుకోవచ్చు.

సహనం: మనం శనీశ్వరుడు నుంచి సహనం, పట్టుదల వంటి గుణాలను నేర్చుకోవచ్చు. అదేవిధంగా శనిదేవుడి నుంచి పట్టుదలను పాటంగా నేర్చుకోవచ్చు. అలాగే సవాళ్లను ఎదుర్కోవడం ద్వారా మనం సహనంతో పాటు బాధ్యతను నేర్చుకోవచ్చు.

బాధ్యత: జీవితంలో బాధ్యత తీసుకోవడం చాలా ముఖ్యం. శనీశ్వరుడునుండి మనం బాధ్యతాయుతంగా ఎలా వ్యవహరించాలో, నిర్ణయాలు ఎలా తీసుకోవాలో నేర్చుకోవచ్చు.

ఆత్మపరిశీలన: శనీశ్వరుడు ఒక వ్యక్తికి తన తప్పులను, లోపాలను గుర్తించి, ఆ తప్పులను సరిదిద్దుకుని, సానుకూలంగా జీవించే అవకాశాన్ని ఇస్తాడు. అలాగే మనం సరైన మార్గాన్ని అనుసరించాలని, సరైన మార్గాన్ని అనుసరిస్తేనే జీవితంలో మంచి జరుగుతుందని శని నుండి జీవిత పాఠం నేర్చుకోవచ్చు.

కర్మ పాఠాలు: శనీశ్వరుడు కర్మకు సంబంధించినావాడు. కనుక శనీశ్వరుడి కోసం చర్యల పరిణామాలను హైలైట్ చేస్తుంది. మనం మంచి చేస్తే మనకు మంచి వస్తుంది. మనం ఎవరికైనా చెడు చేస్తే మనకు చెడు వస్తుంది అనే కర్మ పాఠాన్ని శనీశ్వరుడు నుంచి నేర్చుకోవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌