AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: నిద్రపోతున్న సమయంలో తల దగ్గర ఈ వస్తువులు పెట్టుకునే అలవాటు ఉందా.. వెంటనే గుడ్ బై చెప్పండి.. లేదంటే..

వాస్తు శాస్త్ర నియమాలను అనుసరిస్తూ మనం జీవన నియమాలను ఏర్పాటు చేసుకుంటాం. అంతేకాదు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణం, ఇంట్లోని పెట్టుకునే వస్తువులను ఏర్పాటు చేసుకోవడం వలన శుభాలు కలుగుతాయని నమ్మకం. అయితే మనం తెలిసి తెలియక చేసిన ఇంట్లోని వాస్తు లోపాలు అనేక ఇబ్బందులను సృష్టించే అవకాశాలున్నాయి. అటువంటి నియమాలలో ఒకటి మంచం దగ్గర పెట్టే కొన్ని వస్తువులు. ఈ రోజు నిద్ర పోయే సమయంలో మంచం దగ్గర, మన తల దగ్గర పెట్టకూడని కొన్ని వస్తువులున్నాయి. అవి ఏమిటంటే..

Vastu Tips: నిద్రపోతున్న సమయంలో తల దగ్గర ఈ వస్తువులు పెట్టుకునే అలవాటు ఉందా.. వెంటనే గుడ్ బై చెప్పండి.. లేదంటే..
Vastu Tips For Better Sleep
Surya Kala
|

Updated on: Jul 09, 2025 | 3:20 PM

Share

మన జీవితంలో కొన్ని విషయాలు చాలా ముఖ్యమైనవి. వాటిలో ఒకటి నిద్ర. ప్రతి ఒక్కరికీ తగినంత నిద్ర లేకపోతే అతని రోజంతా చిరాకుగా ఉంటుంది. రోజు సరిగ్గా జరగదు. అంటే నిద్ర మనిషి జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వాస్తు ప్రకారం నిద్రపోతున్న సమయంలో పాటించాల్సిన కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. వీటిని పాటించడం వల్ల మన జీవితంలో సానుకూలత వస్తుంది. ఈ విధంగా కొన్ని వాస్తు లోపాలు కూడా చెప్పబడ్డాయి. మనం నిద్రపోతున్నప్పుడు ఈ నియమాలను విస్మరిస్తే.. అప్పుడు జీవితంలో ప్రతికూలత పరిస్థితిని కలిగిస్తాయి.

చాలా మందికి నిద్రపోయేటప్పుడు తమ మంచం చుట్టూ అనేక వస్తువులను పెట్టుకునే అలవాటు ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది వాస్తు దోషానికి కారణం కావచ్చు. కనుక నిద్రపోయే సమయంలో తల దగ్గర లేదా మంచం దగ్గర ఉంచుకోకూడని కొన్ని వస్తువులున్నాయి. ఇవి సానుకూలతను ప్రభావితం చేయడమే కాదు నిద్రలేమి సమస్యను కూడా కలిగిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం తల దగ్గర ఏ వస్తువులను ఉంచుకోవడం అశుభమని భావిస్తారో తెలుసుకుందాం..

షూస్ స్లిప్పర్స్ మొదటి విషయం ఏమిటంటే బూట్లు, చెప్పులు, మురికి సాక్స్‌లను మంచం దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు. ఇది ప్రతికూల శక్తి ప్రవాహానికి కారణమవుతుంది.

ఇవి కూడా చదవండి

ఎలక్ట్రానిక్ వస్తువులు మొబైల్, ల్యాప్‌టాప్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను మన తల దగ్గర ఉంచుకోకూడదు. శాస్త్రీయంగా వీటిని ఉంచుకోవడం హానికరం. అంతేకాదు వాస్తు కూడా ఇలా చేయడం పెద్ద లోపంగా పరిగణిస్తుంది.

మందులు మంచం దగ్గర లేదా తలభాగంలో ఎప్పుడూ మందులను పెట్టుకుని నిద్రపోకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది ప్రతికూలతను పెంచుతుంది. వ్యాధులను పెంచుతుంది.

అద్దం వాస్తు శాస్త్రం ప్రకారం మంచం తల భాగంలో అద్దం ఉండకూడదు. ఇది ప్రకాశాన్ని ప్రభావితం చేస్తుందని, ప్రతికూల శక్తులు దానిలో నివసిస్తాయని నమ్ముతారు. అలాగే మంచం ప్రతిబింబం బెడ్‌రూమ్‌లోని ఏ అద్దంలోనూ కనిపించకూడదని వాస్తు శాస్త్రం పేర్కొంది.

బంగారం వెండి లేదా లోహం మంచం దగ్గర బంగారం, వెండి లేదా ఏదైనా ఇతర లోహ ఆభరణాలు లేదా వస్తువులను ఉంచి నిద్రించకూడదు. ఇవి మన గ్రహాలను బాగా ప్రభావితం చేస్తాయని నమ్ముతారు.

డబ్బు లేదా వాలెట్ వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బు లేదా పర్సును మంచం మీద లేదా దాని చుట్టూ ఉంచి నిద్రపోకూడదు. ఇది లక్ష్మీ దేవిని అవమానించినట్లు పరిగణించబడుతుంది. ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.

మురికి, పాత బట్టలు మంచం మీద లేదా చుట్టూ మురికి, పాత బట్టలను కుప్పలుగా ఉండకూడదు. ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. ఇలా చేయడం వలన జీవితంలో ఇబ్బందులు, సంక్లిష్టతలను పెంచుతుంది.

నీరు తల దగ్గర నీరు పెట్టుకుని నిద్రపోకూడదని నమ్ముతారు. నీరు చంద్రునికి కారకం. ఇలా చేయడం చంద్రుడు స్థానం చెడిపోవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి సమయంలో నీటిలో దుష్ట శక్తులు కూడా నివసిస్తాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్