Srisailam: శ్రీశైలం మహాశివరాత్రి ముగిసిన బ్రహ్మోత్సవాలు.. అశ్వవాహనాధీశులై స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనం

ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలల్లో ముగింపులో భాగంగా ఆలయ ప్రాంగణం శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం జరిపించబడింది. ఈ పుష్పోత్సవంలో శ్రీ స్వామి అమ్మవార్లకు సుమారు 18 రకాల పుష్పాలు, మూడు రకాల పత్రాలతో శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషంగా అర్పించి 9 రకాల ఫలాలు నివేదించబడ్డాయి. తరువాత శ్రీస్వామి అమ్మవార్లకు ఏకాంతసేవ నిర్వహించి శయనోత్సవం జరిపించారు.

Srisailam: శ్రీశైలం మహాశివరాత్రి ముగిసిన బ్రహ్మోత్సవాలు.. అశ్వవాహనాధీశులై స్వామి అమ్మవార్లు  భక్తులకు దర్శనం
Maha Shivratri Brahmotsavam
Follow us

| Edited By: Surya Kala

Updated on: Mar 12, 2024 | 9:33 AM

నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఘనంగా ముగిశాయి. చివరి రోజైన నేడు భ్రమరాంబా సమేతుడైన మల్లికార్జునస్వామి అశ్వవాహనాధీశులై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయం నుంచి అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లి కార్జునస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అశ్వవాహనంలో ఆవహింపజేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విద్యుత్ దీపకాంతుల నడుమ కన్నులపండువగా ఆలయ ప్రదక్షిణలు గావించారు. ఈ పూజ కైకర్యాలలో దేవస్థానం ఈవో పెద్దిరాజు దంపతులు, భక్తులు, అధికారులు పాల్గొన్నారు.

వాహన పూజలనంతరం ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలల్లో ముగింపులో భాగంగా ఆలయ ప్రాంగణం శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం జరిపించబడింది. ఈ పుష్పోత్సవంలో శ్రీ స్వామి అమ్మవార్లకు సుమారు 18 రకాల పుష్పాలు, మూడు రకాల పత్రాలతో శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషంగా అర్పించి 9 రకాల ఫలాలు నివేదించబడ్డాయి. తరువాత శ్రీస్వామి అమ్మవార్లకు ఏకాంతసేవ నిర్వహించి శయనోత్సవం జరిపించారు. ఈ శయనోత్సవానికి ఆలయ ప్రాంగణములోని శ్రీస్వామి అమ్మవార్ల శయన మందిరానికి విశేష పుష్పాలంకరణ చేసి ఏకాంతసేవ నిర్వహించారు. ఈపూజ కైకర్యాలతో ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. నేటితో ఈ ఏడాది శ్రీ స్వామి అమ్మవారికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..