Smartphone Tips: ఫోన్ నీటిలో పడి తడిస్తే బియ్యంలో వేసి ఆరబెట్టాలా..! ఏ ఫోన్‌ను ఎలా ఆరబెట్టాలంటే..

ఫోన్ మీ చేతిలోంచి జారి నీటిలో పడిపోయిందనుకోండి. లేక బాత్ టబ్ మొదలైన వాటిలో ఫోన్ పడిపోతే ఏం చేస్తారు? తడి ఫోన్‌లను ఆరబెట్టడానికి రకరకాల పద్దతుల్లో ప్రయత్నిస్తారు. బియ్యం కూడా వీటిలో ఒకటి.  ఎందుకంటే బియ్యానికి తేమను గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల తడి ఫోన్‌లను ఆరబెట్టడంలో బియ్యం బాగా పని చేస్తుందని నమ్ముతారు. నీటిలో పడిన ఫోన్‌ను ఆరబెట్టడానికి బియ్యం ఉపయోగించడం ఒక సాధారణ పద్ధతి. అయితే ఫోన్ ఆరబెట్టడానికి బియ్యం ఉపయోగించడం సరైన మార్గమా ఇప్పుడు తెలుసుకుందాం.. 

Smartphone Tips: ఫోన్ నీటిలో పడి తడిస్తే బియ్యంలో వేసి ఆరబెట్టాలా..! ఏ ఫోన్‌ను ఎలా ఆరబెట్టాలంటే..
Smartphone Tips
Follow us
Surya Kala

|

Updated on: Mar 12, 2024 | 9:12 AM

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మనిషి అవయవాల్లో ఒకటిగా మారిపొయింది. ఫోన్ ద్వారా ప్రపంచాన్ని దర్శించవచ్చు. ఎటువంటి పనులు అయినా చేసుకోవచ్చు.. అన్నంతగా ఫోన్ అలవాటు అయింది. అయితే ఫోన్ నీటిలో తడిసిపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది ఫోన్ వినియోగదారులు తరచుగా ఎదుర్కొనే సమస్య. ఫోన్ నీటిలో పడిపోవడం ఎవరికైనా జరగవచ్చు.. అయితే అటువంటి సమయంలో అయ్యో ఫోన్ లో ఉన్న డేటా అంటూ భయపడాల్సిన అవసరం లేదు. మీరు కొన్ని సులభమైన పద్ధతులను అనుసరించడం ద్వారా మీ ఫోన్‌ను సేవ్ చేసుకోవచ్చు. నీటిలో పడిన ఫోన్‌ను ఆరబెట్టడానికి బియ్యం ఉపయోగించడం ఒక సాధారణ పద్ధతి. అయితే ఫోన్ ఆరబెట్టడానికి బియ్యం ఉపయోగించడం సరైన మార్గమా ఇప్పుడు తెలుసుకుందాం..

ఫోన్ మీ చేతిలోంచి జారి నీటిలో పడిపోయిందనుకోండి. లేక బాత్ టబ్ మొదలైన వాటిలో ఫోన్ పడిపోతే ఏం చేస్తారు? తడి ఫోన్‌లను ఆరబెట్టడానికి రకరకాల పద్దతుల్లో ప్రయత్నిస్తారు. బియ్యం కూడా వీటిలో ఒకటి.  ఎందుకంటే బియ్యానికి తేమను గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల తడి ఫోన్‌లను ఆరబెట్టడంలో బియ్యం బాగా పని చేస్తుందని నమ్ముతారు.

తడిచిన ఫోన్‌ను ఎలా శుభ్రం చేసుకోవాలంటే

ఫోన్ తడిస్తే దానిని ఆరబెట్టడం ముఖ్యం. ఫోన్ నీటిలో పడితే దానిని శుభ్రమైన గుడ్డతో శుభ్రం చేయాలి. మొబైల్‌లోని సిమ్‌కార్డును తీసి ఫోన్‌ను నీటితో శుభ్రం చేయాలి. వీలైతే ఫోన్ ఆఫ్ చేసి బ్యాటరీని తీయాలి.

ఇవి కూడా చదవండి

ఐఫోన్ ను ఎలా ఆరబెట్టుకోవాలంటే

తడి ఐఫోన్‌ను ఎలా ఆరబెట్టాలో ఆపిల్ స్వయంగా చెప్పింది. Apple సంస్థ చెప్పిన ప్రకారం iPhoneలు తెరవబడవు. కనుక వాటిని తేలికపాటి ఒత్తిడితో చేతిపై కొట్టాలి. ఈ సమయంలో ఐఫోన్ కనెక్టర్ పోర్ట్ క్రిందికి ఉండాలని గుర్తుంచుకోండి. తద్వారా నీరు లేదా ద్రవం ఏదైనా బయటకు రావచ్చు.

బియ్యంలో పెట్టి ఆరబెట్టే విషయానికి వస్తే ఆపిల్ ఇలా చేయడానికి నిరాకరిస్తుంది. ఆపిల్ ప్రకారం.. ఐఫోన్ కనుక తడిస్తే .. దానిని బియ్యంలో వేసి పొడి చేయకూడదు.

అదే శాంసంగ్ ఫోన్ అయితే ఏమి చేయాలి?

తడిచిన మొబైల్ ఫోన్‌ను ఆరబెట్టడానికి కాటన్ బడ్‌ని ఉపయోగించాలని శాంసంగ్ చెబుతోంది. దీంతో ఫోన్‌లోని ఇయర్‌ఫోన్ జాక్ , ఛార్జింగ్ పోర్ట్‌ను పూర్తిగా శుభ్రం చేయాలి. అయితే ఐఫోన్ ఓపెన్ పార్ట్స్ లో కాటన్ పెట్టకూడదని యాపిల్ చెబుతోంది.

మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే.. బియ్యాన్ని ఆరబెట్టడానికి ఉపయోగించవచ్చు. అయితే బియ్యం ఎక్కువగా ఉండాలి. అంతేకాదు ఫోన్ పోర్ట్‌లలోకి బియ్యం ప్రవేశించకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇలా చేయడం ఫోన్‌ను ఆరబెట్టడంలో సహాయపడుతుంది. పోర్ట్‌లు కూడా సురక్షితంగా ఉంటాయి.

మురికి నీటిలో పడితే

ఫోన్‌ను శుభ్రమైన నీటిలో కాకుండా మురికి నీటిలో పడినట్లయితే శామ్‌సంగ్ ముఖ్యమైన సలహా ఇస్తుంది. మురికి నీటిలో ముంచిన ఫోన్‌ను శుభ్రమైన నీటితో శుభ్రం చేయాలని తద్వారా ఫోన్‌లోని మురికి తొలగిపోతుందని కంపెనీ చెబుతోంది. ఇలా చేయడం వల్ల ఫోన్‌లోని సర్క్యూట్‌లో తుప్పు పట్టడం తదితర సమస్యలు దూరమవుతాయి.

ఆపిల్, శాంసంగ్ కంపెనీలు తడి ఫోన్‌లను వెంటిలేషన్ ప్రదేశంలో ఉంచాలని నమ్ముతున్నాయి. అయితే గూగుల్ ప్రకారం తడి ఫోన్‌ను గది ఉష్ణోగ్రతలో మాత్రమే ఉంచాలి.

పొరపాటున కూడా ఇలా చేయకండి

నీటిలో నానిన ఫోన్‌లో హెయిర్ డ్రైయర్ లేదా కంప్రెస్డ్ ఎయిర్‌ని ఎప్పుడూ ఉపయోగించకూడదు. అంతే కాదు ఫ్రీజర్‌లో కూడా ఉంచకూడదు. ఇది ఫోన్‌లో షార్ట్ సర్క్యూట్ సమస్యను కలిగిస్తుంది. అది పని చేయడం ఆగిపోవచ్చు. అంతేకాదు తడి ఫోన్‌ను ఆన్ చేయడానికి ప్రయత్నించవద్దు లేదా కేబుల్ ఛార్జర్‌తో ఛార్జ్ చేయవద్దు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?