Gobhi Manchurian: గోవా బాటలో కర్ణాటక.. గోబీ మంచూరియా అమ్మకాలపై నిషేధం.. రీజన్ తెలిస్తే షాక్..

ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ మ్యాన్స్,  చిన్న దుకాణాలలో గోబీ మంచూరియాను విక్రయించడం నిషేధించబడింది. ఇక్కడ శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం తక్కువే కాదు.. గోబీ మంచూరియా తయారీలో వినియోగించే సాస్ వంటివి నాణ్యత లేని పదార్థాలుగా గుర్తించారు. క్యాబేజీ మంచూరియన్ ఒక రకమైన క్రిస్పీ డిష్.. దీనిని క్రంచీగా చేయడానికి ఉపయోగించే పౌడర్ ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది.

Gobhi Manchurian: గోవా బాటలో కర్ణాటక.. గోబీ మంచూరియా అమ్మకాలపై నిషేధం..  రీజన్ తెలిస్తే షాక్..
Gobhi Manchurian
Follow us
Surya Kala

|

Updated on: Mar 12, 2024 | 7:55 AM

కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా తినే ఆహారంలో కూడా ఇష్టాయిష్టాల్లో కూడా మార్పులు వచ్చాయి. నేటి యువత ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ ని ఇష్టంగా తింటుంది. ఈ ఫాస్ట్ ఫుడ్ ప్రియుల జాబితాలో ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్.. గోబీ మంచూరియా , చికెన్ మంచురియా ఇలా చాలా రకాల వంటకాలు ఉన్నాయి. ప్రత్యేకించి  శాఖాహారులు అయితే ఇష్టంగా తినేది గోబీ మంచూరియా అని చెప్పవచ్చు. క్యాలీఫ్లవర్, మొక్కజొన్న పిండి, సోయా సాస్, వెనిగర్, చిల్లీ సాస్, అల్లం, వెల్లుల్లి వంటి భిన్నమైన పదార్ధాలను ఉపయోగించి తయారు చేస్తారు. దీని రుచి గురించి మాట్లాడితే ఇది స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. రుచికరమైనది అయినప్పటికీ గోబీ మంచూరియాను గోవా తర్వాత, ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో కూడా నిషేధించింది, దీనికి కారణం..  కాలీఫ్లవర్ మంచూరియన్ ఆరోగ్యానికి హాని కరం అని చెబుతున్నారు. ఈ రోజు గోబీ మంచూరియా ఆరోగ్యానికి ఎలా హాని కలిగిస్తుందో తెలుసుకుందాం.

గోబీ మంచూరియన్ పై ఎందుకు నిషేధం అంటే

ఈ రుచికరమైన వంటకం ఎందుకు నిషేధించబడింది అనేది ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతూ ఉంటుంది.. అయితే ఈ గోబీ మంచూరియన్ తయారీలో సింథటిక్ రంగులు ఉపయోగిస్తారు. అంతేకాదు దీనిని తయారు చేసేటప్పుడు ప్రజలు పరిశుభ్రత గురించి పెద్దగా దృష్టి పెట్టడం లేదు.. ఇంకా చెప్పాలంటే తయారు చేస్తున్న సమయంలో తక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు అని గుర్తించారు. ఇక గోబీ  మంచూరియన్‌ను ఆకర్షణీయంగా కనిపించేలా చేయడానికి, సింథటిక్ రంగులను సమృద్ధిగా ఉపయోగిస్తున్నారు. వీటి వినియోగం ఆరోగ్యానికి విషం కంటే తక్కువ కాదు. కొన్ని నివేదికల ప్రకారం గోబీ మంచూరియాతో పాటు ఇచ్చే సాస్ కూడా ఆరోగ్యానికి చాలా హానికరం అని కనుగొనబడింది. ఈ కారణంగా ఈ వంటకాన్ని నిషేధించడం సరైనదని ప్రభుత్వం భావించింది.

ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ మ్యాన్స్,  చిన్న దుకాణాలలో గోబీ మంచూరియాను విక్రయించడం నిషేధించబడింది. ఇక్కడ శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం తక్కువే కాదు.. గోబీ మంచూరియా తయారీలో వినియోగించే సాస్ వంటివి నాణ్యత లేని పదార్థాలుగా గుర్తించారు. క్యాబేజీ మంచూరియన్ ఒక రకమైన క్రిస్పీ డిష్.. దీనిని క్రంచీగా చేయడానికి ఉపయోగించే పౌడర్ ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

గోబీ మంచూరియాలో ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి

గోబీ మంచూరియా తయారీలో ఉపయోగించే పదార్థాలు చాలా అనారోగ్యకరమైనవి. దీనితో పాటు క్యాలీఫ్లవర్ మంచూరియాలో అధిక మొత్తంలో కొవ్వు, సోడియం, కేలరీలు కనిపిస్తాయి. దీనిని రోజూ తినడం వల్ల తక్కువ సమయంలో స్థూలకాయం, అధిక రక్తపోటు సహా అనేక ఇతర తీవ్రమైన వ్యాధుల బారిన పడవచ్చు. గోబీ మంచూరియాకు బంగారు రంగును ఇవ్వడానికి సింథటిక్ రంగులు ఉపయోగిస్తారు. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. దీన్ని వేయించడానికి ఉపయోగించే నూనె చాలా తక్కువ నాణ్యతతో ఉంటుంది. దీని  కారణంగా అనేక జీర్ణ సమస్యలను ఎదుర్కోవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!