Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi 2024: హోలీ రోజున ఈ దేవుళ్ళను పూజించండి.. జీవితంలో సుఖ సంతోషాలు మీ సొంతం..

భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో హోలీని వివిధ రకాలుగా జరుపుకుంటారు. ఇతర పండుగల్లో మాదిరిగానే  హోలీలో కూడా దేవుళ్లను ప్రత్యేకంగా పూజిస్తారు. అన్నింటిలో మొదటిది రంగు లేదా గులాల్ దేవునికి మొదటగా పూస్తారు. ఆ తర్వాత మాత్రమే హోలీని ఒకరికి ఒకరు రంగులను అడ్డుకుంటూ రంగుల కేళీ ఆడతారు. హోలీ రోజున ఈ దేవతలను పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి.

Holi 2024: హోలీ రోజున ఈ దేవుళ్ళను పూజించండి.. జీవితంలో సుఖ సంతోషాలు మీ సొంతం..
Holi 2024
Follow us
Surya Kala

|

Updated on: Mar 12, 2024 | 11:18 AM

హిందూ మతంలో పెద్ద పండుగలలో ఒకటైన హోలీ పండుగకు సందడి మొదలైంది. మరికొన్ని రోజుల్లో హోలీని జరుపుకోనున్నారు. మార్చి 25న దేశం మొత్తం రంగులు, గులాల్‌లతో దర్శనమివ్వనుంది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో హోలీని వివిధ రకాలుగా జరుపుకుంటారు. ఇతర పండుగల్లో మాదిరిగానే  హోలీలో కూడా దేవుళ్లను ప్రత్యేకంగా పూజిస్తారు. అన్నింటిలో మొదటిది రంగు లేదా గులాల్ దేవునికి మొదటగా పూస్తారు. ఆ తర్వాత మాత్రమే హోలీని ఒకరికి ఒకరు రంగులను అడ్డుకుంటూ రంగుల కేళీ ఆడతారు. హోలీ రోజున ఈ దేవతలను పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి.

హోలీ రోజున హనుమంతుడిని పూజించడం విశిష్టమైనదని నమ్ముతారు. హనుమంతుడిని ఆరాధించడం ద్వారా శారీరక, దైవిక, భౌతిక వేడి నుండి ఉపశమనం పొందుతారు. హోలీ రోజున హనుమంతుడిని పూజించడం వల్ల భక్తుల జీవితాల్లో సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు.

శివుని ఆరాధన: హోలీ సందర్భంగా పురాతన క్షేత్రం కాశీలో భక్తులు రంగులు, గులాల్‌తో పాటు స్మశానంలో  బూడిదతో హోలీని జరుపుకుంటారు. ఈ సంప్రదాయాన్ని ‘మసానే హోలీ’ అని కూడా పిలుస్తారు. ఇందులో తన భూతగణాలతో హోలీ ఆడటానికి శివయ్య స్వయంగా వస్తాడని నమ్మకం. అందుకే హోలీలో మహాదేవుని పూజించే సంప్రదాయం ఉంది. శివుడిని ఆరాధించడం ద్వారా అన్ని సమస్యల నుండి ఉపశమనం పొంది ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

రాధా-కృష్ణ: రాధా-కృష్ణుల ఆరాధన లేకుండా హోలీ పండుగ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. హోలీ సందర్భంగా మధుర-బృందావన్‌తో సహా మొత్తం బ్రజ్‌లో హోలీని ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ హోలీని చూసేందుకు విదేశాల నుంచి కూడా మథుర చేరుకుంటారు. హోలీ రోజున రాధా-కృష్ణులను పూజించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు లభిస్తాయని నమ్ముతారు. అంతేకాకుండా  కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది. వైవాహిక జీవితంలో కూడా ఆనందం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో హోలీ రోజున ఖచ్చితంగా శ్రీ రాధా కృష్ణుడిని పూజించండి. ఇది జీవితంలో ప్రేమను తీసుకురావడమే కాకుండా ప్రేమ సంబంధాన్ని బలంగా ఉంచుతుంది.

లక్ష్మీదేవి: హోలీ రోజున లక్ష్మీ దేవి ఆరాధనకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హోలీ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి. అంతే కాదు ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు కొరత ఉండదు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.

విష్ణు పూజ: హోలీ పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. హోలీకి ఒక రోజు ముందు హోలికా దహనం జరుగుతుంది. పురాణాల ప్రకారం విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని దహనం చేయడానికి హోలిక తన ఒడిలో ప్రహ్లాదుడిని కూర్చోబెట్టుకుంది. అగ్నిలో కూర్చొని ఉంది. అయితే ప్రహ్లాదుడు సురక్షితంగా బయటకు వచ్చాడు. హోలిక బూడిదైంది. హోలీ పండుగ విష్ణువు నరసింహ అవతారానికి సంబంధించినది. అటువంటి పరిస్థితిలో హోలీ రోజున విష్ణువును పూజించడం చాలా ఫలవంతంగా పరిగణించబడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు