Yadagirigutta: శ్రీ లక్ష్మీనరసింహస్వామి అమ్మవార్లకు పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరలు.. పది రోజుల్లో నేసిన చేనేత కార్మికులు

పోచంపల్లి పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తయారు చేసిన ఇక్కత్ పట్టు వస్త్రాలను బ్రహ్మోత్సవాల్లో భాగంగా భారీ ఊరేగింపుతో వెళ్లి ఆలయ అధికారులకు సంఘం ప్రతినిధులు అందజేశారు. సనాతన ధర్మం ప్రకారం కళ్యాణోత్సవంలో హరికి అత్తింటి వారు, సిరికి పుట్టింటి వారు వస్త్రాలను సమర్పిస్తారు. ప్రత్యేక సాంప్రదాయంగా అత్తింటి వారు, పుట్టింటి వారుగా.. పేరొందిన పద్మశాలి వశంస్తులు ప్రతి ఏటా స్వామి, అమ్మవార్లకు స్వయంగా పట్టు వస్త్రాలను తయారు చేసి బహూకరిస్తున్నారు.

Yadagirigutta: శ్రీ లక్ష్మీనరసింహస్వామి అమ్మవార్లకు పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరలు.. పది రోజుల్లో నేసిన చేనేత కార్మికులు
Yadagirigutta Brahmotsavam
Follow us
M Revan Reddy

| Edited By: Surya Kala

Updated on: Mar 12, 2024 | 12:39 PM

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోవంగా కొనసాగుతున్నాయి. ఖండాంతర ఖ్యాతిని అర్జించిన పోచంపల్లి ఇక్కత్ పట్టు వస్త్రాలు యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి కల్యాణ మహోత్సవానికి స్వామి, అమ్మవార్లకు బహూకరించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.. యాదాద్రీశుడు తిరు కళ్యాణం ఈనెల 18వ తేదీన కనుల పండుగగా జరగనుంది. పాంచ నరసింహుడు, అమ్మవార్లకు ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పోచంపల్లి పట్టు వస్త్రాలను పద్మశాలి మహాజన సంఘం సమర్పించడం ఆనవాయితీ.

పోచంపల్లి పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తయారు చేసిన ఇక్కత్ పట్టు వస్త్రాలను బ్రహ్మోత్సవాల్లో భాగంగా భారీ ఊరేగింపుతో వెళ్లి ఆలయ అధికారులకు సంఘం ప్రతినిధులు అందజేశారు. సనాతన ధర్మం ప్రకారం కళ్యాణోత్సవంలో హరికి అత్తింటి వారు, సిరికి పుట్టింటి వారు వస్త్రాలను సమర్పిస్తారు. ప్రత్యేక సాంప్రదాయంగా అత్తింటి వారు, పుట్టింటి వారుగా.. పేరొందిన పద్మశాలి వశంస్తులు ప్రతి ఏటా స్వామి, అమ్మవార్లకు స్వయంగా పట్టు వస్త్రాలను తయారు చేసి బహూకరిస్తున్నారు.

పది రోజుల్లో నేసిన కళాత్మకమైన ఇక్కత్ పట్టు చీరలు

పట్టుదారానికి రంగులద్ది డిజైన్‌లు కట్టి నేసే ప్రక్రియ ఇక్కత్‌ పట్టు చీర ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా మగువలు మెచ్చే చీరలు ఇక్కత్ పట్టు. పోచంపల్లిలో పది రోజులపాటు శ్రమించి స్వామి, అమ్మవారికి రెండు పట్టు చీరలు, పట్టు పంచెలను తయారు చేశారు. లక్ష్మీనర్సింహస్వామి కల్యాణ మహోత్సవంలో అమ్మవారిని అలంకరించేందుకు రెండు పట్టుచీరలను తయారు చేశారు. ఈసారి రాజస్థాన్ నూతన డిజైన్లతో ఆకర్షణీయంగా చతురస్రాకార రాజస్థాన్ డిజైన్లు, స్పన్, జరీ బార్డర్ తో నేయడం ఈ చీరల ప్రత్యేకత. ఒకటి మెరుగు రంగు కొంగుతో కూడిన హాఫ్ వైట్ చీర. మరొకటి మెరూన్ రంగు కలిగిన కొంగు, చిలుకపచ్చ చీరలను చేనేత కార్మికులు కళాత్మకంగా నేశారు. అలాగే స్వామి వారికి పట్టు పంచె, పట్టు శాలువాను తయారు చేశారు.

ఇవి కూడా చదవండి

భక్తిశ్రద్ధలతో పట్టు వస్త్రాలను నేసిన చేనేత కార్మికులు..

వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి అమ్మవార్లకు సమర్పించే పట్టు వస్త్రాలను చేనేత కార్మికులు భక్తిశ్రద్ధలతో నేశారు. పద్మశాలీల ఇలవెల్పు అయిన లక్ష్మీనారసింహస్వామి, శ్రీ అమ్మ వార్లకు ఎమిదేళ్లుగా పోచంపల్లి ఇక్కత్ పట్టు వస్త్రాలను అందజేయడం అదృష్టంగా భావిస్తున్నామని పద్మశాలి మా జన సంఘం అధ్యక్షుడు శ్రీరాములు చెబుతున్నారు. ఎంతో నియమ నిష్టలతో రోజుకు 10గంటలు మగ్గం నేసి వస్త్రాలను తయారు చేశామని చేనేత కార్మికులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల్లోనే పట్టు వస్త్రాలను నేసామని చెబుతున్నారు. సాక్ష్యాత్తు శ్రీ లక్ష్మీనర్సింహస్వామికి పట్టు వస్త్రాలను తయారుచేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?