Lord Shiva Puja: శివయ్య అనుగ్రహం కోసం ఏ వస్తువులు సమర్పిస్తే ఎటువంటి ప్రయోజనం లభిస్తుందంటే..
త్రిమూర్తులలో శివుడు ఒకడు. సృష్టి, స్థితి, లయలలో లయ కారకుడిగా శివుడిని పుజిస్తారు. శివుడిని పూజించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుందని, మానసిక రుగ్మతలు తొలగిపోతాయని నమ్ముతారు. అందుకనే భక్తులు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పూజా సమయంలో శివలింగానికి అనేక వస్తువులను సమర్పిస్తారు. అయితే శివలింగానికి జలంతో సహా అనేక రకాల వస్తువులతో అభిషేకం నిర్వహిస్తారు. ఒకొక్క అభిషేకం ఒకొక్క కోరికని తీరుస్తుందని నమ్మకం.

శివునికి పూజించడం వలన దుఃఖాలు, బాధలు తొలగిపోతాయని విశ్వాసం. అంతేకాదు శివుడికి అభిషేకం చేయడం వలన పార్వతి ఆశీస్సులు వివాహ జీవితంపై ఉంటాయని నమ్మకం. పురాణ గ్రంథాల ప్రకారం మాస శివరాత్రి, మహా శివరాత్రి, శ్రావణ, కార్తీక మాసంలతో పాటు సోమవారం కూడా శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత పవిత్రమైన సందర్భం. ఈ సమయంలో శివలింగానికి నీటిని సమర్పించడం ద్వారా సంతోషంగా ఉంటాడు. అయితే శివ భక్తులు శివలింగానికి ఇష్టమైన అనేక వస్తువులను సమర్పిస్తారు. ఈ రోజు శివలింగానికి ఏమి సమర్పిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం.
శివలింగానికి వేటిని సమర్పిస్తే ఎలాంటి ప్రయోజనం లభిస్తుందంటే
- శివలింగంపై యాలకులు సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలు : శివలింగంపై యాలకులు సమర్పించడం వల్ల ఇంట్లో శ్రేయస్సు వస్తుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.
- శివలింగంపై బియ్యం నైవేద్యం పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు : శివలింగంపై బియ్యం నైవేద్యం పెట్టడం వల్ల శివుడు ప్రసన్నుడై సంపద, శ్రేయస్సును అనుగ్రహిస్తాడు .
- శివలింగంపై గోధుమలను నైవేద్యం పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు : శివలింగంపై గోధుమలను నైవేద్యం పెట్టడం వల్ల సంతానం సుఖ సంతోషాలతో ఉంటారు. పిల్లలు సామర్థ్యం,విధేయత కలిగి ఉండటం వంటి ప్రయోజనాలు లభిస్తాయి .
- శివలింగంపై తేనె నైవేద్యం పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు : శివలింగంపై తేనె నైవేద్యం పెట్టడం వల్ల జీవితంలో మాధుర్యం, శాంతి, సానుకూలత వస్తాయి .
- శివలింగంపై నల్ల నువ్వులను సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలు : శివలింగంపై నల్ల నువ్వులను సమర్పించడం వల్ల పితృ దోషం శాంతించి పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి .
- శివలింగానికి కుంకుమ పువ్వు అర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలు : శివలింగానికి కుంకుమ పువ్వు అర్పించడం వల్ల శివుని ఆశీస్సులు లభిస్తాయి. జీవితంలో ఆనందం , శ్రేయస్సు కలుగుతాయి .
- శివలింగంపై బెల్లం నైవేద్యం పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు : శివలింగంపై బెల్లం నైవేద్యం పెట్టడం వల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కుటుంబంలో ఆనందం, శాంతి కలుగుతుంది.
- శివలింగంపై దూర్వాను సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలు : శివలింగంపై దూర్వాను సమర్పించడం వల్ల శివుని అనుగ్రహం, గణేశుడి ఆశీస్సులు లభిస్తాయి.
- శివలింగంపై లవంగాలు సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలు : శివలింగంపై లవంగాలు సమర్పించడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు, శాంతి , సానుకూల శక్తి లభిస్తాయి.
- శివలింగంపై బేల్పత్రం సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలు : శివలింగంపై బిల్వ పత్రాన్ని సమర్పించడం వల్ల శివుడు సంతోషిస్తాడు. భక్తుల కోరికలు నెరవేరుతాయి .
- శివలింగంపై పాలు అర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలు : శివలింగంపై పాలు అర్పించడం వల్ల ఆరోగ్యం మరియు అన్ని వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది.
- శివలింగంపై నెయ్యి సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలు : శివలింగంపై నెయ్యి సమర్పించడం వల్ల జీవితం ప్రకాశం లభిస్తుంది. జీవితంలో ఆనందం ఉంటుంది.
- శివలింగంపై సుగంధ ద్రవ్యాలు సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలు : శివలింగంపై సుగంధ ద్రవ్యాలు సమర్పించడం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతని పొందుతాడు. సిరి సంపదలతో సహా భౌతిక ఆనందాన్ని పొందుతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








