AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavishyavani: భయపెడుతున్న భవిష్యవాణి.. మహమ్మారి ముప్పు, అగ్నిప్రమాదాలు ఎక్కువే..

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ బోనాల ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుందన్నారు. నన్ను ఆనందపర్చండి.. మీ కొంగు బంగారం చేస్తానని చెప్పారు.

Bhavishyavani: భయపెడుతున్న భవిష్యవాణి.. మహమ్మారి ముప్పు, అగ్నిప్రమాదాలు ఎక్కువే..
Matangi Swarnalatha
Surya Kala
|

Updated on: Jul 14, 2025 | 12:03 PM

Share

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో మాతంగి స్వర్ణలత రంగం భవిష్యవాణి వినిపించారు. బోనాల జాతర కు సంతోషం గా సాకలు పోసి బాగా చేసారు. ప్రతి సారి చేసినట్టే ఈ సారి కూడా పొరపాటు చేసారు.. ప్రతి సంవత్సరం చెబుతున్న.. నా బిడ్డలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాను.. నా పూజలు అన్ని సక్రమంగా జరిపించాలి.. వేల రాసులు నేను రప్పించుకుంటున్నా అని అన్నారు. అంతేకాదు నాకు రక్తం బలి ఇవ్వడం లేదు.. మీరు మాత్రం ఆరగిస్తారు.. నాకు మాత్రం ఇవ్వడం లేదు…. నాకు సరిగ్గా పూజలు చెయ్యకపోతే రక్తం కక్కుకొని చస్తారు..నాకు పూజలు సరిగ్గా జరిపించడం లేదు.. అందుకే మరణాలు పెరుగుతున్నాయి..

నేను అస్సలు ఆ విషయంలో అడ్డుపడను.. నాకు రక్తం బలి కావాలి… నన్ను కొలిచే వారికి నేను ఎప్పుడు తోడుగా నిలబడుతాను.. రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుంది ప్రజలు జాగ్రత్త ఉండాలని చెప్పారు. అంతేకాదు ఈ ఏడాది అగ్ని ప్రమాదాలు పెరుగుతాయని.. ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా కురుస్తాయి పంటలు బాగా పండుతాయని చెప్పారు. ఐదు వారాలు పాటు నాకు పూజలు, సాక పోసి ఆనంద పరచాలి.. నాకు రక్తం చూపించండి లేకపోతే అల్లకల్లోలం జరుగుతుందని మంతంగి చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..