టాలీవుడ్ హాట్ సెన్సేషన్, 'ఆర్‌ఎక్స్ 100' పిల్ల పాయల్ రాజ్‌పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వెండితెరపై తన గ్లామర్‌తో కుర్రకారును ఉర్రూతలూగించే ఈ భామ.
సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్‌లో రచ్చ చేస్తుంటుంది ఈ వయ్యారి. తాజాగా పాయల్ పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి
సాధారణంగా నలుపు రంగుకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. దానికి తోడు గోల్డ్ లైనింగ్ ఉన్న డిజైనర్ శారీలో పాయల్ మెరిసిపోతుంటే.. అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
ఈ చీరకట్టులో పాయల్ తనదైన శైలిలో హొయలు పోతూ ఇచ్చిన ఫోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. గ్లామర్ అండ్ క్లాస్ కలగలిపినట్లున్న ఉంది ఈ లుక్.
ఈ లుక్ చూసి నెటిజన్లు "బ్లాక్ బ్యూటీ" అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, పాయల్‌లో ఒక సున్నితమైన మనసు కూడా ఉందని రీసెంట్‌గా అందరికీ తెలిసింది.
ఇటీవల ఒక సినిమా ప్రమోషన్స్ సమయంలో తన దివంగత తండ్రి గురించి తలుచుకుని ఆమె ఎమోషనల్ అయిన వీడియో అందరినీ కదిలించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, తన స్వయంకృషితో ఎదిగిన నటీమణులలో పాయల్ ఒకరు. అవకాశాల కోసం చూడకుండా, వచ్చిన ప్రతి ఛాన్స్ నటిగా తనను తాను నిరూపించుకుంటుంది.
ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్‌లతో వార్తల్లో నిలిచే పాయల్, ఈ బ్లాక్ అండ్ గోల్డ్ శారీ లుక్‌తో మరోసారి తన ఫాలోయింగ్‌ను పెంచుకుంది. తాజాగా ఈబ్యూటీ ఫోటోస్ వైరలవుతున్నాయి.