Allu Arjun : శ్రీతేజ్ ఇంటికి అల్లు అర్జున్ సతీమణి.. చదువు బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చిన స్నేహరెడ్డి, అల్లు అరవింద్..
పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ అనే చిన్నారి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా శ్రీతేజ్ చికిత్సకు సంబంధించిన ప్రతి విషయం దగ్గరుండి చూసుకుంటున్నారు అల్లు అర్జున్. ఈ క్రమంలోనే తాజాగా అతడి కుటుంబాన్ని నిర్మాత అల్లు అరవింద్, స్నేహా రెడ్డి పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో చిన్నారి శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లపాటు ఐసీయూలో చికిత్స తీసుకున్న అతడు ఇప్పుడు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. తాజాగా అతడి కుటుంబాన్ని అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి, నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. బుధవారం శ్రీతేజ్ నివాసానికి వెళ్లిన వారు చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఆ చిన్నారికి, అతడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శ్రీతేజ్ సోదరి చదువు బాధ్యత నాదేనని హామీ ఇచ్చారు అల్లు అరవింద్. అలాగే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు స్నేహ.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా చేయడమే సావిత్రి తప్పు.. అక్కడే పతనం మొదలైంది.. సీనియర్ నటి జమున..
పుష్ప 2 ప్రీమియర్ సమయంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి మరణించగా.. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు శ్రీతేజ్. ఆసుపత్రిలో కొన్ని నెలలపాటు కోమాలో ఉండిపోయాడు. ఆ సమయంలో తమ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అల్లు అర్జున్. శ్రీతేజ్ చికిత్సకు సంబంధించిన ఖర్చులుతోపాటు అతడి కుటుంబానికి సైతం అండగా ఉంటానని అన్నారు. ఇప్పటికే ఆ చిన్నారి పేరు మీద రూ.2 కోట్లు ఫిక్సడ్ డిపాజిట్ చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో చాలా స్పెషల్.. కలిసి నటించడం చాలా ఇష్టం.. నయనతార..
Allu Aravind garu and Allu Sneha garu personally visited Sri Tej’s residence today, extending their heartfelt support and assuring the family of their unwavering, lifelong support #AlluArjun . pic.twitter.com/zxwYLbShBd
— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) May 6, 2026
ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : 12 ఏళ్లుగా నా బ్రేక్ ఫాస్ట్ ఇదే.. అందుకే ఇలా ఉన్నాను.. డైట్ సీక్రెట్ చెప్పిన రవి బాబు..
