Viral Video: దారితప్పి తల్లికోసం తల్లడిల్లిన గున్న ఏనుగు.. తల్లిని కలిసిన తర్వాత దాని ఆనందం ఎలా ఉందంటే..
ప్రస్తుతం మానవ జీవితాలు వ్యాపార బంధాలే.. అంతేకాదు ఉదయం నిద్ర లేచింది మొదలు.. నిద్రపోయే వరకూ ఉరుకులపరుగులతో బిజిబిజిగా గడుపుతున్నారు. ఈ బిజీ లైఫ్ లో మనుషులకు తమ కుటుంబ సభ్యులను, స్నేహితులను గుర్తు చేసుకోవడానికి.. అసలు బంధాలను పట్టించుకోవడానికి సమయం కేటాయించడం లేదు. ఈ పరిస్థితిలో మనుషులు మరచిపోయిన బంధాన్ని అనుబంధాన్ని జంతువులు గుర్తు చేస్తున్నాయని తెలియజేసే ఒక వీడియో వైరల్ అవుతుంది. అందులో తన తల్లి నుంచి విడిపోయిన ఏనుగు పిల్ల.. తిరిగి తల్లితో కలిసినట్లు కనిపిస్తుంది.

నేటి ఆధునిక సమాజంలో ప్రజల జీవితాలు చాలా వేగంగా మారిపోయాయి. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నిరంతరం ఏదో వెతుకుతూ ఉంటున్నారు. ఈ బిజీ జీవితంలో తమ ప్రియమైన వారితో కూడా సమయాన్ని గడపలేకపోతున్నారు. అరుదుగా తమ బంధువులను కలుస్తున్నారు. సంబంధాలు, ప్రేమ లేకుండా ప్రజలు జీవిస్తున్న ఈ వాతావరణంలో.. తల్లి నుంచి విడిపోయి తన తల్లితో తిరిగి కలవడానికి కష్టపడుతున్న పిల్ల ఏనుగు వీడియో ఇంటర్నెట్‌లో విడుదలై వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన చాలా మంది.. ప్రస్తుతం మానవ జీవితంతో పోలుస్తూ వ్యాఖ్యానిస్తున్నారు.
తప్పిపోయిన ఏనుగు పిల్ల తల్లిని తిరిగి కలిసింది. ప్రతిరోజూ ఇంటర్నెట్‌లో అనేక రకాల వీడియోలు ప్రత్యక్షం అవుతున్నాయి. కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలలో కొన్ని ఫన్నీగా ఉంటాయి. కొన్ని ఆలోచింపజేస్తాయి. అందులో తప్పిపోయిన గున్న ఏనుగు తన తల్లితో తిరిగి కలిసింది. ఇది వేగంగా వైరల్ అవుతోంది. తల్లి నుంచి విడిపోయిన బాధను, తిరిగి కలిసిన ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న గున్న ఏనుగు చాలా మంది దృష్టిని ఆకర్షించింది.
గున్న ఏనుగు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
Chotu got separated from mother at Kaziranga. It was united later with its mother. The forest officials applied mother’s dung to the calf to suppress human smell. Happy reunion at the end ☺️ pic.twitter.com/0sN1RbQ55E
— Susanta Nanda IFS (Retd) (@susantananda3) July 6, 2025
చోటూ అని పిలువబడే పిల్ల ఏనుగు దాని తల్లి నుంచి తప్పిపోయింది. పిల్ల ఏనుగు అటవీ అధికారుల వద్దకు చేరుకుంది. ఇటువంటి పరిస్థితిలో గున్న ఏనుగును దాని తల్లితో తిరిగి కలిపే ప్రయత్నం చేశారు అటవీ శాఖ అధికారులు. అటవీ అధికారులు తల్లి ఏనుగు మూత్రాన్ని పిల్ల ఏనుగుపై పూశారు. ఇలా చేయడానికి కారణం మనుషులు తాకిన తన బిడ్డని తల్లి ఏనుగు మళ్ళీ స్వీకరించదు. అందుకే అటవీశాఖ అధికారులు గున్న ఏనుగుని తల్లితో కలిపేందుకు ఈ చర్య తీసుకున్నారు. తరువాత పిల్ల ఏనుగును దాని తల్లితో కలిపారు. తర్వాత పిల్ల ఏనుగు, తల్లి ఏనుగు సంతోషంగా నడుస్తున్న వీడియో అందరి హృదయాన్ని కదిలించింది.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




