Poha Or Upma: బరువు తగ్గడానికి అల్పాహారంగా పోహా లేదా ఉప్మా తినాలా? ఏది బెస్ట్ అల్పాహారం అంటే..
రోజూ ఉదయం అల్పాహారం తప్పని సరిగా తీసుకోవాలని.. అప్పుడే శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు టిఫిన్ తినడం వలన రోజంతా చురుకుగా ఉంటారు. మెదడు చురుకుగా పనిచేస్తుంది. అయితే కొంతమంది ఉదయం తినే టిఫన్ గా ఇడ్లీ, పోహా, ఉప్మా, చపాతీ వంటి రకరకాల ఆహారన్ని తీసుకుంటారు. అయితే ఈ రోజు బరువు తగ్గడానికి బరువు తగ్గడానికి అల్పాహారంగా ఉప్మా లేదా పోహా తినాలా? అనే విషయంలో సందేహం కలుగుతుందా.. ఈ రోజు బరువు తగ్గడానికి ఏది ఉత్తమమో తెలుసుకుందాం..

మన రోజు ఆరోగ్యకరమైన అల్పాహారంతో ప్రారంభమవుతుంది. మన ఇంట్లో చాలా వరకు, ఇడ్లీ, వడ, పరాఠా, ఉప్మా, పోహా వంటి అల్పాహార వస్తువులను సాధారణంగా వడ్డిస్తారు. అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెరిగింది. ఆరోగ్యంగా ఉండేదుకు, బరువు తగ్గడానికి చాలా మంది ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడానికి ఇష్టపడతారు. పోహా, ఉప్మా రెండూ చాలా ప్రజాదరణ పొందిన, రుచికరమైన అల్పాహార వంటకాలు. అయితే బరువు తగ్గాలని ఆలోచించే వారికి పోహా లేదా ఉప్మా ఏది ఎక్కువ ప్రయోజనకరం అని ఆలోచిస్తున్నారా.. కొందరు పోహా తేలికైనది, ఎక్కువ పోషకాహారం అని అంటారు. మరికొందరు ఉప్మా పోషక విలువలతో ఉంటుందని భావిస్తారు. అయితే రెండు అల్పాహారాలు రుచికరమైనవి. వీటిని త్వరగా తయారు చేసుకోవచ్చు. జీర్ణం కావడం సులభం. అయితే బరువు తగ్గడానికి పోహా లేదా ఉప్మా ఏది తినాలో నిపుణుల సలహా ఏమిటో తెలుసుకుందాం..
బరువు తగ్గడానికి పోహా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు…
పోహా తినడం ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. పోహాలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పోహా తినడం వల్ల కడుపు నిండి ఉంటుంది. కనుక త్వరగా ఆకలిగా అనిపించదు. అనవసరంగా తినే అలవాటును నివారిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీనితో పాటు పోహా శరీరానికి రోజంతా పనిచేయడానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. పోహా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగకరంగా పరిగణించబడుతుంది ఎందుకంటే దీని పదార్థాలు జీవక్రియ ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ఇది శరీర కొవ్వును పెంచదు. వాయువులు, అజీర్ణం వంటి కడుపు సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అలాగే పోహాలో ఉన్న కొన్ని ముఖ్యమైన పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. తద్వారా శరీరం వ్యాధులను నిరోధించగలదు. అందువల్ల పోహా బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యానికి గొప్ప, సహజమైన ఎంపిక.
బరువు తగ్గడానికి ఉప్మా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు…
బరువు తగ్గాలనుకునే వారికి ఉప్మా కూడా గొప్ప, ఆరోగ్యకరమైన ఎంపిక. ఉప్మాలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. దీంతో కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఆకలి త్వరగా కలగదు. తద్వారా అతిగా తినకుండా నిరోధిస్తుంది. దీంతో బరువును నియంత్రణలో ఉంచుతుంది. ఉప్మా తయారీలో ఉపయోగించే సుజీ రవ్వ, వివిధ రకాల కూరగాయలు జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటాయి. సుజీ రవ్వలోని పోషక విలువ జీర్ణక్రియను సజావుగా చేయడంలో సహాయపడుతుంది. కడుపు సంబంధిత ఇబ్బందులను దూరం చేస్తుంది. అంతేకాదు కూరగాయలు ఉప్మాకు అదనపు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. ఇవి శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
బరువు తగ్గడానికి ఏది ఎక్కువ ప్రయోజనకరం అంటే
బరువు తగ్గాలనుకునే వారు తమ అల్పాహారంలో పోహా, ఉప్మా రెండింటినీ చేర్చుకోవచ్చు. రెండూ ఆరోగ్యానికి మంచివి. రెండూ కార్బోహైడ్రేట్ల మంచి వనరులు. ఇవి శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడతాయి. దీనితో పాటు, ఉప్మా, పోహా ఫైబర్ కి మంచి వనరులు.
అయితే బరువు తగ్గడానికి పోహా, ఉప్మాలో ఏది ఎంచుకోవాలని భావిస్తుంటే.. పోహా తినడం ఈ రెండింటిలో ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. నిజానికి పోహాలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది శరీర కొవ్వును నియంత్రించడంలో, బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ఉప్మా కంటే పోహాలో తక్కువ కేలరీలు ఉంటాయి. కనుక ప్రోటీన్ పరంగా పోహా ఉప్మా కంటే మంచిదని చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు పోహా తినడం ప్రయోజనకరం. అయితే పోహాను అధికంగా తినడం ఆరోగ్యానికి హానికరం. అందువల్ల పోహాను ఎల్లప్పుడూ పరిమిత పరిమాణంలో తినాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








