AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రిపూట తరచూ దాహం వేస్తుందా..? లైట్ తీసుకోవద్దు.. నెగ్లెక్ట్ చేస్తే వచ్చే పెద్ద ప్రాబ్లమ్స్ ఇవే..!

కొంతమందికి రాత్రిపూట నిద్రలో నుంచి లేచి నీరు తాగే అలవాటు ఉంటుంది. అయితే ఇది జస్ట్ అలవాటు మాత్రమే కాదు.. బాడీలో హెల్త్ ప్రాబ్లమ్స్ కి సిగ్నల్ కూడా కావచ్చు. షుగర్, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్మోన్ల మార్పులు లాంటి సమస్యలు దీని వెనక రీజన్స్ అయి ఉండొచ్చు. ఈ లక్షణాన్ని లైట్ తీసుకోవడం అస్సలు సేఫ్ కాదు.

రాత్రిపూట తరచూ దాహం వేస్తుందా..? లైట్ తీసుకోవద్దు.. నెగ్లెక్ట్ చేస్తే వచ్చే పెద్ద ప్రాబ్లమ్స్ ఇవే..!
Drinking Water In Night Time
Prashanthi V
|

Updated on: Jul 13, 2025 | 11:27 PM

Share

మనలో కొంతమందికి రాత్రిపూట నిద్రలో నుంచి లేచి తరచూ నీరు తాగాలని అనిపించడం మామూలే. అయితే ఇది జస్ట్ సాధారణ అలవాటు మాత్రమే కాదు.. కొన్నిసార్లు దీని వెనక సీరియస్ ఆరోగ్య సమస్యలు దాగి ఉండే ఛాన్స్ ఉంది. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. రాత్రిపూట తరచూ దాహం అనిపించడం మీ బాడీలో కొన్ని లోపాలను చూపించవచ్చు. ఈ విషయంపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

డయాబెటిస్

రాత్రిపూట ఎక్కువగా దాహం అనిపించడం షుగర్‌ కు ఒక ముఖ్య లక్షణం. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలోని ఎక్కువ చక్కెర శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. బాడీ ఎక్కువ మూత్రం ద్వారా గ్లూకోజ్‌ను బయటకు పంపడానికి ట్రై చేస్తుంది. దీంతో డీహైడ్రేషన్, దాహం ఏర్పడతాయి. దీనివల్ల రాత్రిపూట మళ్లీ మళ్లీ నీరు తాగాలనిపిస్తుంది.

డయాబెటిస్ ఇన్సిపిడస్ (Diabetes Insipidus)

ఇది షుగర్‌ తో సంబంధం లేని ఒక అరుదైన వ్యాధి. ఈ ప్రాబ్లమ్ వల్ల బాడీలోని యాంటీ డ్యూరెటిక్ హార్మోన్ లోపించడంతో ఎక్కువగా మూత్రం వస్తుంది. దీని వల్ల శరీరం నీటిని నిలుపుకోలేదు. అందుచేత రాత్రిపూట విపరీతమైన దాహం వేయడం కామన్.

కిడ్నీ ప్రాబ్లమ్స్

కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే బాడీలోని నీటి శాతం సమతుల్యంలో ఉండదు. దీని ఎఫెక్ట్‌ తో రాత్రిపూట ఎక్కువగా మూత్ర విసర్జన అవసరం ఏర్పడుతుంది. దాంతో పాటు దాహం అనిపించడం కూడా సహజం. తరచూ రాత్రిపూట నీరు తాగాల్సి వస్తే కిడ్నీ టెస్టులు చేయించుకోవడం మంచిది.

స్లీప్ అప్నియా (Sleep Apnea)

నిద్ర సమయంలో నోరు తెరిచి శ్వాస తీసుకోవడం వల్ల నోటి లోపల తేమ తగ్గిపోతుంది. ఈ పొడిబారిన పరిస్థితి వల్ల శరీరానికి నీటి అవసరం ఎక్కువగా అనిపిస్తుంది. రాత్రిపూట దాహంగా ఉండడం స్లీప్ అప్నియా అనే కండిషన్‌ కు సిగ్నల్ కావచ్చు.

మెనోపాజ్

మహిళల్లో మెనోపాజ్ సమయంలో హార్మోన్ల మార్పులు ఎక్కువ చెమట, నీరు కోల్పోవడం లాంటి వాటికి దారి తీస్తాయి. దీనివల్ల రాత్రిపూట విపరీతమైన దాహం కావచ్చు.

ఇతర కారణాలు

  • రాత్రిపూట ఉప్పు, కారంగా ఉండే ఫుడ్ తినడం వల్ల బాడీ నీరు కోల్పోతుంది.
  • కొంతమంది వాడే మెడిసిన్స్ వల్ల డీహైడ్రేషన్ వస్తుంది.
  • ఆల్కహాల్, కాఫీ లాంటి డ్రింక్స్.. ఇవి మూత్ర విసర్జనను పెంచే గుణాలు కలిగి ఉండటం వల్ల బాడీలోని నీరు తగ్గిపోతుంది.
  • నిద్రలో ముక్కు మార్గం మూసుకుపోయినప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల నోరు ఎండిపోతుంది.

రాత్రిపూట తరచూ నీరు తాగాలనిపించడం చిన్న సమస్యలా కనిపించవచ్చు. కానీ దీని వెనక ఆరోగ్య సమస్యలు దాగి ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది తరచూ జరుగుతుందంటే డాక్టర్లను కలిసి అసలు కారణం తెలుసుకోవడం బెస్ట్.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..