- Telugu News Photo Gallery Spiritual photos Which oil is best to light diya on Monday for Lord Shiva blessings
Lord Shiva Puja: శివయ్య అనుగ్రహం కోసం సోమవారం దీపం వెలిగించడం శుభప్రదం.. ఏ నూనెతో దీపం వెలిగిస్తే ఎటువంటి ఫలితాలంటే..
సోమవారం త్రిమూర్తులలో లయకారుడైన శివుడికి అంకితం చేయబడింది. ఈ రోజున శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక చర్యలు తీసుకుంటారు. ఈ రోజున మహాదేవుడిని పూజించడం వలన కోరిన కోర్కెలు తీరతాయని నమ్మకం. అంతేకాదు శివయ్య అనుగ్రహం కోసం చేసే పరిహరాల్లో ఒకటి దీపం వెలిగించడం. ఈ రోజు శివయ్య అనుగ్రహం కోసం సోమవారం రోజున దీపం ఏ నూనెతో వెలిగిచడం శుభప్రదమో తెలుసుకుందాం..
Updated on: Jul 14, 2025 | 7:05 AM

శివుడిని భోలాశంకరుడు అని అంటారు. నిర్మలమైన మనసుతో శివ శివ అంటూ జలంతో అభిషేకం చేసినా భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దైవంగా భక్తులు విశ్వసిస్తారు. అందుకనే దేవాది దేవుడైన మహాదేవుడిని పూజించడానికి వారంలో సోమవారం అంకితం చేశారు. శివయ్య అనుగ్రహం సోమవారం నాడు ఏ నూనెతో దీపం వెలిగించాలో తెలుసుకుందాం.

సోమవారం మహాదేవుడికి అంకితం చేయబడింది. అటువంటి పరిస్థితిలో సోమవారం రోజున శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆవ నూనె, నెయ్యి లేదా మహువా నూనె((ఇప్ప పూల)తో దీపం వెలిగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.

సనాతన ధర్మంలో దీపం వెలిగించడం చాలా ముఖ్యం. ఉదయం, సాయంత్రం పూజ చేసేటప్పుడు ఇంట్లో దీపం వెలిగిస్తారు. శివ పురాణం ప్రకారం మహువా నూనె శివుడికి చాలా ప్రియమైనది. కనుక సోమవారం నాడు మహువా నూనెతో దీపం వెలిగించడం శుభప్రదం. ఇలా చేయడం వలన భోలాశంకరుడు సంతోషించి భక్తులపై తన ఆశీస్సులను కురిపిస్తాడని విశ్వాసం.

సోమవారం రోజున శివలింగం ముందు ఆవ నూనె దీపం వెలిగించవచ్చు. సంతాన ధర్మంలో మత విశ్వాసం ప్రకారం.. సోమవారం నాడు ఆవ నూనె దీపం వెలిగించడం వల్ల మహాదేవుడు సంతోషిస్తాడు. భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి

హిందూ విశ్వాసం ప్రకారం సోమవారం నాడు శివాలయంలో నెయ్యి దీపం వెలిగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. సోమవారం నాడు నెయ్యి దీపం వెలిగించడం వల్ల శివుని అపారమైన ఆశీస్సులు లభిస్తాయి.

సోమవారం నాడు నువ్వుల నూనె దీపం వెలిగించవచ్చు. మత విశ్వాసం ప్రకారం సోమవారం నాడు నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల శని, రాహువు లేదా కేతువు యొక్క అశుభ ప్రభావాల నుంచి ఉపశమనం లభిస్తుంది.




