జాగ్రత్త.. ఇలాంటి వారికి డబ్బు అప్పుగా ఇచ్చారో నిండా మునుగుతారు..!
ఎవరైనా అప్పు అడిగినప్పుడు మీరు తొందరపడి ఇచ్చేస్తే ఆనక వారు ఆ డబ్బు తిరిగి చెల్లించకుండా తిప్పలు పెడతారు. డబ్బు సకాలంలో తిరిగి చెల్లించకపోతే డిఫాల్ట్ కావడం సహజం. ఈ కారణంగా చాలా మంది అడిగిన వెంటనే డబ్బు అప్పుగా ఇచ్చేస్తారు. కానీ ఆ డబ్బు తిరిగి పొందడానికి ఇబ్బంది పడేవాళ్లు మనలో..

సాధారణంగా ఎవరికైనా ఎప్పుడోఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే సందర్భం వస్తుంది. ఇలాంటి సమయంలో చాలా మంది తమ బంధువులు, స్నేహితులు, పరిచయస్తులను డబ్బు అప్పుగా అడుగుతుంటారు. అలాగే ఎవరైనా అప్పు అడిగినప్పుడు మీరు తొందరపడి ఇచ్చేస్తే ఆనక వారు ఆ డబ్బు తిరిగి చెల్లించకుండా తిప్పలు పెడతారు. డబ్బు సకాలంలో తిరిగి చెల్లించకపోతే డిఫాల్ట్ కావడం సహజం. ఈ కారణంగా చాలా మంది అడిగిన వెంటనే డబ్బు అప్పుగా ఇచ్చేస్తారు. కానీ ఆ డబ్బు తిరిగి పొందడానికి ఇబ్బంది పడేవాళ్లు మనలో చాలా మందే ఉన్నారు. మీరు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి. భవిష్యత్తులో ఎవరైనా డబ్బు అడిగితే ఇలాంటి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు ఇవ్వకండి..
మతిమరుపు
కొంతమంది అప్పు తీసుకున్న తర్వాత దానిని తిరిగి చెల్లించడం మర్చిపోతారు. దీంతో తాము డబ్బు తీసుకున్న సంగతి మర్చిపోయి.. దానిని ఎప్పటికీ తిరిగి ఇవ్వరు. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని పదే పదే అప్పు అడిగితే, వారికి డబ్బు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వకండి. ఎందుకంటే వారు అప్పు ఇచ్చారని, దానిని తిరిగి ఇవ్వాలన్న సంగతి వారు మర్చిపోతారు. మీరు అలాంటి వ్యక్తులకు డబ్బు ఇస్తే ఖచ్చితంగా నష్టపోతారు.
సరదా కోసం అప్పులు
కష్ట సమయాల్లో అప్పులు చేసే వారు కొందరు ఉంటే.. కేవలం సరదా కోసం అప్పు తీసుకునే వారు మరి కొందరు ఉన్నారు. షాపింగ్ చేయడానికి, ఆనందించడానికి స్నేహితుల వద్ద ఎల్లప్పుడూ వీరు డబ్బు అప్పుగా తీసుకుంటూనే ఉంటారు. ఇలా సరదాలు చేసేవారికి, డబ్బు వృధా చేసే వారికి మీరు ఎట్టిపరిస్థితుల్లోనూ డబ్బు అప్పుగా ఇవ్వకూడదు.
పదే పదే అప్పు అడిగేవారు
కొంతమంది ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వకుండానే మళ్లీమళ్లీ అప్పులు అడుగుతారు. ‘ఇంకాస్త డబ్బు ఇవ్వండి, అన్నీ కలిపి చెల్లిస్తాను’ అని చెప్పేవాళ్ళు మీరు చాలా సార్లు చూసే ఉంటారు. గతంలో తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకుండా మళ్ళీ డబ్బు అడిగితే, అలాంటి వారికి అప్పు ఇవ్వకండి.
ఉదాసీనంగా ఉండేవారు
కొంతమంది రుణాలు తీసుకునేటప్పుడు చాలా బాగా మాట్లాడతారు. స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తారు. మీరు రుణం తిరిగి చెల్లించమని అడిగినప్పుడు మాత్రం వారు మిమ్మల్ని విస్మయానికి గురి చేస్తుంది. మీరు ఫోన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయకపోవడం చేస్తుంటారు. అలాంటి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు ఇవ్వకండి. ఎందుకంటే వారు మీ డబ్బును పూర్తిగా తిరిగి ఇస్తారనే హామీ ఉండదు.
తమ అవసరాల కోసం మాత్రమే మీ దగ్గరకు వచ్చేవారు
కొంతమందికి సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే స్నేహితులు, బంధువులు ఉన్నారనే విషయం గుర్తుకు వస్తుంది. మిగతా అన్ని వేళల్లో మనం ఎవరో తెలియనట్లుగా అహంకారంతో ప్రవర్తిస్తారు. ఇలా ప్రవర్తించే స్నేహితులు మీకు ఉన్నారా? అయితే ఇలాంటి వారు అప్పు అడిగితే, ఎప్పటికీ ఇవ్వకండి. ఎందుకంటే వారు తమ అవసరాల కోసం మాత్రమే మీ దగ్గరకు వస్తారు. అదే మీకెప్పుడైనా అవసరం వచ్చి వారి సహాయం కోరితే, ఇలాంటి వారు కనీసం మీ వైపు కూడా చూడరు. కాబట్టి ఇతరుల నుంచి డబ్బును సులువుగా పొందడానికి ప్రయత్నించే ఇలాంటి వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ డబ్బు అప్పుగా ఇవ్వకండి.
మరిన్ని జీవనశైలి కథనాల కోసం క్లిక్ చేయండి.








