Raw or Cooked Beetroot: బీట్‌రూట్ ఉడికించినదా? పచ్చిదా? ఎలా తింటే.. ఆరోగ్యానికి మంచిదంటే..
దుంప కూరల్లో బీట్‌రూట్ ఒకటి. దీనిని రక్తహీనతతో బాధపడేవారు బీట్‌రూట్ ని తినడం వల్ల ప్రయోజనం పొందుతారు. ఈ బీట్‌రూట్‌ను తినే ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అయితే బీట్ రూట్ ని ఎలా తినాలో తెలుసా..! ఉడికించిన బీట్‌రూట్ లేదా పచ్చి బీట్‌రూట్ దేనిని తినడం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా? దీనిని తినే ముందు బీట్ రూట్ ఎలా తింటే ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..

శరీరానికి అవసరమైన పోషకాలు ఇచ్చే కూరగాయలలో బీట్‌రూట్ ఒకటి. దీనిని కోసినప్పుడు ఎర్రగా ఉండి.. చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే దీనిని తినడానికి ఎవరు అంతగా ఇష్టపడరు. దీన్ని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఫోలేట్, ఐరన్, పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉన్న దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. అయితే ఆరోగ్యానికి బీట్‌రూట్ లేదా పచ్చి బీట్‌రూట్ ఏది మంచిదో తెలుసా.. బీట్‌రూట్ ఎలా తింటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.. ఆరోగ్య నిపుణులు సలహా ఏమిటో తెలుసుకుందాం..
ఉడికించిన బీట్‌రూట్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
బీట్‌రూట్‌ను ఉడికించి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బీట్‌రూట్ ఉడికించినప్పుడు.. దాని ఫైబర్ మృదువుగా ఉంటుంది. అందువల్ల ఇది సులభంగా జీర్ణమవుతుంది. గుండె ఆరోగ్యం, ఆక్సిజన్, కండరాల పనితీరుకు మద్దతు ఇచ్చే పొటాషియం, ఐరెన్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు లభించేందుకు బీట్ రూట్ ని ఉడికించడం మంచిది. ఉడికించిన బీట్‌రూట్ తినడం వల్ల శరీరానికి అవసరమైన నైట్రేట్లు లభిస్తాయి. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.
పచ్చి బీట్‌రూట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
బీట్‌రూట్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి చాలా అవసరం. దీనిలోని ఫోలేట్ కణాల పెరుగుదలకు, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. బీట్‌రూట్‌ను పచ్చిగా తినడం వల్ల దాని యాంటీఆక్సిడెంట్లు, బీటాలైన్‌ల కారణంగా వాపు తగ్గుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించబడుతుంది. బీట్‌రూట్‌ను పచ్చిగా తినడం వల్ల శరీరానికి ఎక్కువ విటమిన్ సి లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. పచ్చి బీట్‌రూట్ చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
ఉడికించిన బీట్‌రూట్, పచ్చి బీట్‌రూట్: ఆరోగ్యానికి ఏది మంచిది?
ఉడికించిన బీట్‌రూట్ లేదా పచ్చి బీట్‌రూట్ ఏది మంచిదనే సందేహం ఉంటే.. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివని చెప్పవచ్చు. అయితే నిపుణులు బీట్ రూట్ ని పచ్చిగా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. పచ్చి బీట్‌రూట్ శరీరానికి విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లతో సహా మరిన్ని పోషకాలను అందిస్తుంది. ఉడికించిన బీట్‌రూట్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








