AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంట్లో డబ్బుకి కొరత ఉండకూడదంటే.. దక్షిణ దిశలో ఈ వస్తువులు పెట్టండి.. మార్పు మీకే తెలుస్తుంది..

వాస్తు శాస్త్రం ఇంటిలో ప్రతి దిక్కుకి ఒక ప్రాముఖ్యత ఉంది. అదే విధంగా ఇంటి దక్షిణ దిశ సంపదతో ముడిపడి ఉంటుందని చెబుతారు. ఈ దిశలో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల డబ్బు అయస్కాంతంలా ఆకర్షిస్తుందని, ఇంట్లో ఎల్లప్పుడూ సానుకూల శక్తి ఉంటుందని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు. కనుక ఈ రోజు దక్షిణ దిశలో పెట్టుకోవాల్సిన వస్తువులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

Vastu Tips: ఇంట్లో డబ్బుకి కొరత ఉండకూడదంటే.. దక్షిణ దిశలో ఈ వస్తువులు పెట్టండి.. మార్పు మీకే తెలుస్తుంది..
Vastu Tips For Home
Surya Kala
|

Updated on: Jul 15, 2025 | 7:53 AM

Share

ఇంటి నిర్మాణం, దిశ, ఆకారం, వంటగది సహా ఇంటిలోని ప్రతి మూలకు వాస్తు నియమాలను పాటించడం చాలా ముఖ్యం అని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలా నియమాలను పాటించడం వలన ఇంటిలో సానుకూల శక్తి ఏర్పడి ఈ కారణంగా సంపదను పెంచుతుంది . వాస్తు ప్రకారం కొన్ని రకాల వస్తువులను ఇంటికి దక్షిణ దిశలో ఉంచడం వల్ల సంపద ప్రవాహం పెరుగుతుందని చెబుతారు. కనుక ఈ రోజు దక్షిణ దిశలో పెట్టాల్సిన వస్తువులు ఏమిటో ఈ రోజున తెలుసుకుందాం..

ఫీనిక్స్ పక్షి చిత్రం : ఇంటి దక్షిణ గోడపై ఫీనిక్స్ పక్షి చిత్రాన్ని లేదా పెయింటింగ్‌ను ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఈ దిశలో ఈ పక్షి చిత్రాన్ని ఉంచడం వల్ల పేదరికం తొలగిపోయి సంపద వస్తుంది . అలాగే ఇంట్లో నివసించే వ్యక్తుల ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు .​

చీపురు : చీపురు లక్ష్మీదేవితో ముడిపడి ఉంది . అటువంటి పరిస్థితిలో చీపురును తప్పుడు దిశలో ఉంచడం వల్ల మీరు పేదరికానికి దారితీయవచ్చు. వాస్తు నిపుణులు చెప్పిన ప్రకారం.. చీపురును ఎల్లప్పుడూ ఇంటికి దక్షిణ దిశలో ఉంచాలి. ఇలా చేయడం వలన ఆ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది. సంపదను పెంచుతుంది. అయితే ఎప్పుడూ చీపురును బయటి వ్యక్తులు చూడలేని విధంగా ఉంచాలనే విషయం మాత్రం మరచిపోవద్దు.

మంచం : సాధారణంగా ప్రతి ఇంట్లో మంచం ఉంటుంది. కానీ తెలిసి లేదా తెలియకుండా మంచాన్ని తప్పు దిశలో ఏర్పాటు చేసుకుంటే.. ఆ మంచం వాస్తు దోషాలకు కారణమవుతుంది . వాస్తు శాస్త్రం ప్రకారం మంచం తల ఎల్లప్పుడూ దక్షిణ దిశలో ఉండాలి. ఇది జీవితంలో సానుకూల శక్తిని కలిగిస్తుంది.

పూర్వీకుల ఫోటో : ఇంటి దక్షిణ దిశ కూడా యముడు, పూర్వీకులతో ముడిపడి ఉంది. కనుక ఇంటిలోని ఈ ప్రదేశంలో పూర్వీకుల ఫోటోను పెట్టుకోవడం శుభప్రదం. ఇది పూర్వీకుల ఆత్మకు శాంతిని ఇస్తుంది. పూర్వీకుల ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ కుటుంబ సభ్యులపై ఉంటాయి .

జాడే మొక్క : జాడే మొక్కను సంపద మొక్క అని పిలుస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కను దక్షిణ దిశలో ఉంచితే డబ్బు అయస్కాంతంలా ఆకర్షించబడి ఆర్థిక లాభాలు లభిస్తాయని చెబుతారు .

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us