AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best day to Donate: వారంలో ఏ రోజు దానం చేయడానికి పవిత్రమైన రోజు.. వేటిని దానం చేయడం ఫలవంతం అంటే..

భారతీయ సంస్కృతిలో దానం ఒక పుణ్యకార్యంగా పరిగణించబడుతుంది. పురాణ గ్రంథాలు, జ్యోతిషశాస్త్రం ప్రకారం వారంలోని ప్రతి రోజుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వేర్వేరు వస్తువులను దానం చేయడం ద్వారా, ఒక వ్యక్తికి వేర్వేరు ఫలాలు లభిస్తాయి. అయితే నవ గ్రహాల దోష నివారణకు వారంలో ఒకొక్క రోజుకి ఒకొక్క రకమైన వస్తువుని దానం చేయడం ఫలవంతం. ఏ రోజున వేటిని దానం చేయడం ఉత్తమమో తెలుసుకుందాం..

Best day to Donate: వారంలో ఏ రోజు దానం చేయడానికి పవిత్రమైన రోజు.. వేటిని దానం చేయడం ఫలవంతం అంటే..
Best Day To Donate
Surya Kala
|

Updated on: Jul 15, 2025 | 7:25 AM

Share

దానధర్మాలు భారతీయ సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్నాయి. దానధర్మాలకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు ఇలా చేయడం సామాజిక సామరస్యం, వ్యక్తిగత శాంతికి కూడా ఇది ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ప్రజలు తమ విశ్వాసం, ఆర్ధిక శక్తి సామర్థ్యం ప్రకారం దానం చేస్తారు. అయితే వారంలో ఒక నిర్దిష్ట రోజు దానం చేయడానికి మరింత పవిత్రమైనదని మీకు తెలుసా? వారంలో ఏ రోజున దానం చేయడం శుభప్రదమో? ఏ రోజున వేటిని దానం చేయడం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుందో ఈ రోజు తెలుసుకుందాం.

జ్యోతిషశాస్త్రం పురాణ గ్రంథాలలో దానం ప్రాముఖ్యత హిందూ మతంలో దానధర్మాలు మోక్షాన్ని పొందడానికి ఒక ముఖ్యమైన మార్గంగా భావిస్తారు. శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా దానధర్మాలను పవిత్ర కార్యంగా పరిగణించాడు. జ్యోతిషశాస్త్రంలో దానధర్మాలు గ్రహాల స్థానం, వాటి శుభ అశుభ ప్రభావాలతో ముడిపడి ఉన్నాయి. సరైన సమయంలో సరైన వస్తువులను దానం చేయడం ద్వారా గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చని, సానుకూల శక్తిని పెంచుకోవచ్చని నమ్ముతారు.

వారంలో ఏ రోజున దానం చేయాలంటే జ్యోతిష విశ్వాసాల ప్రకారం వారంలోని ప్రతి రోజు ఏదో ఒక గ్రహానికి సంబంధించినది. దీని ఆధారంగా వేర్వేరు రోజులలో నిర్దిష్ట వస్తువులను దానం చేయడం మరింత ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది.

ఇవి కూడా చదవండి
  1. ఆదివారం: సూర్య భగవానుని ఆరాధించే రోజు. ఆదివారం సూర్యభగవానుడికి అంకితం చేయబడింది. సూర్యుడు కీర్తి, గౌరవం, ఆరోగ్యానికి కారకుడు.
  2. ఏమి దానం చేయాలి: గోధుమలు, బెల్లం, రాగి, ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.
  3. సోమవారం: చంద్రుని రోజు. సోమవారం మనస్సు, శాంతి, తల్లికి కారకుడైన చంద్రుడికి అంకితం చేయబడింది.
  4. ఏమి దానం చేయాలి: బియ్యం, పాలు, పెరుగు, తెల్లని బట్టలు, వెండి, ముత్యాలు దానం చేయండి.
  5. మంగళవారము: మంగళ దేవుడి అంకితం చేసిన రోజు. మంగళవారం శక్తి, ధైర్యం, భూమికి కారకుడైన మంగళుడికి అంకితం చేయబడింది.
  6. ఏమి దానం చేయాలి: పప్పు ధాన్యాలు, ఎర్ర చందనం, ఎర్రటి బట్టలు, మిఠాయిలు (బుందీ లడ్డూ), ఆయుధాలు లేదా భూమికి సంబంధించిన వస్తువులను దానం చేయవచ్చు.
  7. బుధవారం: బుధ దేవుడికి అంకితం చేసిన రోజు. బుధుడు తెలివితేటలు, వాక్కు, వ్యాపారానికి కారకుడు.
  8. ఏమి దానం చేయాలి: పచ్చి పెసలు, పచ్చని బట్టలు, వీలైతే పచ్చ, కర్పూరం, చక్కెర మిఠాయి దానం చేయండి.
  9. గురువారం: బృహస్పతి దేవుడి రోజు. గురువారం జ్ఞానం, మతం, పిల్లలు , అదృష్టానికి కారకుడైన బృహస్పతికి అంకితం చేయబడింది.
  10. ఏమి దానం చేయాలి: శనగ పప్పు, పసుపు బట్టలు, పసుపు, బంగారం (వీలైతే), అధ్యతిక పుస్తకాలు, కుంకుమపువ్వు దానం చేయండి.
  11. శుక్రవారం: శుక్రుని రోజు. శుక్రవారం భౌతిక ఆనందం, ప్రేమ, అందం, కళలకు కారకుడైన శుక్రుడికి అంకితం చేయబడింది.
  12. ఏమి దానం చేయాలి: బియ్యం, పాలు, పెరుగు, తెల్లని బట్టలు, సుగంధ ద్రవ్యాలు, సౌందర్య సాధనాలు, వెండి, చక్కెర దానం చేయండి.
  13. శనివారం: శనిశ్వరుడి రోజు. కర్మ, న్యాయం, వయస్సుకు కారకుడైన శనిశ్వరుడికి శనివారం అంకితం చేయబడింది.
  14. ఏమి దానం చేయాలి: నల్ల నువ్వులు, ఆవాల నూనె, మినపప్పు, నల్ల బట్టలు, ఇనుము, దుప్పటి దానం చేయండి.

ఏదైనా ప్రత్యేకమైన రోజు అత్యంత పవిత్రమైనదా? వారంలోని అన్ని రోజులు దానధర్మాలకు శుభప్రదమైనవిగా పరిగణించబడుతున్నప్పటికి గురువారం, శనివారం దానధర్మాలకు ప్రత్యేకంగా శుభప్రదమైనవిగా భావిస్తారు. గురువారం జ్ఞానం, శ్రేయస్సు గ్రహం అయిన బృహస్పతితో సంబంధం కలిగి ఉన్నందున మతపరమైన పనులు, దానధర్మాలకు ముఖ్యంగా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. మరోవైపు శనివారం శనీశ్వరుడితో సంబంధం కలిగి ఉంటుంది. అందువల్ల పేదలు, ఆపన్నులకు దానం చేయడం వల్ల శనీశ్వరుడు చెడు ప్రభావాల నుంచి ఉపశమనం లభిస్తుంది. శుభ ఫలితాలను తెస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.