Chanakya Niti: చాణక్య చెప్పిన ఈ మూడు నియమాలు పాటించండి.. శత్రువుపై సులభంగా గెలుపు సాధించండి…
ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో మానవ జీవితానికి సంబందించిన అనేక విషయాలను తెలియజేశాడు. కొన్ని వందల ఏళ్ల క్రితం నీతి శాస్త్రంలో చెప్పిన విషయాలు నేటి యువత పాటించడం వలన విశేషమైన ఫలితాలు ఉంటాయని పెద్దలు చెబుతారు. ప్రతి మనిషి జీవితంలో సహజంగా ఒకరినొకరు ద్వేషించే వ్యక్తులు లేదా ఒకరికొకరు హాని కలిగించాలనుకునే వ్యక్తులు తారసపడుతూ ఉంటారు. అటువంటి శత్రువులను కొన్ని సింపుల్ టిప్స్ తో ఓడించవచ్చు అని చెబుతున్నాడు ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో.

జీవితంలో సవాళ్లు అయినా, శత్రువులు సృష్టించే సమస్యలు అయినా లేదా ఇతర సమస్యలు అయినా. వీటన్నింటినీ అధిగమించే మార్గం చాణక్య నీతిలో చెప్పబడింది. ఈ రోజు మనం శత్రువుపై విజయం సాధించే మార్గాల గురించి చాణక్య నీతి శాస్త్రంలో చెప్పిన విషయాల గురించి తెలుసుకుందాం. గొప్ప దౌత్యవేత్త, రాజకీయవేత్త , ఆర్థికవేత్త ఆచార్య చాణక్య శత్రువును ఓడించే మార్గాలను చెప్పారు. ఈ మార్గాలు మనం అనుసరించడం సులభం. మీ జీవితంలో స్నేహితులు లేకపోయినా పర్వాలేదు, కానీ శత్రువులను చేసుకోకండని ఆచార్య చాణక్య చెప్పాడు. శత్రువులు ఉంటే.. కొన్ని మార్గాల ద్వారా వారిని జయించవచ్చు అని ఆచార్య చెప్పాడు.
సంతోషంగా ఉండండి: శత్రువు ఎంత శక్తివంతుడైనా.. అతను మీ ఆనందాన్ని చూడలేడని ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో చెప్పాడు. అందువల్ల మీరు మానసికంగా ఎంత అలసిపోయినా, బయటికి మాత్రం మీ శత్రువు ముందు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. మీరు ఎప్పుడు ఆనందంగా ఉండడం చూసిన శత్రువు బలంలో సగం నాశనం అవుతుంది. ఇలా మీ సంతోషంతో శత్రువుని సులభంగా ఓడించవచ్చు. నవ్వడం, సంతోషంగా ఉండటం అంటే.. శత్రువు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా.. అది మీపై ఎలాంటి ప్రభావం చూపదని చెప్పకనే అతని చెప్పడం. మీ సంతోషం.. మీ శత్రువును అశాంతిలోకి నెట్టివేస్తుంది. కోపంలో అతను తప్పు పనులు చేస్తాడు. తన ఉచ్చులో తానే చిక్కుకుంటాడు.
జవాబు చెప్పవద్దు ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చే అలవాటు ఉంటుంది. ఇది చెడు అలవాటు అని చాణక్య చెబుతున్నాడు. ఇలా మాటకి మాట జవాబు చెప్పడం వలన నష్టం మీదే. శత్రువు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించినప్పుడు మౌనంగా ఉండటం మంచిది. మౌనం సమాధానం అని .. మౌనంతో శత్రువుని సాధించవచ్చు అని అంటారు. అంటే మౌనం ద్వారా మీ శత్రువుకి ప్రత్యుత్తరం ఇవ్వడం వలన మేలు కలుగుతుంది. ప్రత్యుత్తరం ఇచ్చి మీ శక్తిని వృధా చేసుకునే బదులుగా మీ చర్యల ద్వారా శత్రువుకు ప్రత్యుత్తరం ఇవ్వండి. మౌనం బలహీనతకు సంకేతం కాదు.. అది మీ శక్తి. ప్రతికూల విషయాల కోసం ఆ శక్తిని ఉపయోగించే బదులు, సానుకూల మార్పులను సృష్టించడానికి మీ శక్తిని ఉపయోగించండి. ఈ చర్య కారణంగా శత్రువు స్వయంచాలకంగా మీకు దూరంగా వెళ్ళిపోతాడు.
కోపం నియంత్రణ శత్రువుపై యుద్ధం చేయకుండా గెలవాలంటే కోపాన్ని నియంత్రించుకోవాలి. కోప నియంత్రణ చేయలేకపోతే ఆ కోపం మిమ్మల్ని నాశనం చేస్తుంది. కోపంలో వ్యక్తి తనను తాను పూర్తిగా మరచిపోతాడు. కోపం తగ్గిన తర్వాత కోపం లో తీసుకున్న చర్యల గురించి ఆలోచిస్తే అప్పటికే సమయం గడిచిపోతుంది. తరువాత సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించే బదులు కోపాన్ని నియంత్రించుకోండి. ప్రశాంతమైన మనసుతో యుద్ధంలో గెలవవచ్చు. ఈ విషయాన్నీ చదరంగం ఆట మనకు దానిని బోధిస్తుంది. శత్రువును ఓడించాలనుకుంటే, ప్రశాంతమైన మనసుతో యుద్ధానికి సిద్ధం అయితేనే విజయం సాధించగలరు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








