తిండి లేక గుడ్లు, బ్రెడ్ తిని బతికింది.. ఇప్పుడు 5 నిమిషాలకు 2 కోట్లు
Rajitha Chanti
Pic credit - Instagram
06 May 2026
ప్రస్తుతం కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్న ఈ స్టార్, ఒకప్పుడు కేవలం 5000 రూపాయలతో భారత్ చేరుకుని ఎన్నో కష్టాలను అనుభవించారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?
కెనడాకు చెందిన నోరా ఫతేహి నటి కావాలనే బలమైన కోరికతో ముంబైలో అడుగుపెట్టారు. ఆ సమయంలో ఆమె వద్ద కేవలం 5000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. నటనపై ఆసక్తితో ఇండియాకు వచ్చింది.
తొమ్మిది మందితో కలిసి రూమ్ షేర్ చేసుకున్న ఆమె.. ఆ సమయంలో తినడానికి తిండి లేక కేవలం 'ఎగ్ బ్రెడ్' (కోడిగుడ్డు, రొట్టె) తింటూ ఆకలి తీర్చుకున్న రోజులు ఆమె జీవితంలో ఉన్నాయి.
సరైన భాష రాకపోయినా, అవకాశాల కోసం ఆడిషన్స్ ఇస్తూ ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. నోరా కెరీర్‌లో సల్మాన్ ఖాన్ నటించిన 'భారత్' సినిమా ఒక కీలక మలుపు అనే చెప్పుకోవాలి.
ఆ తర్వాత 'సత్యమేవ జయతే' సినిమాలోని 'దిల్బర్' సాంగ్ ఆమెను ఓవర్ నైట్ స్టార్‌ను చేసింది. ఆమె అద్భుతమైన డాన్స్ స్టెప్పులకు యావత్ భారతదేశం ఫిదా అయింది.
ఒకప్పుడు పూట గడవడమే కష్టంగా ఉన్న నోరా, నేడు బాలీవుడ్‌లో అత్యధిక డిమాండ్ ఉన్న డ్యాన్సర్‌గా ఎదిగారు. తాజా సమాచారం ప్రకారం ఆమె ఒక స్పెషల్ సాంగ్ చేస్తూ చాలా పాపులర్ అయ్యింది ఈ అమ్మడు.
5 నిమిషాల అతిథి పాత్ర కోసం దాదాపు 2 కోట్ల రూపాయల వరకు పారితోషికం వసూలు చేస్తున్నారు. కేవలం సినిమాలే కాకుండా, రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ కోట్లాది రూపాయలు తీసుకుంటుంది.
ఎటువంటి సినీ నేపథ్యం లేకపోయినా, కేవలం కష్టపడే తత్వం మరియు ప్రతిభతో నోరా ఫతేహి ఈ స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ పాపులర్ అయ్యింది ఈ అమ్మడు.