మళ్లీ దూకుడు పెంచిన బంగారం..! అమెరికా-ఇరాన్ ఒప్పంద ప్రభావంతో పసిడి పరుగులు..తులం ఎంతంటే
May07 Gold Price: భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా మహిళలు పండగలు, శుభకార్యాలు సహా ఇతర వేడుకల సమయంలో బంగారు ఆభరణాల్ని ఎక్కువగా కొనుగోలు చేసి ధరిస్తుంటారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నందున చాలా మంది బంగారం కొనేందుకు చూస్తున్నారు. మీరు కూడా గోల్డ్ కొనాలనుకుంటున్నారా..? అయితే, మీకో అలర్ట్.. కిందటి రోజుతో పోలిస్తే బంగారం ధర మళ్లీ పెరిగింది. వెండి ధర కూడా ఎగబాకింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు స్వల్పంగా తగ్గినా.. బంగారం, వెండి ధరలు పెరగడం గమనార్హం. ఇవాళ ఉదయం 7.30 గంటల సమయంలో రేట్లు ఇలా ఉన్నాయి.

అంతర్జాతీయ రాజకీయ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అమెరికా మరియు ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు తొలగి, శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న వార్తలతో బుధవారం మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ1,52,140లకు పడిపోయింది. అదే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,39,460లకు చేరింది. వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తోంది. వెండి ధర గ్రాముకు రూ. 265.10లు ఉండగా, భారత మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 2,65,100ల వద్ద కొనసాగుతోంది. దేశంలోని ఢిల్లీ, ముంభై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్‌లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,52,140, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,460 ఉంది. వెండి కిలో ధర రూ.2,75,100 ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,52,140, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,460 ఉంది. వెండి కిలో ధర రూ.2,75,100 ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,52,290, 22 క్యారెట్ల ధర రూ.1,39,610 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,65,100 ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,140, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,460 ఉంది. వెండి కిలో ధర రూ.2,65,100 లుగా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,53,830, 22 క్యారెట్ల ధర రూ.1,41,010 ఉంది. వెండి కిలో ధర రూ.2,75,100 లుగా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,170, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,36,740 ఉంది. వెండి కిలో ధర రూ.2,65,100 లుగా ఉంది.
కోల్‌కత్తాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,52,140, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,460 ఉంది. వెండి కిలో ధర రూ.2,65,100 లుగా ఉంది.
మార్కెట్ నిపుణులు అభిప్రాయం ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం, అమెరికా డాలర్ విలువ పడిపోవడం బంగారానికి కలిసొచ్చింది. ముఖ్యంగా వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు ఒక ప్రాథమిక ఒప్పందం (One-Page Memo) సిద్ధమవుతుందన్న వార్తలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఇరాన్ కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తుందని ప్రకటించడం గమనార్హం.
రానున్న రోజుల్లో ప్రపంచ దేశాల ఆర్థిక గణాంకాలు (PMI Data), వడ్డీ రేట్లపై వచ్చే స్పష్టతను బట్టి పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




