AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కళ్యాణ మండపంలో కన్నం వేశాడు.. పెళ్లి జరుగుతుండగానే నగలు చోరీ.. సీసీటీవీలో సీన్‌ టూ సీన్‌..!

ఒక ప్రముఖ కళ్యాణ మండపంలో జరిగిన పెళ్లి వేడుకలో దొంగలు పడి భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. కళ్యాణ మండపంలో పెళ్లి పనులు, వేడుకలు జరుగుతుండగా, అందరూ బిజీగా ఉండటాన్ని దొంగ ఆసరాగా చేసుకున్నాడు. వరుడి కుటుంబానికి చెందిన గదిలోకి ప్రవేశించి, అక్కడ ఉంచిన విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను అపహరించాడు. విజయనగర జిల్లా (కర్ణాటక) హోస్పేటలో జరిగిన ఈ భారీ చోరీ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

కళ్యాణ మండపంలో కన్నం వేశాడు.. పెళ్లి జరుగుతుండగానే నగలు చోరీ.. సీసీటీవీలో సీన్‌ టూ సీన్‌..!
Gold And Silver
Jyothi Gadda
|

Updated on: May 06, 2026 | 12:46 PM

Share

శుభకార్యం జరుగుతున్న వేళ ఆ ఇంట్లో సంతోషం నిండాల్సింది పోయి, దొంగతనం జరిగిన వార్తతో ఆందోళన నెలకొంది. బెంగళూరులోని విజయనగర్ హోస్పేట పట్టణంలోని ఒక ప్రముఖ కళ్యాణ మండపంలో జరిగిన పెళ్లి వేడుకలో దొంగలు పడి భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. కళ్యాణ మండపంలో పెళ్లి పనులు, వేడుకలు జరుగుతుండగా, అందరూ బిజీగా ఉండటాన్ని దొంగ ఆసరాగా చేసుకున్నాడు. వరుడి కుటుంబానికి చెందిన గదిలోకి ప్రవేశించి, అక్కడ ఉంచిన విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను అపహరించాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం, చోరీకి గురైన ఆభరణాల విలువ లక్షల్లో ఉంటుందని బాధితులు పేర్కొంటున్నారు.

ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు కళ్యాణ మండపంలోని సీసీటీవీ (CCTV) కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. నిందితుడు గదిలోకి వెళ్లి హ్యాండ్‌బ్యాగ్‌లు లేదా నగలను తీసుకుని వెళ్తున్న తీరు ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని, దాని ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పండుగలు, శుభకార్యాల సమయంలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఈ సందర్భంగా ప్రజలకు సూచిస్తున్నారు.

పెళ్లిళ్ల సీజన్‌లో ఇలాంటి ఘటనలు తరచుగా వింటుంటాము. బంధువుల హడావిడిలో విలువైన వస్తువుల భద్రతను విస్మరించడం దొంగలకు వరంగా మారుతోంది. హోస్పేట పోలీసులు ఈ నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
అమితాబ్ గ్యారేజీలోకి కొత్త మహీంద్రా EV.. కొత్త కారు చూస్తే..
అమితాబ్ గ్యారేజీలోకి కొత్త మహీంద్రా EV.. కొత్త కారు చూస్తే..
ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంట.. పోలీసులు వెతుకుతుండగానే ఊహించని
ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంట.. పోలీసులు వెతుకుతుండగానే ఊహించని
రోహిత్ సెంచరీ సెలబ్రేషన్స్ వెనుక సీక్రెట్ ఇదే..?
రోహిత్ సెంచరీ సెలబ్రేషన్స్ వెనుక సీక్రెట్ ఇదే..?
13 ఏళ్ల తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
13 ఏళ్ల తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
నొప్పి, జ్వరానికి సొంతంగా మందులు వేసుకుంటున్నారా? CDSCO హెచ్చరిక
నొప్పి, జ్వరానికి సొంతంగా మందులు వేసుకుంటున్నారా? CDSCO హెచ్చరిక
స్కూటీ బ్రేక్ హ్యాండిల్ వద్ద ఉండే ఆ చిన్న లివర్ దేనికో తెలుసా?
స్కూటీ బ్రేక్ హ్యాండిల్ వద్ద ఉండే ఆ చిన్న లివర్ దేనికో తెలుసా?
ఇన్‌స్టా రీల్‌తో మొదలై టెలిగ్రామ్ ట్రైనింగ్‌తో జోరుగా దందా!
ఇన్‌స్టా రీల్‌తో మొదలై టెలిగ్రామ్ ట్రైనింగ్‌తో జోరుగా దందా!
చక్కెర తినడం పూర్తిగా ఆపేస్తే శరీరంలో ఏం జరుగుతుంది? నిపుణుల సూచన
చక్కెర తినడం పూర్తిగా ఆపేస్తే శరీరంలో ఏం జరుగుతుంది? నిపుణుల సూచన
విరిగిన ఎముకలకు మేలు చేసే నల్ల కారం పొడి.. ఇడ్లీ, దోసెల్లోకి కూడా
విరిగిన ఎముకలకు మేలు చేసే నల్ల కారం పొడి.. ఇడ్లీ, దోసెల్లోకి కూడా
చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు.. హాకీలో సౌత్ కొరియా ఖేల్ ఖతం..
చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు.. హాకీలో సౌత్ కొరియా ఖేల్ ఖతం..