Lord Shiva Chant: శివుని అనుగ్రహం పొందడానికి ఈ మంత్రాలను పఠించండి..

Lord Shiva Chant: హిందూమతంలో శివుడిని ఆది మహాదేవుడిగా, ఆది శంకరుడిగా, పరమేశ్వరుడిగా కొలుస్తారు. ఆ ఆది మహా శివుడిని..

Lord Shiva Chant: శివుని అనుగ్రహం పొందడానికి ఈ మంత్రాలను పఠించండి..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 26, 2022 | 8:20 PM

Lord Shiva Chant: హిందూమతంలో శివుడిని ఆది మహాదేవుడిగా, ఆది శంకరుడిగా, పరమేశ్వరుడిగా కొలుస్తారు. ఆ ఆది మహా శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు తమ విశ్వాసాల ప్రకారం వివిధ ప్రయత్నాలు, పూజలు చేస్తుంటారు. ఉపవాసం ఉంటారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వామి వారిని ప్రసన్నం చేసుకోవడానికి వేదమంత్రాలను పఠిస్తారు. ఇలా చేయడం వల్ల జీవితంలో అన్ని రకాల అనర్థాలు తొలగిపోతాయని విశ్వాసం. పరమశివుడు చెడును నాశనం చేస్తాడని ప్రతీతి. ప్రజలు తమ జీవితాల్లో సానుకూలత కోసం, అంతర్గత బలం కోసం శివుడిని ఆరాధిస్తారు. వేద మంత్రోచ్ఛారణలతో పూజిస్తారు. అయితే, శివానుగ్రహం పొందానికి అనేక మంత్రాలు ఉన్నప్పటికీ.. అత్యంత ప్రాముఖ్యత పొందిన కొన్ని మంత్రాలు ఉన్నాయి. వాటిని పఠించడం ద్వారా పరమేశ్వరుడి క్రుపను సులభంగా పొందగలుగుతారు. మరి ఆ మంత్రాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఓం నమః శివాయ.. ‘ఓం నమః శివాయ’ అనేది పంచాక్షరీ మహా మంత్రం. ఈ మంత్రం యజుర్వేదం రుద్రాధ్యాయం లోనిది. రుద్రంలోని అష్టమానువాకంలో దీన్ని జాగ్రత్తగా భద్రం చేశారని పండితులు చెప్తారు. ఈ మంత్రం అన్ని కోర్కెలనూ నెరవేర్చే కల్పవృక్షం లాంటింది. దీని ఉచ్చరణ వల్ల చిత్తశుద్ధి, జ్ఞానప్రాప్తి లభిస్తాయని పురాణాల్లో తెలిపారు. ఈ మంత్రాన్ని రోజూ 108 సార్లు జపిస్తే మీ ఆత్మ పరిశుద్ధం అవుతుంది. అన్ని పాపాల నుండి విముక్తి పొందవచ్చునని విశ్వాసం. ఈ మంత్రం మీరు ప్రశాంతంగా ఉండేందుకు దోహదపడుతుంది.

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం | ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ || ఇది మహా మృత్యుంజయ మంత్రం భయాన్ని పోగొట్టడంలో సహాయపడుతుంది. అకాల మరణాన్ని నివారించడానికి ఈ మంత్రాన్ని జపిస్తారు. అనేక అధ్యయనాల ప్రకారం.. ఈ మంత్రం మానసిక, శారీరక ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మంత్రాన్ని పఠించడమంటే.. మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని, స్ఫూర్తిని ఇవ్వమని శివుడిని కోరుతున్నట్లు అర్థం. బంధం, మరణం నుండి మిమ్మల్ని విడిపించమని పరమేశ్వరుడిని అడగడం దీని పరమార్థం.

ఓం నమో భగవతే రుద్రాయ నమః ఈ మంత్రం రుద్ర మంత్రం. దీనిని పఠించడం అంటే.. శివుడు అయిన రుద్రుడికి మనస్సాక్షిగా నమస్కరిస్తున్నట్లు. పరమశివుని అనుగ్రహం పొందడానికి దీనిని పఠించాలి. ఈ మంత్రం మీ కోరికలన్నింటినీ నెరవేర్చడంలో సహాయపడుతుంది. జీవితంలో కోరుకున్న కోరికలను ఆది దేవుడు తీరుస్తాడని ప్రజల విశ్వాసం.

మంత్రాన్ని ఇలా జపించండి.. 1. ఉదయాన్నే స్నానం చేసి శివాలయాన్ని సందర్శించండి. 2. ఆలయంలోని శివలింగం దగ్గర కూర్చుని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం ప్రారంభించండి. 108 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. 3. తేనె, నీరు, పాలను ఆలయానికి తీసుకెళ్లి పరమేశ్వరుడికి అభిషేకం చేయండి. ముఖ్యంగా మహాశివరాత్రి రోజున శివలింగానికి అభిషేకం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 4. శివునికి పూలు, పండ్లు నైవేధ్యంగా సమర్పించండి. దీపం వెలిగించి శివ చాలీసా చదవండి. చివరగా శివ హారతి మంత్రాన్ని పఠించండి.

గమనిక: మత విశ్వాసాలు, మత గ్రంధాల మేరకు.. ప్రజల సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని దీనిని పబ్లిష్ చేయడం జరిగింది.

Also read:

Benefits of Methi: మెంతులతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. ఆకలిని పెంచడమే కాదు..

Amalapuram: లిక్కర్ గోడౌన్‌లో పనిచేస్తోన్న యువతిపై డిపో మేనేజర్ లైంగిక వేధింపులు.. భరించలేక ఆమె ఏం చేసిందంటే

Sundar Pichai: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై కేసు నమోదు.. ఎందుకంటే..