Leo Horoscope 2021: సింహ రాశి వారు ఈ ఏడాది మంచి ఫలితాలు పొందడానికి ఏ ఉంగరాన్ని ధరించాలో తెలుసా..?

వ్యాపారంలో నష్టపోయే అవకాశం ఉంది. కనుక భారీ స్థాయిలో పెట్టుబడులను నివారించండి. ఈ రాశివారికి ప్రేమ వ్యవహారానికి అనుకూలమైన సమయం. దీంతో వీరి కుటుంబ జీవితం, వృత్తి ప్రభావితం కాబోతుంది.

Leo Horoscope 2021: సింహ రాశి వారు ఈ ఏడాది మంచి ఫలితాలు పొందడానికి ఏ ఉంగరాన్ని ధరించాలో తెలుసా..?
Follow us
Surya Kala

|

Updated on: Jan 09, 2021 | 11:19 AM

Leo Horoscope 2021: ఈ రాశివారికి 2021 అనుకూలంగా ఉంటుంది. మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ సంవత్సరం మొత్తం రాహువు పదో ఇంట్లో సంచరిస్తుండగా.. నాలుగవ ఇంట్లో కేతువు ఉంటాడు. ఇది వీరి కుటుంబ జీవితాన్ని, వృత్తిని ప్రభావితం చేస్తుంది. అంగారకుడు ఈ ఏడాది ప్రారంభంలో తొమ్మిదవ ఇంట్లో ఉంటారు. అయితే ఆరవ ఇంట్లో శని, బృహస్పతిలు సంచరిస్తారు. దీంతో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. మొత్తానికి ఈ రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతుంది.. ఎటువంటి మార్పులను తెస్తుంది , ఎలాంటి శుభఫలితాలను పొందుతారో చూద్దాం..

కెరీర్ – వ్యాపారం కెరీర్ పరంగా, 2021 సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది, ఈ ఏడాది ఉద్యోగులు విజయాలు అందుకుంటారు. తద్వారా పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే, మీ ప్రత్యర్థులు పనికి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. కానీ మీరు వారిని అధిడమిస్తారు. అయితే వ్యాపారస్తులకు సవాళ్లు ఎదురవుతాయి. ఈ రాశి పై గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావం ఉండడంతో వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కనుక ముందునుంచి తగినంత జాగ్రత్త తీసుకోవాలి. పెట్టుబడుల జోలికి ఈ ఏడాది వీలైనంత దూరంలో ఉంటె మంచిది.

ఆర్థిక – కుటుంబ జీవితం ఈ సంవత్సరం ఆర్థిక విషయాల పరంగా హెచ్చు తగ్గులు ఉంటాయి. అధిక ఖర్చులతో ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కనుక ఈ ఏడాది ఈ రాశివారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితంలో గ్రహాల యొక్క గ్రహ స్థానం మంచి ఫలితాలను ఇవ్వబోతోంది. గురు, బృహస్పతిల అపారమైన దయతో, కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. అయితే తల్లికి ఆరోగ్య నష్టం కారణంగా, మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కొనాల్సి ఉంటుంది.

ప్రేమ -వివాహ జీవితం ప్రేమ జీవితాలకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ప్రేమలో ఉన్న కొంతమంది.. వారి సహచరులను వివాహం చేసుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ రాశి వారిపై గురు బృహస్పతి, శుక్ర దయ ఉండడంతో ప్రేమికులకు అనుకూలం. అయితే వివాహితులు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడి భాగస్వామితో బేధాభిప్రాయాలు చోటు చేసుకోవచ్చు. శని ప్రభావం తో వివాహ బంధంలో అపోహలు ఏర్పడతాయి. దీంతో చెడు ప్రభావం దంపతులిద్దరిపై స్పష్టంగా కనిపిస్తుంది.

చదువు

విద్యార్థులు మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంది. వీరికి పోటీ పరీక్షలు కొంత సవాలుగా మారవచ్చు. అందువల్ల మరింత కృషి చేయాల్సి ఉంటుంది. ఉన్నత విద్యను అభ్యసించే వారు ఈ సమయంలో అదనపు కృషి చేయాలి. మీరు మీ చదువును ఒక విదేశీ దేశంలో పూర్తి చేయాలనుకుంటే,ఈ సంవత్సరం అనుకూలంగా ఉండకపోవచ్చు. అందువల్ల, మీరు కష్టపడి పనిచేయట మంచిది. రాహు-కేతు నీడ. ఈ రాశి పై ఉండడంతో విద్యలో ఆటంకాలు కలుగుతాయి.

ఆరోగ్యం శారీరక సమస్యలను ఎదుర్కొంటారు. కీళ్ల నొప్పులు, డయాబెటిస్‌కు సంబంధించిన సమస్యలు ఏర్పడవచ్చు. కనుక ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. శని , బృహస్పతి కలయికయికతో ఈ రాశి వారు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.

పరిష్కారం ఈ రాశివారు శుభ ఫలితాలను పొందడదనికి.. రాగితో చేసిన కెంపుతో కూడిన ఉంగరాన్ని ఆదివారం ధరించడం మంచిది.

Also Read: కన్య రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది, ఏ విధమైన ఆర్ధిక ఫలితాలను ఇస్తుంది తెలుసుకుందాం..!