Ramatheertham Idol Rama: రామతీర్థంలో ధ్వంసమైన రాములవారి విగ్రహం తయారీ ఎక్కడో తెలుసా..!
Ramatheertham Idol Rama: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని బోడికొండపై సుమారు 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయంపై గుర్తు తెలియని దుండుగులు దాడి చేశారు. బొడికొండ ఆలయంలో రాములవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనతో ఏపీ రాజకీయాలను కుదిపేసింది. రాముడి విగ్రహ ధ్వంసం.. అనంతర పరిణామాలతో అట్టుడికిపోయింది. భక్తులు, పూజార్లు, హిందూ సంఘాలు, సాధువులు, ప్రతిపక్ష పార్టీలు నేతలు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ వెంటనే చర్యలు తీసుకుంది. ఇప్పటికే […]
Ramatheertham Idol Rama: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని బోడికొండపై సుమారు 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయంపై గుర్తు తెలియని దుండుగులు దాడి చేశారు. బొడికొండ ఆలయంలో రాములవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనతో ఏపీ రాజకీయాలను కుదిపేసింది. రాముడి విగ్రహ ధ్వంసం.. అనంతర పరిణామాలతో అట్టుడికిపోయింది. భక్తులు, పూజార్లు, హిందూ సంఘాలు, సాధువులు, ప్రతిపక్ష పార్టీలు నేతలు ఆందోళనకు దిగారు.
ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ వెంటనే చర్యలు తీసుకుంది. ఇప్పటికే సీబీఐ ఎంక్వైరీ నడుస్తోంది. తాజాగా ధ్వంసమైన రాములవారి విగ్రహాన్ని తయారు చేయించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. విగ్రహాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో తయారు చేయనున్నారు. ఇప్పటికే తిరుపతిలోని శిల్ప కళాశాలలో కొత్త విగ్రహం తయారు చేయాలని టిటిడి అధికారులకు దేవాదాయ శాఖ కమిషనర్ లేఖ రాసింది. అంతేకాదు.. ధ్వంసమైన విగ్రహ నమూనాని పంపించింది. శిల్ప కళాశాలలో ఇప్పటికే తయారు చేసి ఉన్న విహగ్రహాలను జాయింట్ కమిషనర్ వెంగమాంబ స్వయంగా పరిశీలించారు. ధ్వంసమైన విగ్రహం మాదిరిగా ఏదీ లేకపోవడంతో కొత్త విగ్రహం చేయించాలని నిర్ణయించారు.
Also Read: దేశ వ్యాప్తంగా 5 వేల కేంద్రాల్లో కోవిడ్ టీకా పంపిణీ.. ఏపీలో 332 సెంటర్స్ ఏర్పాటు