AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virgo horoscope 2021: కన్య రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది, ఏ విధమైన ఆర్ధిక ఫలితాలను ఇస్తుంది తెలుసుకుందాం..!

కన్యరాశి ఫలాలు 2021 అంచనాల ప్రకారం, ఈ సంవత్సరం ఈ రాశిగల వారికి మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి. సంవత్సరం ప్రారంభం మీ కోసం అద్భుతమైనదిగా ఉంటుంది, కానీ సంవత్సరం మధ్యలో జాగ్రత్తగా ఉండాలి, అనంతరం చక్కటి అనుకూల ఫలితాలను కలుగచేయును, ఆదాయం పెరుగుతుంది.

Virgo horoscope 2021: కన్య రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది, ఏ విధమైన ఆర్ధిక ఫలితాలను ఇస్తుంది తెలుసుకుందాం..!
Surya Kala
|

Updated on: Jan 09, 2021 | 7:27 AM

Share

Virgo horoscope 2021: ఈ ఏడాదిలో కన్య రాశి వారి జీవితంలో శుభపరిణామాలు కలుగుతాయి. ఆర్ధిక పురోగతిని తెస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం సూర్యుడు, గురు బృహస్పతి, బుధుడు వంటి గ్రహాల్లో కన్యారాశిలో ఉంటాయి. అంతేకాదు .. ఐదవ ఇంట్లో శని, తొమ్మిదవ ఇంట్లో రాహువు ఉండడంతో వీరికి శుభం కలుగుతుంది.. అయితే ఈ ఏడాదిలో వీరి ఆర్థికస్థితిగతులు, ఆరోగ్యం , వృత్తి వంటివి ఎలా ఉండబోతున్నాయి చూద్దాం..

వ్యాపారం, వృత్తి: ఈ సంవత్సరం ఐదవ ఇంట్లో శని ఉండడంతో.. కన్య రాశివారు కెరీర్ పరంగా మంచి విజయం సొంతం చేసుకుంటారు. ఈ సమయంలో మీరు కష్టపడితే ఫలితాలను పొందగలుగుతారు. అయితే, ఏడాది మధ్య ఇతర గ్రహాల ప్రభావం తో ఈ రాశి వారు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఎదురయ్యే ప్రతి సవాలును పరిస్కరించుకుంగారు. ఇక వ్యాపారవేత్తలు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. లేదంటే నష్టాన్ని చవిచూడవచ్చు. ఈ ఏడాది వ్యాపారులకు జనవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్ నెలలు అనుకూలం. కొత్త పరిచయాలు లాభిస్తాయి.

ఆర్థిక , కుటుంబ జీవితం ఈ ఏడాది ప్రారంభంలో వీరు ఆర్థికంగా బలహీనంగా ఉంటారు. సంవత్సరం మధ్య నుండి, గ్రహాల అనుకూల దృష్టితో ఆదాయాన్ని ఆర్జిస్తారు. ఈ సంవత్సరం చివరినాటికి, అనేక మార్గాల్లో డబ్బులు సంపాదిస్తారు. అన్ని విషయాలలో పూర్తీ అనుకూలత ఏర్పడును. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండును. శని ప్రభావంతో ఆస్తి వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకూ వివాదాలకు దూరంగా ఉండండి.

ప్రేమ, కుటుంబ జీవితం: ఈ రాశి వారు 2021 సంవత్సరంలో,ప్రేమకు సంబంధించిన విషయాలు సాధారణముగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ,భాగస్వామితో వివాదాలను ఎదుర్కోవలసి ఉంటుంది. మొత్తానికి ప్రేమ , కుటుంబ వ్యవహారాలలో మిశ్రమ ఫలితాలను పొందుతారు, ఎందుకంటే ఈ రాశి లో శుక్రుడు సంచరిస్తాడు. దీంతో ప్రేమికులకు విజయాన్ని పొందుతారు.

చదువు కన్య రాశి కలిగిన విద్యార్థులు ఈ సంవత్సరం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా మీరు రాజకీయాలకు దూరంగా ఉండాలి. సామాజిక సేవ, చేయాలనుకుంటే అది మీకు వ్యతిరేకంగా మారి ప్రత్యేక సవాళ్ళను తెస్తుంది. మీ నెలలో ఈ రాశి పై రాహు-కేతు ప్రభావం ఉండడంతో ఆలోచనలు అదుపుతప్పి గందరగోళానికి గురఅవుతారు, చాలాకాలం నుండి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు తీవ్ర కృషి , శ్రద్ధతో పనిచేస్తే విజయాలను అందుకుంటారు.

ఆరోగ్యం ఈ సంవత్సరం వీరు మానసికంగా శక్తివంతంగా మారతారు. అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇది వీరి పని సామర్థ్యాన్ని పెంచుతుంది. ఏదేమైనా, కొన్ని గ్రహాల ప్రభావంతో సంవత్సర మధ్య కాలంలో వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. కొంతమంది డయాబెటిస్ , మూత్ర సంబంధింత, ఇతర వ్యాధులతో బాధపడవచ్చు.

పరిష్కారం అంగారకుడు, బుధ గ్రహాలను ఈ రాశి వారు శాంతిపజేస్తే… మంచి ఫలితాలను పొందవచ్చు. ప్రతి మంగళవారం కొన్ని పెసలు నానబెట్టి.. వాటిని ఆవుకు స్వయంగా తినిపిస్తే అనుకున్న కోరికలు నెరవేరతాయి.

Read Also: బుధుడు ఏ రాశి వారిపై ఎటువంటి ప్రభావం చూపనున్నాడు.. ఎవరికీ ఏ ఫలితాలు ఇవ్వనున్నాడో తెలుసుకుందాం