Mercury Brought Good Luck : బుధుడు ఏ రాశి వారిపై ఎటువంటి ప్రభావం చూపనున్నాడు.. ఎవరికీ ఏ ఫలితాలు ఇవ్వనున్నాడో తెలుసుకుందాం

మతపరంగా, బుధుడు గ్రహాల యువరాజు అంటారు. బుధుడు సంపద, వైభవం, గౌరవం, గౌరవం మరియు ప్రతిష్టకు ఒక అంశం. ఏ విధంగా ఏ రాశిచక్రాలకు బుధుడు మంచి అదృష్టం తెచ్చాడు. వారి ఫలితాలు ఏమిటి అనేది చూద్దాం...

Mercury Brought Good Luck :  బుధుడు ఏ రాశి వారిపై ఎటువంటి ప్రభావం చూపనున్నాడు.. ఎవరికీ ఏ ఫలితాలు ఇవ్వనున్నాడో తెలుసుకుందాం
Follow us

|

Updated on: Jan 08, 2021 | 6:25 PM

Mercury Brought Good Luck : జనవరి 5 ఉదయం 03:42 గంటలకు, బుధ గ్రహం ధనుస్సు నుంచి మకరంలోకి ప్రవేశించింది. ఈ రాశిచక్రంలో 25 జనవరి 2021 వరకు  బుధుడు ఉంటాడు. తరువాత అది కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది. మతపరంగా, బుధుడు గ్రహాల యువరాజు అంటారు. బుధుడు సంపద, వైభవం, గౌరవం, గౌరవం మరియు ప్రతిష్టకు ఒక అంశం. ఈ విధంగా, దీని ప్రభావంతో ఏ విధంగా ఏ రాశిచక్రాలకు అదృష్టం తెచ్చాడో తెలుసుకుందాం..!

మేషం: ఈ రాశివారు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. గౌరబవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో తోబుట్టువులతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటారు. ఎటువంగి పరిస్థితులు ఏర్పడినా అనుకూలంగా మార్చుకుని వాటిని అధిగమిస్తారు. అయితే ఈ రాశివారు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

వృషభం: వీరికి అదృష్టం కలిసివస్తుంది. ఆశించిన ఫలితాలను పొందుతారు. పెళ్లికాని వారికి అనుకూల సంబంధాలు వస్తాయి. కుటుంబ పెద్దకు పిల్లలతో సంబంధాలు మెరుగుపడతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి అనుకూలం. అయితే ఈ రాశివారిని ఎంత చదివినా మరచిపోయే సమస్య కలవరపెడుతుంది.

జెమిని: ఈ రాశివారు సమాజంలో మంచి స్థానానికి చేరుకుంటారు. అయితే అధిక ఖర్చులను మానుకోవాల్సి ఉంది. ఆర్ధిక సమస్యలు ఏర్పడతాయి. దీంతో డబ్బుని ఖర్చు పెట్టె విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వీరు ప్రభుత్వం నుంచి సన్మానం లేదా.. ఇతర సంస్థల నుంచి రివార్డులను అందుకునే అవకాశం ఉంది. అయితే శారీరక రుగ్మతలకు గురవుతారు. ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి

కర్కాటక : ఈ రాశి వారికీ వివాహానికి అనుకుల సమయం. సంతానంలేని వారికి పిల్లలు పుట్టే అవకాశం ఉంది. ఆర్థికంగా లాభపడతారు. దూరప్రయాణాలను చేస్తారు.

సింహ రాశి: ఈ రాశి వారు ఆఫీస్ లో సహోద్యుగులతో స్నేహ సంబంధాలు మెరుగవుతాయి. అయితే పని విషయం లో మరింత కష్టపడాల్సి ఉంది. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారు బంధువులు లేదా దగ్గరి బంధువుల నుంచి చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖంగా ఏదైనా పూర్వీకుల ఆస్తికి సంబంధించినవి, కోర్టు కేసులు, చట్టపరమైన వివాదాల్లో చిక్కునే ఆవేశం ఉంది. అధిక వ్యయంతో పాటు ఒత్తిడికి కూడా గురవుతారు.

కన్య రాశి: ప్రేమ వివాహాలకు అనుకూలం. పోటీ పరీక్షలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో విభేదాలతో పాటు పిల్లతో అపార్ధాలు చోటు చేసుకోవచ్చు. ఈ రాశి వారు నిర్ణయం ఆచితూచి తీసుకోవాలి. లేక అనవసరమైన ఇబ్బందుల్లో పడతారు. తుల రాశిచక్రం: ఈ రాశివారికి ఆనందం రెట్టింపవుతుంది. జీవితంలో సానుకూలత వస్తుంది. ఏరంగంలో ఉన్నవారు ఆ రంగంలో విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఇంటి వాహన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. భూమి కొనుగోలు లేదా ఇతర స్థిరాస్తులపై పెట్టుబడులకు అనుకూలం ఈ రాశివారికి

వృశ్చికం: ఈ రాశివారికి అత్యంత సమయం అని చెప్పవచ్చు. ఈ సమయంలో వీరు తీసుకునే ఏ నిర్ణయమైనా విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాలు మరింత పెరుగుతాయి. అయితే ఆరోగ్య పరంగా చిక్కులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా స్టమక్ ఇన్ఫెక్షన్, ముక్కు, చెవులు, గొంతుకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు: వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. భాగస్వామ్యులు నుంచి మంచి సహకారం లభిస్తుంది. భూమి, ఆస్తి, ప్రభుత్వ బాండ్లు , ఏదైనా పాలసీలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే అనుకూల సమయం. అయితే వీరు నోటి సంభందిత వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది.

మకర రాశి: ఈ రాశి వారికీ ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. పిల్లల విషయంలో శుభవార్త వినే అవకాశం ఉంది. న్యాయపరమైన వివాదంలో చిక్కుకోవచ్చు. అయితే వీరికి ఆర్ధికంగా అనుకోని అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. విదార్థులకు అన్ని విధాలా అనుకూలం ఈ సమయం. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం.

కుంభం: ఈ రాశివారిపై బుధుడి ప్రభావం అధికంగా ఉంది. దీంతో అధికంగా ఖర్చు చేస్తారు. బుధుడు .. శనితో బాధపడుతుంటాడు, కనుక ఈ రాశి వారు తమ లక్ష్య సాధన కోసం మరింత కష్టపడాల్సి ఉంది. ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలంటే మరింత కష్టపడాలి. ఖర్చులను తగ్గించుకోవాలి. వీరికి నాడీ వ్యవస్థ, పాదాలకు సంబంధించిన సమస్యలు కలవరపెడతాయి.

మీనంరాశి: బుధుడు ప్రభావంతో అత్యధిక ప్రయాణాలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. సహోద్యోగులతో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు అనుకూలం. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు మంచి లాభాలను పొందుతారు.

Also Read:

 11 రుద్రులు కొలువైన ప్రాంతం జగ్గన్న తోట.. 400 ఏళ్ల చరిత్ర గల ప్రభల తీర్ధం విశిష్టత ఏమిటంటే..?