Covid 19 Vaccination: దేశ వ్యాప్తంగా 5 వేల కేంద్రాల్లో కోవిడ్ టీకా పంపిణీ.. ఏపీలో 332 సెంటర్స్ ఏర్పాటు

దేశ వ్యాపంగా కరోనా వైరస్ నివారణ టీకాలను పంపిణీ చేయడానికి కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభించనున్నారు.

Covid 19 Vaccination: దేశ వ్యాప్తంగా 5 వేల కేంద్రాల్లో కోవిడ్ టీకా పంపిణీ.. ఏపీలో 332 సెంటర్స్ ఏర్పాటు
Follow us

| Edited By: Rajesh Sharma

Updated on: Jan 09, 2021 | 2:44 PM

Covid 19 Vaccination: దేశ వ్యాపంగా కరోనా వైరస్ నివారణ టీకాలను పంపిణీ చేయడానికి కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. వ్యాక్సిన్ పంపిణీకి దేశ వ్యాప్తంగా 5 వేల కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా.. ఏపీలో 332 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు టీకాల పంపిణీకి సిద్ధంగా ఉండాలని కేంద్ర ఆదేశాలను జారీ చేసినట్లు సమాచారం. తొలి విడత కింద ఇచ్చే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నట్లు సంబంధిత అధికారులు చెప్పారు. ఇక ప్రధాని మోడీ టీకాలను ప్రారంభించిన రోజే.. ఏపీలో కూడా సీఎం జగన్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రంలో పాల్గొంటారని తెలుస్తోంది.

అయితే ఈనెల 17 నుంచి 19 వరకూ దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమ జరగనుంది. ఈ నేపథ్యంలో టీకాల పంపిణి పై స్పష్టత రావాల్సి ఉంది. ఇక కోవిడ్ 19 వ్యాక్సిన్ పంపిణీ పై రాష్ట్ర ముఖ్య మంత్రులతో ప్రధాని మోడీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నారు. సంక్రాతి పండుగ తర్వాతే టీకాల పంపిణీ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచార.. అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి టీకా పంపిణీ ప్రారంభమవుతుందా? లేక ఎంపిక చేసిన రాష్ట్రాల్లోనే జరుగుతుందా?  అన్నదానిపైనా స్పష్టత రావాల్సి ఉందని అధికారులు అంటున్నారు. ఈ వ్యాక్సిన్ ను ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన వైద్య సిబ్బంది , పోలీసులు పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వనున్నట్లు ఇప్పటికే కేంద్ర వైద్య శాఖ మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read:

Latest Articles