Covid Vaccine: కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.

కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ తయారీ కంపెనీ ఆస్ట్రాజెనెకా బిగ్ షాకిచ్చింది. ఈ టీకా తీసుకున్న వారికి అరుదైన సందర్భాల్లో సైడ్ ఎఫెక్ట్స్ నిజమేనంటూ కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో పేర్కొన్నట్టు యూకేకు చెందిన డైలీ టెలిగ్రాఫ్ వార్తా పత్రిక పేర్కొంది. టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్లు పడిపోవడం వంటి దుష్ప్రభావాలు తలెత్తాయని అంగీకరించింది. కరోనా తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి...

Covid Vaccine: కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.

|

Updated on: May 02, 2024 | 12:17 PM

కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ తయారీ కంపెనీ ఆస్ట్రాజెనెకా బిగ్ షాకిచ్చింది. ఈ టీకా తీసుకున్న వారికి అరుదైన సందర్భాల్లో సైడ్ ఎఫెక్ట్స్ నిజమేనంటూ కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో పేర్కొన్నట్టు యూకేకు చెందిన డైలీ టెలిగ్రాఫ్ వార్తా పత్రిక పేర్కొంది. టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్లు పడిపోవడం వంటి దుష్ప్రభావాలు తలెత్తాయని అంగీకరించింది. కరోనా తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి బ్రిటిష్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఇదే వ్యాక్సిన్‌ను మన దేశంలో సీరం ఇనిస్టిట్యూట్ తయారుచేసింది. దేశంలో అత్యధికంగా తీసుకున్న టీకా ఇదే.

ఈ టీకా ఒకరి మృతికి కారణం కావడంతోపాటు మరో 51 మంది తీవ్రంగా ఇబ్బంది పడినట్టు కేసు నమోదైంది. జరిగిన నష్టానికి 100 మిలియన్ పౌండ్లు దాదాపు రూ. 1000 కోట్లు పరిహారం కోరుతూ యూకే హైకోర్టులో దావా నమోదైంది. ఏప్రిల్ 2021లో ఈ టీకా తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టడంతో తన మెదడు శాశ్వతంగా దెబ్బతిందని జామీ స్కాట్ అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. ఈ కారణంగా తాను ఉద్యోగం చేయలేకపోయానని, తాను చనిపోబోతున్నట్టు వైద్యులు తన భార్యతో చెప్పారని పేర్కొన్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
Latest Articles