15 May 2024
TV9 Telugu
Pic credit - Pexels
ఇటీవల అమెరికా అధ్యక్షుడి కార్యాలయం వైట్‌హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అతిథులకు గోల్‌గప్పలను అందజేశారు.
గోల్గప్ప ఇప్పటికే భారతదేశంలో ప్రసిద్ధ వీధి ఆహారం. ఇప్పుడు అమెరికాలో కూడా దీనికి విపరీతమైన ఆదరణ లభిస్తోంది.
అమెరికా, భారత్‌లో గోల్గప్ప ధరల్లో చాలా వ్యత్యాసం ఉంది. భారతదేశంలో ఒక ప్లేట్ 20 రూపాయలకు లభిస్తుంది. పది నుంచి 12 పానీపూరీలను అందిస్తారు.
ఈ నేపధ్యంలో అమెరికాలో గోల్గప్ప రేటు ఎంత ఉంటుందా అని అనుకుంటుంటే.. అమెరికాలో ఉంటున్న ఓ భారతీయ మహిళ పానీపూరీ ధర చెప్పింది.
అమెరికాలో గోల్గప్పా అంటే పానీ పూరీలు తినడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం ఏమిటంటే షాప్ నుంచి 5 డాలర్లు అంటే 400 రూపాయల పెట్టి ప్యాకెట్ కొనడం.
గోల్గప్పా, దీనికి ఉపయోగించే మసాలా వంటివి ఈ ప్యాకెట్లలో లభిస్తాయి. ఒక ప్యాకెట్ కొంటె ఇంట్లోనే 50 గొల్లగప్పలను తయారు చేసుకోవచ్చు.
అమెరికన్ మార్కెట్‌లో గోల్గప్పలు చాలా ఖరీదైనవి. హోటల్‌లో ఒక ప్లేట్ (6 నుంచి 7 గోల్గప్పలు) కొంటే రూ. 800 కంటే ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది.