పుతిన్ క్రెమ్లిన్ గురించి మీకు ఎంత తెలుసు?

TV9 Telugu

08 May 2024

పుతిన్ ఐదవసారి రష్యా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అతను తన అధికారిక నివాసమైన క్రెమ్లిన్‌లో నివసిస్తుంటాడు. ఇటీవల ఈ భవనంపై డ్రోన్లతో దాడి జరిగింది.

పుతిన్ నివాసం ఉండే క్రెమ్లిన్ అంటే నగరం లోపల ఒక కోట. మొత్తం రష్యా దేశంలో 20 కంటే ఎక్కువ క్రెమ్లిన్లు ఉన్నాయి.

రష్యా రాజకీయాలకు కేంద్రమైన మాస్కోలో పుతిన్ అధికారిక నివాసం ఉన్నప్పటికీ, అది మోస్క్వా నదికి ఉత్తర ఒడ్డున ఉంది.

క్రెమ్లిన్ ఒక నివేదిక ప్రకారం న్యూ ఢిల్లీ కన్నాట్ ప్లేస్ అంత పరిమాణం కలిగి ఉంటుంది. ఇందులో ఐదు రాజభవనాలు, నాలుగు కేథడ్రల్స్ ఉన్నాయి.

న్యూఢిల్లీలో ప్రధాన ఆర్థిక, వాణిజ్య, వ్యాపార కేంద్రాలకు నిలయమైన ప్రాంతమే కన్నాట్ ఫ్లేస్. ఈ ప్రాంతంలో అనేక భారతీయ సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి.

మాస్కో గ్రాండ్ ప్రిన్స్ 1359 నుండి 1389 వరకు ఇక్కడ నివసించారు. దీని తరువాత మాత్రమే క్రెమ్లిన్ అభివృద్ధి చెందింది.

దాని వైభవం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కొన్నిరోజులకు ఇది రష్యా రాజకీయనాయకుల అధికార కేంద్రంగా మారింది.

వైట్ హౌస్ అనేది US అధ్యక్షుని అధికారిక నివాసం, బకింగ్‌హామ్ ప్యాలెస్ బ్రిటీష్ రాజ కుటుంబానికి అధికారిక నివాసం. క్రెమ్లిన్‌ను రష్యన్లు తమ దేశ ఉన్నత భవనంగా భావిస్తారు.