Redmi Note 13 Pro Max: చవకైన ధరలో 5జీ ఫోన్.. ఐఫోన్ లుక్.. టాప్ క్లాస్ ఫీచర్లు..

ప్రముఖ చైనా బ్రాండ్ ముందంజలో ఉంది. దీని నుంచి వచ్చే ఫోన్లు ఎక్కువగా తక్కువ ధరలోనే లభ్యమవుతుంటాయి. ఇప్పుడు మరో ఫోన్ రెడ్ మీ నోట్ 13 ప్రో మ్యాక్స్ ని లాంచ్ చేసింది. ఇది 5జీ వేరియంట్. ఇది రెడ్ నుంచి వచ్చిన చీపెస్ట్ 5జీ ఫోన్ కావడం విశేషం. ఈ ఫోన్ తక్కువ ధరలో వచ్చినా ఫీచర్లు మాత్రం చాలా హెవీగా ఉన్నాయి. దీని లుక్ యాపిల్ ఐఫోన్ కు దగ్గరలో ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..

Redmi Note 13 Pro Max: చవకైన ధరలో 5జీ ఫోన్.. ఐఫోన్ లుక్.. టాప్ క్లాస్ ఫీచర్లు..
Redmi Note 13 Pro Max
Follow us

|

Updated on: May 02, 2024 | 2:26 PM

హై బడ్జెట్ ఫోన్ల కన్నా లో బడ్జెట్ ఫోన్లకు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ప్రీమియం ఫోన్లతో పోల్చితే మధ్య తరహా నుంచి తక్కువ ధర ఉన్న ఫోన్ల సేల్స్ అధికంగా ఉంటాయి. ఇటీవల కాలంలో కంపెనీలు దీనిపై దృష్టి పెట్టి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ విషయంలో ప్రముఖ చైనా బ్రాండ్ ముందంజలో ఉంది. దీని నుంచి వచ్చే ఫోన్లు ఎక్కువగా తక్కువ ధరలోనే లభ్యమవుతుంటాయి. ఇప్పుడు మరో ఫోన్ రెడ్ మీ నోట్ 13 ప్రో మ్యాక్స్ ని లాంచ్ చేసింది. ఇది 5జీ వేరియంట్. ఇది రెడ్ నుంచి వచ్చిన చీపెస్ట్ 5జీ ఫోన్ కావడం విశేషం. ఈ ఫోన్ తక్కువ ధరలో వచ్చినా ఫీచర్లు మాత్రం చాలా హెవీగా ఉన్నాయి. దీని లుక్ యాపిల్ ఐఫోన్ కు దగ్గరలో ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..

రెడ్ మీ నోట్ 13 ప్రో మ్యాక్స్..

రెడ్ మీ నోట్ 13 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లో 6.67 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ ప్లే 1080 X 2430 రిజల్యూషన్తో గొరిల్లా గ్లాస్ ప్రోటెక్షన్ తో వస్తుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 720జీ ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ వీ12 ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది. 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

రెడ్ మీ నోట్ 13 ప్రో మ్యాక్స్ కెమెరా క్వాలిటీ.. రెడ్ మీ నోట్ 13 ప్రో మ్యాక్స్ ఫోన్లో వెనుక వైపు నాలుగు కెమెరాల సెట్ అప్ ఉంటుంది. 108ఎంపీ, 8ఎంపీ, 5ఎంపీ, 5ఎంపీ ఉంటుంది. ముందు వైపు 32ఎంపీ సెల్ఫీ కెమెరా వీడియో కాలింగ్ కోసం ఉంటుంది.

రెడ్ మీ నోట్ 13 ప్రో మ్యాక్స్ బ్యాటరీ బ్యాక్ అప్.. ఈ ఫోన్లో లై పోలిమర్ టైప్ బ్యాటరీ 5200ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉంటుంది. అంతేకాక 67వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది.

రెడ్ మీ నోట్ 13 ప్రో మ్యాక్స్ ధర.. ఈఫోన్ ధర మన దేశీయ మార్కెట్లో రూ. 14,999 నుంచి ప్రారంభమవుతుంది. అది కూడా 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వేరియంట్.

రెడ్ మీ నోట్ 13 ప్రో మ్యాక్స్ భద్రత.. ఈ ఫోన్లో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ పొజిషన్ ఉంటుంద. లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సెలో మీటర్, గైరోస్కోప్ వంటి సెన్సార్లు ఉంటాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..