Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి మెట్లు ఏ దిశలో ఉండాలి..! లేదంటే చాలా అనర్థాలు..?
Vastu Tips: మనదేశంలో వాస్తు శాస్త్రాన్ని బాగా నమ్ముతారు. దిశను బట్టే దశ ఉందని భావిస్తారు. అందుకే ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు వాస్తు శాస్త్ర సలహాలను తీసుకుంటారు.
Vastu Tips: మనదేశంలో వాస్తు శాస్త్రాన్ని బాగా నమ్ముతారు. దిశను బట్టే దశ ఉందని భావిస్తారు. అందుకే ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు వాస్తు శాస్త్ర సలహాలను తీసుకుంటారు. అలాగే ఒక వ్యక్తి జీవితంలో బాగుండాలంటే కొన్ని నియమాలు అవసరం. ఇంటి నిర్మాణం చేసేటప్పుడు వాస్తు దోషాలు అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ ధీర్ఘకాలికంగా ఇంటిలోని కుటుంబ సభ్యులపై పడుతుంది. ఇంటికి సంబంధించి మెట్ల విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే చాలా రకాల సమస్యలను ఎదుర్కొవలసి వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మెట్లు ఎటువైపు నిర్మించాలో తెలుసుకుందాం.
1. వాస్తు ప్రకారం ఇంట్లో మెట్లు నైరుతి దిశలో ఉండాలి. ఉత్తరం నుంచి ప్రారంభమై దక్షిణ దిశలో ముగించాలి. పడమర, నైరుతి, మధ్య దక్షిణం, పడమర దిశ కూడా మెట్ల నిర్మాణానికి అనుకూలంగా ఉంటుంది. 2. వాస్తు ప్రకారం ఈశాన్యంలో మెట్లు నిర్మించరాదు. ఇది ప్రధాన వాస్తులోపం. ఈ దిశలో మెట్ల వల్ల ఇంటి అధిపతికి మంచి జరగదు. 3. వాస్తు ప్రకారం మెట్ల కింద ఎటువంటి నిర్మాణం చేయకూడదు. మెట్ల కింద చెత్త, వంటగది, అధ్యయన గది, పూజ గది మొదలైనవి ఉన్నప్పుడు ఆ ఇంటి అధిపతి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. 4. వాస్తు ప్రకారం ఇంట్లో మెట్లు నిర్మించడం ప్రారంభించి వెంటనే పూర్తి చేయాలి. అసంపూర్తిగా ఎప్పుడు ఉంచకూడదు. సగం పూర్తయిన మెట్లు ఇంటికి మంచిది కాదు. 5. వాస్తు ప్రకారం ఇంటి మెట్లు మురికిగా ఉండకూడదు. క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. మెరిసే మెట్లు ఉన్న ఇంట్లో లక్ష్మిదేవి తాండవిస్తోంది. మెట్లపై ఎల్లప్పుడూ తగినంత లైటింగ్ ఉండాలి.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం మత విశ్వాసాలు, జానపద నమ్మకాలపై ఆధారపడి మాత్రమే ఉంటుంది. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని రాయడం జరిగింది.