ఆదాయపు పన్ను కడుతున్న దేవుడు.. ఆయన సంపద ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

అది 1000 యేళ్ళ చరిత్ర కలిగిన పురాతన దేవాలయం. స్వామి వారి 365 ఎకరాల భూముల పంట నుంచి 365 రోజులు నిత్య నైవేద్యం. తిరుమల తిరుపతి నుంచి భక్తుని కోసం 1000 ఏళ్ల క్రితం స్వయంభుగా వెలసిన ఆలయం.

ఆదాయపు పన్ను కడుతున్న దేవుడు.. ఆయన సంపద ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Kandukur Meesala Venkateswara Swamy
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Sep 14, 2024 | 6:41 PM

అది 1000 యేళ్ళ చరిత్ర కలిగిన పురాతన దేవాలయం. స్వామి వారి 365 ఎకరాల భూముల పంట నుంచి 365 రోజులు నిత్య నైవేద్యం. తిరుమల తిరుపతి నుంచి భక్తుని కోసం 1000 ఏళ్ల క్రితం స్వయంభుగా వెలసిన ఆలయం. ఆలయ ఆస్తులకు.. యేటా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నాడు ఆ భగవంతుడు. భూస్వాములు.. సంపన్నులు ప్రతి యేటా ప్రభుత్వానికి ఆదాయపు పన్ను చెల్లిస్తారు. ఇది మనందరికీ తెలిసిందే.. కానీ భగవంతుడు ప్రతి యేటా ప్రభుత్వానికి ఆదాయపు పన్ను చెల్లిస్తారంటే కాస్తా విచిత్రంగా ఉన్నప్పటికీ నమ్మక తప్పదు మరీ. ఎక్కడో ఏంటో తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే..!

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజక వర్గంలోని వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో 1000 క్రితం స్వయంభుగా వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం గురించి ముందుగా తెలుసుకోవాలి. సుమారు 13 వ శతాబ్దంలో కందుకూరు గ్రామానికి చెందిన ఒక భక్తుడు ప్రతి యేటా తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే వాడు. కొంత కాలం తరువాత కందుకూరు నుంచి తిరుమల తిరుపతి వెళ్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే శక్తి లేక ఆ భక్తుడు బాధపడుతూ స్వామి వారి నామం స్మరించుకున్నాడట. అప్పుడు సాక్షాత్తు తిరుమల తిరుపతి నుంచి వేంకటేశ్వర స్వామి ఆ భక్తుని కలలో కనిపించి స్వయంగా వెలిసాను అని చెప్పాడట. తెల్లవారే ఉదయాన్నే ఆ భక్తుడు కలలో కనిపించిన అదే ప్రదేశానికి వెళ్లి తవ్వగా వేంకటేశ్వర స్వామి రాతి విగ్రహం స్వయంభుగా వెలిసి దర్శనం ఇచ్చారు.

ఆనాటి నుంచి ఆ భక్తుని చేతుల మీదుగా పూజలు అందుకోవడం కోసం స్వయంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కందుకూరు గ్రామంలో వెలిశారు. తరతరాలుగా స్వామి వారికి నిత్య నైవేద్యం పెట్టేందుకు వందల ఏళ్ల నాటి నుంచి స్వామి వారికి కందుకూరు గ్రామంలో 365 ఎకరాలు మూడేసి పంటలు పండే భూములను స్వామి వారి ఆస్తిగా రాసి ఇచ్చారు. ఆ స్వామికి చెందిన భూముల నుంచి రోజుకు ఒక ఎకరం భూమి పంట నుంచి 365 రోజులు నైవేద్యం పెడుతున్నారు.

తిరుమల తిరుపతి లో వెలసిన వేంకటేశ్వర స్వామి కుబేరుని వద్ద అప్పు చేసి పద్మావతి అమ్మ వారిని పెళ్లి చేసుకున్నారు. అలాంటి స్వామి కందుకూరు గ్రామంలో వందలాది ఎకరాల భూములు, ఆస్తులు కూడబెట్టుకుని ఏకంగా ప్రభుత్వానికి ప్రతి ఏటా ఆదాయపు పన్ను కడుతున్నారు. ఆ గ్రామంలోని బ్యాంకులోని లాకర్లు కూడా మొదటి లాకరు ఆ స్వామి వారికే కేటాయించారు. వందల ఏళ్ల నాటి నుంచి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం మార్చి నెలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఘనంగా కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అంతేకాదు స్వయంభువు గా వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మీసాలు ఉండటం ఒక ప్రత్యేకం. అందుకే మీసాల వేంకటేశ్వర స్వామి అని కూడా పిలుస్తుంటారు.

మరిన్ని అధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..