- Telugu News Photo Gallery Do you know what it means to see Ganesha in a dream? Check Here is Details in Telugu
Lord Ganesha in Dream: కలలో వినాయకుడు కనిపిస్తే అర్థం ఏంటో తెలుసా..
దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా వినాయకుని సంబరాలే జరుగుతున్నాయి. వినాయకుని ఉత్సవాలు ఎంతో కోలాహలంగా చేస్తూ ఉంటారు. తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ గణేషుడికి పూజలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వినాయకుడు రూపం కొంత మందికి కనిపిస్తూ ఉంటుంది. అలా విఘ్నేశ్వరుడు కనిపించడం వల్ల అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వినాయక నవరాత్రుల్లో ఎవరికైనా వినాయకుడు కలలో కనిపించడం చాలా శుభంగా..
Updated on: Sep 14, 2024 | 5:08 PM

దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా వినాయకుని సంబరాలే జరుగుతున్నాయి. వినాయకుని ఉత్సవాలు ఎంతో కోలాహలంగా చేస్తూ ఉంటారు. తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ గణేషుడికి పూజలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వినాయకుడు రూపం కొంత మందికి కనిపిస్తూ ఉంటుంది. అలా విఘ్నేశ్వరుడు కనిపించడం వల్ల అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వినాయక నవరాత్రుల్లో ఎవరికైనా వినాయకుడు కలలో కనిపించడం చాలా శుభంగా భావిస్తారు. ఆ స్వామి వారు కలలో కనిపించడం వల్ల వినాయకుడి అనుగ్రహంగా పరిగణిస్తారు. ఆ దేవుడి రక్షణ కూడా లభిస్తుందని నమ్ముతారు.

మీరు కోరుకున్న కోరికలన్నీ నిజమౌతాయని విశ్వసిస్తారు. మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించడం కోసమే.. ఆ వినాయకుడు మీ కలలో కనిపిస్తాడని అర్థమట. దీని వల్ల విజయం, శ్రేయస్సు లభిస్తాయట.

గణేశుడు మీ కలలో కనిపించడం వలన మీ కోరికలు నెరవేరతాయని సంకేతంగా కూడా భావించవచ్చు. విజయానికి దేవుడు, అడ్డంకులను తొలగించేవాడు. కలలో వినాయకుడి దర్శనం వలన మీరు మీ లక్ష్యాలను అందుకుంటారు.

కలలో ఆ గణనాథుడు కనిపించడం వలన మీరు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్నా త్వరలోనే అవన్నీ తొలగిపోతాయి. మీరు అనుకున్న పనులు అన్నీ ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయని అర్థం. ఇలా వినాయకుడు మీ కలలో కనిపించడం వలన అంతా శుభమే జరుగుతుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




