AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kailash Mansarovar Yatra: కైలాస మానస సరోవర యాత్రకు వెళ్ళాలనుకుంటున్నారా.. ఈ నియమాలను పాటించడం మరచిపోకండి…

హిందూ మత విశ్వాసాల ప్రకారం జీవితంలో ఒకసారైనా కైలాస మానసరోవర యాత్రలో భాగమైన వారు మోక్షాన్ని పొందుతారు. అదే సమయంలో ఈ తీర్థయాత్రకు సంబంధించి కొన్ని ప్రత్యేక నియమాలు రూపొందించబడ్డాయి. వీటిని పాటించడం అవసరం. ఆ నియమాలు ఏమిటో తెలుసుకుందాం. యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందంటే

Kailash Mansarovar Yatra: కైలాస మానస సరోవర యాత్రకు వెళ్ళాలనుకుంటున్నారా.. ఈ నియమాలను పాటించడం మరచిపోకండి...
Kailash Mansarovar Yatra
Surya Kala
|

Updated on: Jun 24, 2025 | 3:27 PM

Share

కైలాస పర్వతాన్ని శివుని నివాసంగా భావిస్తారు. ఈ పర్వతం హిందువులకు మాత్రమే కాదు బౌద్ధమతం, జైనమతం , సిక్కు మతం అనుచరులకు కూడా చాలా పవిత్రమైనది. హిందూ మతంలో కైలాస మానసరోవర యాత్ర చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కైలాస మానసరోవర యాత్ర చాలా కష్టమైన ,పవిత్రమైన తీర్థయాత్రగా పరిగణించబడుతుంది, దీనిలో పాల్గొనడంవలన తెలిసి తెలియక చేసిన సకల పాపాలను నాశనం చేస్తుంది. కైలాస మానసరోవర యాత్ర చేయడం ద్వారా అన్ని కోరికలు కూడా నెరవేరుతాయని చెబుతారు. అలాగే ఈ ప్రయాణంలో ఒకసారి భాగమైన వారు కూడా మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు. అదే సమయంలో ఈ తీర్థయాత్రకు సంబంధించి కొన్ని ప్రత్యేక నియమాలు రూపొందించబడ్డాయి. వీటిని పాటించడం అవసరం.

కైలాస మానస సరోవర యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది?

కరోనా సమయంలో క్లోజ్ అయిన ఈ కైలాస మానససరోవర యాత్ర.. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత.. మళ్ళీ ఈ కైలాస మానసరోవర యాత్ర జూన్ 30, 2025 నుంచి ప్రారంభం కానుంది. కైలాస మానసరోవర యాత్ర ఆగస్టు 2025 వరకు కొనసాగుతుంది. ఈ యాత్రలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఈ నేపధ్యంలో భక్తులు పాటించాల్సిన నియమాలు గురించి తెలుసుకుందాం..

మానస సరోవరం యాత్ర నియమాలు

  1. ప్రయాణంలో శుభ్రత, స్వచ్ఛతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
  2. కైలాస యాత్ర సమయంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి.
  3. ఇవి కూడా చదవండి
  4. ఈ ప్రయాణంలో వాదనలు లేదా కోపం తెచ్చుకోకుండా ఉండాలి.
  5. ప్రయాణంలో భగవంతుడిని ధ్యానం చేస్తూ, శివుని స్తుతులు జపిస్తూ ఉండాలి.
  6. ప్రయాణంలో ఎవరూ ఇబ్బంది పడకూడదు.
  7. ఈ ప్రయాణంలో తామరకి సంబంధించిన పదార్థాలు తినకూడదు.
  8. ఈ ప్రయాణం చాలా కష్టం కనుక శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే ఈ యాత్రను చేయడం గురించి ఆలోచించాలి. యాత్రలో పాల్గొనాలి.
  9. ఈ యాత్రలో 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు మాత్రమే పాల్గొనగలరు.
  10. ప్రయాణంలో సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
  11. ప్రయాణంలో ఎలాంటి చెడు ఆలోచనలను మనసులోకి తెచ్చుకోకూడదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.