AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakaya Niti: రోజువారీ జీవితంలో చాణక్యుడి ఈ సూత్రాలను పాటిస్తే.. జేబులో డబ్బులకు కొరత ఉండదు..

చాణక్యుడు భారతదేశంలోని గొప్ప పండితులలో ఒకరు. చాణక్యుడు అపరామేధావి. ఆయనకి తెలియని విషయం లేదు. ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం, రాజకీయాలు, దౌత్యం, సైనిక శాస్త్రం వంటి అనేక అంశాలపై అతనికి అపారమైన జ్ఞానం ఉంది. ప్రతి విషయంపై చాణక్యుడి దృక్పథం చాలా విస్తృతమైనది. అందుకే మానవ జీవితాన్ని ప్రభావితం చేసే చిన్న , పెద్ద సమస్యలపై ఆయన చెప్పిన విషయాలు చాలా సూక్ష్మంగా ఉన్నా.. జీవితానికి వేలుగునిస్తాయి. చాణక్యుడి నీతి ఒక వ్యక్తి విజయం సాధించడానికి ప్రేరేపిస్తుంది.

Chanakaya Niti: రోజువారీ జీవితంలో చాణక్యుడి ఈ సూత్రాలను పాటిస్తే.. జేబులో డబ్బులకు కొరత ఉండదు..
Acharya Chanakya
Surya Kala
|

Updated on: Jun 24, 2025 | 2:30 PM

Share

చాణక్యుడు మనిషి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను తెలియజేస్తూ చాణక్య నీతి అనే పుస్తకం వ్రాయబడింది. ఈ పుస్తకంలో సంతోషకరమైన జీవితానికి సంబంధించిన అనేక రహస్యాలు ప్రస్తావించబడ్డాయి. అలాగే మానవుడిగా జన్మించిన వ్యక్తి తన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి అనుసరించాల్సిన ధర్మం, కర్మ, పాపం, పుణ్యం గురించి చాణక్యుడి పుస్తకంలో ప్రస్తావించబడింది. మనుషులుగా జన్మించిన ప్రతి ఒక్కరూ తమ జీవితంలో విజయం సాధించాలని అనుకుంటారు. దానికి చాణక్యుడు మార్గం సుగమం చేశాడు. ఆ మార్గాన్ని అనుసరిస్తే మనకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది.

చాణక్యుడి అంతర్దృష్టులు జీవితంలోనే కాదు ఆర్థిక విషయాలలో కూడా గొప్ప విజయాన్ని సాధించడంలో సహాయపడతాయి. చాణక్యుడి పద్ధతులు డబ్బు, క్రమశిక్షణ, ఆచరణాత్మక వ్యూహాలతో సహా అనేక రంగాలలో ఉపయోగించబడతాయి. నేటి యువతకు డబ్బుకి కొదవు లేకుండా ఉండాలంటే.. చాణక్యుడి పద్ధతులు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అవసరమైన సమయాల్లో ఉపయోగించడానికి వీలైనప్పుడల్లా డబ్బు ఆదా చేయండి.

ఇవి కూడా చదవండి

పంట పండే కాలంలో పది విత్తనాలు నాటితే.. కష్టకాలంలో పది పంటలు పండుతాయని ఒక సామెత ఉంది. చాణక్యుడు ఈ ఆలోచనను చాలా సంవత్సరాల క్రితమే ఊహించాడు. అంటే ఒక వ్యక్తి ఆదాయం పెరిగినా లేదా అలాగే ఆదాయం స్థిరంగా ఉన్నా సరే.. వీలైనంత వరకూ డబ్బులను దాచడానికి ప్రయత్నించండి. మూడు నుంచి ఆరు నెలల ఆదాయంలో కొంత భాగాన్ని అత్యవసర నిధిగా పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వలన అవసరమైనప్పుడు ఇలా దాచిన మొత్తాన్ని ఉపయోగించవచ్చు. ఆదాయం పెరిగేకొద్దీ అత్యవసర నిధిగా డబ్బుల మొత్తాన్ని పెంచండి.

సరైన ఆర్థిక ప్రణాళిక సరైన ఆర్థిక ప్రణాళిక లేని వ్యక్తి జీవితం నావికుడు లేని పడవ ప్రయాణం వంటిదని చాణక్యుడు చెప్పాడు. అంటే మీరు మీ పదవీ విరమణ, ఇంటి పొదుపు, పిల్లల విద్య, వివాహం మొదలైన వివిధ దీర్ఘకాలిక అవసరాల కోసం ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. దీని కోసం మ్యూచువల్ ఫండ్ SIP, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ మొదలైన వివిధ రకాల పెట్టుబడి పథకాలను ఉపయోగించవచ్చు.

ఖచ్చితమైన జ్ఞానం ఆర్థిక భద్రత గురించి మంచి జ్ఞానం ఉండాలి. మీరు ఏ రకమైన పెట్టుబడి పథకంలో చేరినా.. వాటి గురించి మీకు మంచి జ్ఞానం ఉండాలి. ఆర్థిక నిపుణుల సలహా మేరకు మాత్రమే పెట్టుబడి పథకాలలో చేరడానికి ప్రయత్నించండి.

డబ్బును ఆకర్షించే మార్గాలు చాణక్యుడి ప్రకారం, మీ జీవితంలోకి ఎక్కువ డబ్బు రావాలని మీరు కోరుకుంటే.. డబ్బు సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ సంపాదన గురించి గొప్పలు చెప్పుకోకూడదు. సంపాదించేటప్పుడు ఓపికను పెంపొందించుకునే వారు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు.

మీరు సంపాదించే డబ్బును మీ స్వంత ప్రయోజనం కోసం మాత్రమే కాకుండా ఇతరుల ప్రయోజనం కోసం కూడా ఖర్చు చేసే అలవాటు మీకు ఉంటే మీపై లక్ష్మీదేవి ఆశీర్వాదాలు ఉంటాయి. మీరు ఇతరుల కోసం ఖర్చు చేసే డబ్బు ఏదో ఒక విధంగా మీకు తిరిగి వస్తుంది. అలాగే అది మీకు చాలా రెట్లుగా తిరిగి వస్తుందని చాణక్యుడు చెప్పాడు.

ప్రతి ఒక్కరూ డబ్బు విలువను తెలుసుకుని దానిని తెలివిగా ఖర్చు చేయడం నేర్చుకోవాలి. సంపాదనలో పదోవంతు ఆదా చేసినప్పుడు.. పొదుపులోని డబ్బు మరింత డబ్బును ఆకర్షిస్తుందని చాణక్యుడు చెప్పాడు. డబ్బు ఆదా చేయడం వల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

అధిక మొత్తంలో డబ్బులు ఆర్జించేవారు తమ సంపాదన గురించి బయటివారికి ఎక్కువగా చెప్పడం పూర్తిగా మానుకోవాలి. అలా చేయడం ద్వారా, డబ్బును దొంగల నుంచి, చెడు దృష్టి నుంచి పూర్తిగా రక్షించుకోవచ్చు. సంపదను పెంచుకోవచ్చు.

డబ్బును ఎప్పుడూ ఇతరులను అవమానించడానికి లేదా వేధించడానికి ఉపయోగించకూడదు. బదులుగా ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించాలి. అప్పుడే డబ్బు మీ వైపు ఆకర్షితులవుతుంది. అలాగే, చాణక్యుడి ప్రకారం మనం మన సంపదను మంచి కోసం ఉపయోగించినంత కాలం డబ్బు పెరుగుతూనే ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.