AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navagraha Shanti: జాతకంలో నవ గ్రహాలను బలోపేతం చేయడానికి ఈ సామాజిక పనులు చేసి చూడండి..

హిందువులు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. అంతేకాదు జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రం వంటి వాటిని కూడా విశ్వసిస్తారు. జీవితంలో జరిగే మంచి చెడులకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలోని నవ గ్రహాలు, రాశులు, నక్షత్రాలు కారణం అని నమ్మకం. అందుకనే జాతకంలో గ్రహ దోషాల నివారణకు తగిన పరిహారాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ రోజు నవ గ్రహాలను కొన్ని చర్యల ద్వారా శాంతింపజేయవచ్చు. ముఖ్యంగా కొన్ని సామాజిక కార్యక్రమాలను చేయడం ద్వారా గ్రహ సంబంధిత దోషాల నుంచి ఉపశమనం పొందవచ్చు. అవి ఏమిటంటే..

Navagraha Shanti: జాతకంలో నవ గ్రహాలను బలోపేతం చేయడానికి ఈ సామాజిక పనులు చేసి చూడండి..
Astrology Transit Guide
Surya Kala
|

Updated on: Jun 24, 2025 | 5:07 PM

Share

సనాతన హిందూ ధర్మంలో జ్యోతిషశాస్త్రం, వాస్తు శాస్త్రం ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. జీవితంలో ఆనందం , శ్రేయస్సును కొనసాగించడానికి వేద జ్యోతిషశాస్త్రం ముఖ్యమైనది. ఆరోగ్యం, సంపద, సంబంధాలు, జ్ఞానం సహా మరెన్నో విషయాలను గురించి అది తెలియజేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహంతో అనుసంధానించబడిన నిర్దిష్ట సేవా చర్యలను చేయడం ద్వారా.. వాటి శక్తులను సమన్వయం చేసుకోవచ్చని, జాతకంలో ఉన్న ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చని నమ్ముతారు. ఈ రోజు నవ గ్రహాలను శాంతింపజేసే పనుల గురించి తెలుసుకుందాం..

  1. సూర్యుడు: నవ గ్రహాలకు అధినేత సూర్యుడు అనుగ్రహం కోసం ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేరుస్తూ.. ప్రజా సంక్షేమానికి తోడ్పడండి. దేశానికి ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలలో సహాయం చేయడం వలన సూర్యుడు సంతోష పడతాడు. సూర్య అనుగ్రహంతో అధికారం, నాయకత్వ లక్షణాలు, విశ్వాసాన్ని బలోపేతం అవుతుంది.
  2. చంద్రుడు: చంద్ర దోషం నుంచి విముక్తి.. చంద్ర అనుగ్రహం కోసం వృద్ధులను చూసుకోవడం లేదా మానసిక ఆరోగ్య కారణాలను ప్రోత్సహించడం వంటి కరుణాపూరిత చర్యలలో పాల్గొనడం చంద్రుడిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. భావోద్వేగ స్థిరత్వం, అంతర్గత శాంతిని పెంచుతుంది.
  3. కుజుడు: రక్షణ, భద్రతలో నిమగ్నమైన వ్యక్తులకు సహాయం చేయడం లేదా వారిని గౌరవించడం వల్ల అంగారక గ్రహ ప్రభావం పెరుగుతుంది. కుజుడి అనుగ్రహంతో జీవితానికి ధైర్యం, బలం, క్రమశిక్షణ వస్తుంది.
  4. బుధుడు: గ్రహాల రాకుమారుడు అనుగ్రహం కోసం సమాజంలో అణగారిన లేదా తరచుగా అణగదొక్కబడిన వ్యక్తులకు సహాయం చేయడం ద్వారా.. మీ జాతకంలో కమ్యూనికేషన్, తెలివితేటలు, వ్యాపార చతురతను నియంత్రించే బుధుడు స్థానాన్ని మెరుగుపరుడుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. బృహస్పతి: దేవ గురువు బృహస్పతి స్థానం మెరుగుపడేందుకు జ్ఞానం, చదువు తెలివి తేటలకు అంకితభావంతో చేసే చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి చర్యలతో బృహస్పతి ప్రతిఫలం ఇస్తాడు. ఇది ఆధ్యాత్మిక వృద్ధి, శ్రేయస్సు, అదృష్టానికి దారితీస్తుంది.
  7. శుక్రుడు: అంధులు లేదా దృష్టి లోపం ఉన్నవారికి సహాయం చేయండి. దృష్టి లోపం ఉన్నవారికి సేవ చేయడం వల్ల శుక్రుడు బలపడతాడు. ఇది సంబంధాలలో ప్రేమ, అందం , సామరస్యాన్ని పెంచుతుంది.
  8. శనీశ్వరుడు: పేదలకు .. లేదా కాలు వైకల్యం కారణంగా శారీరకంగా లేదా శ్రమతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయం చేయడం వలన శనీశ్వరుడు సంతోషపడతాడు. ఈ చర్యలు సహనం, కర్మలను సమతుల్యతను తెస్తుంది.
  9. రాహువు: నాడీ సంబంధిత లేదా ముఖ వైకల్యాలున్న వ్యక్తులకు సహాయం అందించడం వల్ల రాహువు ప్రభావం మెరుగుపడుతుంది, గందరగోళం, మానసిక అశాంతిని తగ్గించడంలో సహాయపడుతుంది.
  10. కేతువు: మెడ క్రింద వైకల్యం ఉన్నవారికి సేవ చేయడం ద్వారా.. కేతువును సంతోషపరచవచ్చు. ఆధ్యాత్మిక వృద్ధికి, భౌతిక చిక్కుల నుంచి బయటపడేందుకు, నిర్లిప్తత నుంచి బయటపడేందుకు ఈ చర్యలు మంచి సహాయకారి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.