AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్యమతస్థుడిని పెళ్లి చేసుకున్న కూతురు.. బతికి ఉండగానే పిండం పెట్టిన తల్లిదండ్రులు.. ఎక్కడంటే..

పిల్లల భవిష్యత్ కు బంగారు బాట వేయాలని తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పెంచి తమ శక్తికి మించి కష్టపడతారు. అంతేకాదు పిల్లలకు పెళ్లి చేయడం అనే విషయం గురించి తల్లిదండ్రులు కనే కల గురించి ఎంత చెప్పినా తక్కువే.. తమ పిల్లలు అడిగీఅడగక ముందే అన్నీ ఇచ్చే తల్లిదండ్రులు పెళ్లి విషయంలో మాత్రం తమకు నచ్చిన వారినే పిల్లలు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు ప్రేమించిన యువకుడితో పెళ్లి జరిపించమంటే సర్వసాధారణంగా నో చెబుతారు. అలా తమని కాదని వెళ్లి పెళ్లి చేసుకున్న కూతురుని పరువు కోసం చంపేసే తల్లిదండ్రులు ఉన్నారు.. తమ కూతురు తమకు నచ్చని యువకుడిని పెళ్లి చేసుకుందని బతికి ఉండగానే హిందూ సంప్రదాయం ప్రకారం శ్రాద్ధకర్మలు నిర్వహించారు. ఎక్కడంటే..

అన్యమతస్థుడిని పెళ్లి చేసుకున్న కూతురు.. బతికి ఉండగానే పిండం పెట్టిన తల్లిదండ్రులు.. ఎక్కడంటే..
Love Marraige
Surya Kala
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 24, 2025 | 6:30 PM

Share

పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో వేరే మతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది ఒక యువతి. దీంతో ఆ యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహించి.. ఆ యువతి జీవించి ఉండగానే హిందూ సాంప్రదాయ పద్దతిలో శ్రాద్ధ కర్మలను నిర్వహించారు. తమ కూతురు చదువు ఇంకా పూర్తి కాలేదని.. కనీసం డిగ్రీ కూడా కంప్లీట్ చేయని తమ కూతురు ఇలా ప్రేమించి తమ అంగీకారం లేకుండా పెళ్లి చేసుకుని తమ ఫ్యామిలీకి సమాజంలో అపకీర్తి, అగౌరవం తెచ్చిపెట్టిందని.. వాపోయారు. కుటుంబం అన్నా.. తల్లిదండ్రుల మాట అన్నా లెక్కలేని తమ కూతురు బతికి ఉన్నా తమకు చనిపోయినట్లు లెక్క అని చెప్పారు.

యువతి చేసుకున్న పెళ్లి విషయంపై యువతి మేనమామ సోమనాథ్ బిశ్వాస్ మాట్లాడుతూ.. తన మేనకోడలి పెళ్లి వైభవంగా చేయాలనీ భావించమని.. అందుకనే మంచి సంబంధం చూసి పెళ్లి నిశ్చయం చేశామని..అయితే మా మాట వినడానికి కూడా ఇష్టపడలేదు.. మమ్మల్ని విడిచి పెట్టి.. చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలి వేరే వ్యక్తితో పారిపోయింది. వేరే చోట వివాహం చేసుకుందని చెప్పారు. ఆ యువతి పెళ్లి జరిగిన 12 రోజుల తర్వాత తాము తన మేనకోడలు మరణించినట్లు భావించి ఈ పిండ ప్రదానం ఆచారం నిర్వహించామని హిందూ సంప్రదాయం ప్రకారం తలలు గుండు కొట్టించు కోవడంతో సహా అన్ని ‘శ్రద్ధ’ ఆచారాలను అనుసరించామని తెలిపారు. పూజారి వేడుక నిర్వహించిన చోట ఆ యువతి ఫోటోకి పూలమాల వేశారు.

ఇదే విషయంపై యువతి తల్లి మాట్లాడుతూ.. తమ మాటకు విలువ ఇవ్వకుండా ఇంటి నుంచి పారిపోయిన తమ కూతురు తనకు బతికి ఉన్నా చచ్చినట్లేనని.. అందుకనే తన కూతురుకి సంబంధించిన వ్యక్తిగత వస్తువులన్నింటినీ తగలబెట్టాము” అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఏమి జరిగిందంటే..

నాడియా జిల్లాలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినికి కుటుంబ సభ్యులు వివాహం ఏర్పాటు చేశారు. అయితే ఆ యువతి పెళ్లిని తిరస్కరించింది.. పెళ్లి వద్దంటూ తిరుగుబాటు చేసింది. కుటుంబంలో అనేకసార్లు గొడవలు జరిగిన తర్వాత, ఆమె వేరే మతానికి చెందిన యువకుడితో ఇల్లు వదిలి వెళ్లిపోయింది. వేరే చోట పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న 12 రోజుల తర్వాత ఫ్యామిలీ బతికి ఉండగానే మరణించిన వ్యక్తికీ నిర్వహించినట్లు ఇప్పుడు కర్మలు నిర్వహించారు.

అయితే అమ్మాయి తండ్రి విదేశాల్లో పనిచేస్తున్నాడ. అయితే తన భార్య, కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇచ్చాడని బిశ్వాస్ తెలిపారు. ఆ యువతి జిల్లాలో వేరే చోట తన అత్తమామల వద్ద ఉందని, మనస్తత్వవేత్తలు ఆమెకు కౌన్సెలింగ్ ఇస్తున్నారని ఆ కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. “ఈ సంఘటన గురించి మాకు తెలిసింది. అయితే ఆ యువతి మేజర్ కనుక మేము సొంతంగా ఎటువంటి చర్య తీసుకోలేము. ఈ విషయంలో ఎవరూ ఫిర్యాదు కూడా అందలేదని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..
స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..