AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Jobs 2025: ఎలాంటి రాత పరీక్ష లేకుండానే యూపీఎస్సీలో భారీగా కొలువులు.. డిగ్రీ అర్హత ఉంటే చాలు!

కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో గ్రూప్-ఏ, బీ స్థాయి ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను..

UPSC Jobs 2025: ఎలాంటి రాత పరీక్ష లేకుండానే యూపీఎస్సీలో భారీగా కొలువులు.. డిగ్రీ అర్హత ఉంటే చాలు!
UPSC ORA Jobs
Srilakshmi C
|

Updated on: Jun 25, 2025 | 6:00 AM

Share

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో గ్రూప్-ఏ, బీ స్థాయి ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 462 అసిస్టెంట్ డైరెక్టర్ (బ్యాంకింగ్), అసిస్టెంట్ డైరెక్టర్ (కార్పొరేట్ లా), కంపెనీ ప్రాసిక్యూటర్, డిప్యూటీ సూపరింటెండింగ్ హార్టికల్చరిస్ట్, డిప్యూటీ ఆర్కిటెక్ట్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ (నాన్ మెడికల్) తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు జూన్‌ 14వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు ఇలా..

  • అసిస్టెంట్ డైరెక్టర్ (బ్యాంకింగ్) పోస్టుల సంఖ్య: 02
  • అసిస్టెంట్ డైరెక్టర్ (కార్పొరేట్ లా) పోస్టుల సంఖ్య: 03
  • కంపెనీ ప్రాసిక్యూటర్ పోస్టుల సంఖ్య: 25
  • డిప్యూటీ సూపరింటెండింగ్ హార్టికల్చరిస్ట్ పోస్టుల సంఖ్య: 02
  • డిప్యూటీ ఆర్కిటెక్ట్ పోస్టుల సంఖ్య: 16
  • అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టుల సంఖ్య: 03
  • డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ (నాన్ మెడికల్) పోస్టుల సంఖ్య: 15
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ (కార్డియాక్ అనస్థీషియా) పోస్టుల సంఖ్య: 3
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ (డెర్మటాలజీ) పోస్టుల సంఖ్య: 04
  • స్పెషలిస్ట్ గ్రేడ్-3 (మైక్రోబయాలజీ) పోస్టుల సంఖ్య: 11
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఆప్తాల్మాలజీ) పోస్టుల సంఖ్య: 08
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ (పబ్లిక్ హెల్త్) పోస్టుల సంఖ్య: 09
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ (రేడియోథెరపీ) పోస్టుల సంఖ్య: 08
  • మెడికల్ ఫిజిసిస్ట్ పోస్టుల సంఖ్య: 02
  • డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (టెక్నికల్): 13
  • సైంటిస్ట్-బీ (జియాలజీ) పోస్టుల సంఖ్య: 01
  • ఇతర పోస్టులు ఉన్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీఏ, బీఆర్క్‌, బీఎస్సీ, బీటెక్‌, బీఈ, ఎల్‌ఎల్‌బీ, ఎంబీబీఎస్‌, డీఎన్‌బీ, సీఏ, ఎంఎస్సీ, డిప్లొమా, ఎంవీఎస్‌సీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ, ఎంసీహెచ్‌, డీఎంలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వయో పరిమితి పోస్టులను అనుసరించి 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌ ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులను జూలై 3, 2025వ తేదీ వరకు స్వీకరిస్తారు. దరఖాస్తు ఫీజు కింద జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ.25 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/మహిళా/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది. ఇతర వివరాలు ఈ కింది అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

యూపీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..