Ayodhya: రాంలాలా ప్రాణ ప్రతిష్ఠకు హాజరయ్యే అతిథులకు ఏం బహుమతి ఇవ్వబోతున్నారో తెలుసా?
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో జనవరి 22న జరగనున్న రాంలాలా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి పలు ప్రత్యేక సన్నాహాలు చేస్తున్నారు. ఆ కోదండ రాముని దివ్య దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు కోట్లాది మంది భక్తులు. రామలల్లా దీక్షకు హాజరయ్యే అతిథులకు స్వాగతం పలికేందుకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తరపున సన్నాహాలు ప్రారంభించారు.
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో జనవరి 22న జరగనున్న రాంలాలా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి పలు ప్రత్యేక సన్నాహాలు చేస్తున్నారు. ఆ కోదండ రాముని దివ్య దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు కోట్లాది మంది భక్తులు. రామలల్లా దీక్షకు హాజరయ్యే అతిథులకు స్వాగతం పలికేందుకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తరపున సన్నాహాలు ప్రారంభించారు. ఇదిలా ఉంటే ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి వచ్చే విశిష్ట అతిథులకు ‘రామరాజ్’ బహుమతిగా ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చాయి.
రామలల్లా ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరయ్యే అతిథులందరికీ చిరస్మరణీయ బహుమతులు ఇవ్వాలని ట్రస్ట్ ప్లాన్ చేసింది. రామ మందిరం తవ్వకం సమయంలో వెలికితీసిన మట్టిని (రామరాజ్) అతిథులందరికీ బహుమతిగా ఇస్తారు . దేశీ నెయ్యితో చేసిన ప్రత్యేక మోతీచూర్ లడ్డూలను కూడా అతిథులందరికీ ప్రసాదంగా అందజేస్తారు.
రామమందిరం కార్యక్రమానికి దాదాపు లక్ష మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ పోలీసుల నుండి అనేక కేంద్ర ఏజెన్సీలు కూడా ఈ ఘట్టం కోసం అప్రమత్తంగా ఉన్నాయి. అంతేకాకుండా సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత పోస్టులు పెట్టే సంఘ వ్యతిరేక వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచారు. అయోధ్య నగరమంతా డ్రోన్లతో నిఘా పెట్టారు. ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా మొత్తం రీహార్సల్ కూడా చేశారు..డ్రోన్లతో ఆలయం దగ్గర నిఘా పటిష్టం చేశారు.
మరోవైపు రాముడికి కానుకలుగా పంపిన పలు వస్తువులు అయోధ్యకు చేరుకోబోతున్నాయి. 1100 కిలోల బరువున్న దీపం గుజరాత్‌లోని బరోడా నుండి అయోధ్యకు చేరుకుంది. కోట్లాది మంది భక్తులు ఆ కోదండ రాముడి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠా రోజు ఉపయోగించేందుకు అగరబత్తిలను మధురలో తయారు చేశారు. దీన్దయాల్ గౌశాల కమిటీ దీనిని మధుర నుంచి అయోధ్యకి తీసుకువచ్చారు. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్టను పురస్కరించుకొని దేశమంతా శ్రీరామనామ జపం జరుగుతోంది.ఈ క్రమంలో బంగారం, వెండితో తయారు చేసిన శ్రీరాముడి విగ్రహాల అమ్మకాలు భారీగా పెరిగాయి.శ్రీరామ దర్బార్ చిత్రాలకు కూడా డిమాండ్ భారీగా ఉంది..
మరిన్ని అధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…