Ayodhya: రాముడిపై చేనేత కార్మికుడి భక్తి.. రామయ్య జీవితంలో ముఖ్య ఘట్టాల సహా ఎన్నో ప్రత్యేకతలు ఈ పట్టు చీర సొంతం..

పట్టు వస్త్రంపై రామకోటి నామాలను మగ్గంపై నేసి... తన భక్తిని చాటుకున్నాడు. దాదాపు నాలుగు నెలల పాటు నేసిన పట్టు వస్త్రంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రామాయణంలోని ముఖ్యమైన 400 ఘట్టాలను పట్టు వస్త్రానికి రెండు వైపులా పట్టుతో నేచి రామాయణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించాడు. 160 అడుగుల పొడవున్న ఈ పట్టు వస్త్రంలో 13 భాషలలో జైశ్రీరామ్ అని రామకోటి నామాన్ని నేశాడు.                 

Ayodhya: రాముడిపై చేనేత కార్మికుడి భక్తి.. రామయ్య జీవితంలో ముఖ్య ఘట్టాల సహా ఎన్నో ప్రత్యేకతలు ఈ పట్టు చీర సొంతం..
Rama Koti Saree
Follow us

|

Updated on: Jan 13, 2024 | 3:25 PM

అయోధ్య రామయ్యకు అపురూప వస్త్రం.. పట్టు వస్త్రంపై రామకోటి.. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామ మందిరానికి అద్భుతమైన పట్టు వస్త్రాన్ని నేసిన సత్యసాయి జిల్లా ధర్మవరంకి చెందిన చేనేత కళాకారుడు.  ఆ పట్టువస్త్రంలో అన్నీ ప్రత్యేకతలే.. రామకోటిని పట్టు వస్త్రంపై నేసి తన భక్తిని చాటుకున్నాడు చేనేత కళాకారుడు నాగరాజు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆ పట్టు వస్త్రాన్ని అయోధ్యలో రామ మందిరానికి అందించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. అయోధ్యలోని రామ మందిరానికి అందించే ఆ పట్టు వస్త్రం గురించి ఈ రోజు తెలుసుకుందాం..

కరోనా లాక్డౌన్ సమయంలో ఏం చేయాలో తోచక వినూత్నంగా ఆలోచించాడు ఆ చేనేత కళాకారుడు.  ఇప్పటి వరకు ఎవరూ చేయని ఆ పని చేశాడు చేనేత కళాకారుడు. పట్టు వస్త్రంపై రామకోటి నామాలను మగ్గంపై నేసి… తన భక్తిని చాటుకున్నాడు. దాదాపు నాలుగు నెలల పాటు నేసిన పట్టు వస్త్రంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రామాయణంలోని ముఖ్యమైన 400 ఘట్టాలను పట్టు వస్త్రానికి రెండు వైపులా పట్టుతో నేచి రామాయణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించాడు. 160 అడుగుల పొడవున్న ఈ పట్టు వస్త్రంలో 13 భాషలలో జైశ్రీరామ్ అని రామకోటి నామాన్ని నేశాడు.

నాలుగు నెలల పాటు కష్టపడి చేతిమగ్గం మీద ఈ రామకోటి పట్టు వస్త్రాన్ని తయారు చేయడం నిజంగా అద్భుతంగానే ఉంది. రామాయణంలో ముఖ్యమైన దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం నుంచి లంకాధీశీడు రావణాసురుడి సంహారం అనంతరం సీతాదేవితో రామయ్య పట్టాభిషేకం వరకు ముఖ్యమైన ఘట్టాలన్నింటిని పట్టు వస్త్రం రెండు అంచుల నేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు నాగరాజు. ఈ అద్భుతమైన పట్టువస్త్రం చూసేందుకు చుట్టుపక్కల వారందరూ కూడా నాగరాజు ఇంటికి వస్తున్నారు. పట్టు వస్త్రం రెండు అంచుల రామాయణంలోని ఘట్టాలను పొందుపరిస్తే.. ఇక మధ్యలో ఉన్న పట్టు వస్త్రం మొత్తం 13 భాషల్లో జై శ్రీరామ్ నామంతో రామకోటి నేశాడు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, ఒరిస్సా, గుజరాత్, బెంగాలీ ఇంగ్లీష్, పంజాబీ, భాషలతోపాటు రామాయణంలో లంకాదీశీడు రావణాసురుడు పాత్ర కూడా చాలా ముఖ్యమైనది.  అందుకే శ్రీలంక సింహళి భాషను కూడా పట్టు వస్త్రంపై నేశాడు.

ఇవి కూడా చదవండి

తన ఈ ప్రయత్నం పట్టు వస్త్రం నేయడంతో ఆగదంటున్నాడు చేనేత కళాకారుడు నాగరాజు.. ఇంతటి అద్భుతమైన పట్టు వస్త్రాన్ని ఆ రామయ్య చెంతకు చేర్చడమే తన ప్రధాన ఉద్దేశం అంటున్నాడు.  అయోధ్యలోని రామ మందిరానికి ఈ పట్టు వస్త్రాన్ని బహురించాలనుకుంటున్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా అయోధ్య రామ మందిరానికి ఈ పట్టు వస్త్రాన్ని సమర్పించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. రాముడిపై తనకున్న భక్తే ఇంతటి అద్భుతమైన పట్టు వస్త్రం తయారు చేయడానికి ముందుకు నడిపించింది అంటున్నాడు చేనేత కళాకారుడు నాగరాజు. తన భర్త ఇంతటి అద్భుతమైన పట్టు వస్త్రాన్ని రూపొందించడం చాలా సంతోషంగా ఉంది అంటున్నారు నాగరాజు భార్య. 8 చీరల పొడవున్న ఈ పట్టు వస్త్రంలో రామాయణంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు జైశ్రీరామ్ నామంతో రామకోటి రాయడం నిజంగా అద్భుతం అంటున్నారు నాగరాజు భార్య.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విమర్శలకు దారి తీసిన వీడియో.. క్షమాపణలు చెప్పిన ఫ్లిప్‌కార్ట్‌
విమర్శలకు దారి తీసిన వీడియో.. క్షమాపణలు చెప్పిన ఫ్లిప్‌కార్ట్‌
ఫిబ్రవరిలో బాధితురాలు మాట్లాడిన ఆడియోను రిలీజ్‌ చేసిన హర్షసాయి
ఫిబ్రవరిలో బాధితురాలు మాట్లాడిన ఆడియోను రిలీజ్‌ చేసిన హర్షసాయి
క్టోబర్‏లో ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‏లు ఇవే..
క్టోబర్‏లో ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‏లు ఇవే..
ఈ వెజిటబుల్ జ్యూస్‌లో చక్కెర కలిపి రాసుకుంటే తెల్లజుట్టు కు చెక్
ఈ వెజిటబుల్ జ్యూస్‌లో చక్కెర కలిపి రాసుకుంటే తెల్లజుట్టు కు చెక్
హైడ్రా హడల్‌.. మహిళ ఆత్మహత్యపై స్పందించిన రంగనాధ్..
హైడ్రా హడల్‌.. మహిళ ఆత్మహత్యపై స్పందించిన రంగనాధ్..
పరగడుపున అరటి పండు తింటే ఏమవుతుంది.. లాభమా.. నష్టమా..?
పరగడుపున అరటి పండు తింటే ఏమవుతుంది.. లాభమా.. నష్టమా..?
దేవర ఫస్ట్ డే కలెక్షన్స్.. దిమ్మతిరిగిపోవాల్సిందే..
దేవర ఫస్ట్ డే కలెక్షన్స్.. దిమ్మతిరిగిపోవాల్సిందే..
డ్రైవర్‌ సహా మంటల్లో తగలబడిపోతున్న కారు.. స్థానికులు ఏం చేశారంటే
డ్రైవర్‌ సహా మంటల్లో తగలబడిపోతున్న కారు.. స్థానికులు ఏం చేశారంటే
సెయిల్‌లో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ విలీనం..! అదే జరిగితే..
సెయిల్‌లో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ విలీనం..! అదే జరిగితే..
మహిళల్లో కనిపించే ఈ లక్షణాలు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు..
మహిళల్లో కనిపించే ఈ లక్షణాలు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!